అద్దంకి దయాకర్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, సినీ నటుడు.[2] ఆయన తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2014, 2018, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.

అద్దంకి దయాకర్

వ్యక్తిగత వివరాలు

జననం 1971
నమ్మికల్ గ్రామం, ఆత్మకూరు (ఎస్) మండలం, సూర్యాపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం[1]
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు రామలచ్చు
నివాసం హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం

రాజకీయ జీవితం

మార్చు

అద్దంకి దయాకర్ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసి తెలంగాణ  ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ ప్రారంభించి అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా 2014లో 1,847 ఓట్లతో, 2018లో 2,379 స్వల్ప ఓట్ల తేడాతో పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు 2023లో టికెట్ దక్కలేదు.[3]

వివాదాలు

మార్చు

దయాకర్ కోమటిరెడ్డి మునుగోడు నియోజకవర్గం చండూరులో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభలో ఆయన కోమటిరెడ్డి సోదరులను ఉద్దేశించి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పార్టీలో ఉంటే ఉండు.. లేకపోతే లేదన్నట్లుగా మాట్లాడిన వ్యాఖ్యలు వివాదాస్పదమయింది. ఆయన వాడిన పదాలపై పార్టీలో తీవ్ర విమర్శలు రావడంతో కోమ‌టిరెడ్డి అభిమానులు టీపీసీసీ క్ర‌మ‌శిక్ష‌ణా క‌మిటీకి ఫిర్యాదు చేయడంతోక్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ చైర్మ‌న్ చిన్నారెడ్డి అద్దంకి దయాకర్ కు షోకాజ్ నోటీసు జారీ చేయగా ఈ నోటీసులు అందుకున్న తరువాత ద‌యాక‌ర్ స్పందిస్తూ తాను ఏదో ఆవేశంలో నోరు జారి అలా మాట్లాడాన‌ని తాను వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపి వెంక‌ట్ రెడ్డికి వ్యక్తిగ‌తంగా బేషరతుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు.[4][5]

మూలాలు

మార్చు
  1. "Addanki Dayakar 2018 Election Affidavit". 2018. Archived from the original on 11 January 2024. Retrieved 11 January 2024.
  2. 10TV Telugu (25 December 2021). "కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ హీరోగా 'పాన్ ఇండియా మూవీ'" (in Telugu). Archived from the original on 11 January 2024. Retrieved 11 January 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. A. B. P.Desam (23 March 2024). "కాంగ్రెస్‌లో అద్దంకి దయాకర్‌కు పదేపదే నిరాశ - రేవంత్ మాట కూడా చెల్లడం లేదా ?". Archived from the original on 23 March 2024. Retrieved 23 March 2024.
  4. Andhrajyothy (6 August 2022). "నోరు జారాను..? క్షమాపణలు". Archived from the original on 18 January 2024. Retrieved 18 January 2024.
  5. HMTV (6 August 2022). "కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి అద్దంకి దయాకర్‌ క్షమాపణలు". Archived from the original on 18 January 2024. Retrieved 18 January 2024.