తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం
నల్గొండ జిల్లా లోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ నియోజకవర్గంలో 6 మండలాలు ఉన్నాయి. ఇది షెడ్యూల్ కులాల రిజర్వ్ నియోజకవర్గం. 2016లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ లో భాగంగా సూర్యాపేట జిల్లా ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఈ నియోజకవర్గం లో రెండు కొత్త మండలాలను కూడా ఏర్పాటు చేసారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గం సూర్యాపేట జిల్లాలో భాగం.
ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు సవరించు
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు సవరించు
ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి. తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం 1967లో ఏర్పడింది. తొలి ఎన్నికల్లో భీమిరెడ్డి నరసింహారెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నర్సింహారెడ్డి సోదరి మల్లు స్వరాజ్యం 1978,1983 ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. రాంరెడ్డి దామోదర్‌రెడ్డి 1985, 1989, 1994లలో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నేదురుమల్లి జనార్ధనరెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు.[1][2]
సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2018 96 తుంగతుర్తి ఎస్సీ - రిజర్వ్ గాదరి కిషోర్ కుమార్ మగ తెలంగాణ రాష్ట్ర సమితి అద్దంకి దయాకర్ మగ భారత జాతీయ కాంగ్రెస్ 2014 96 తుంగతుర్తి ఎస్సీ - రిజర్వ్ గాదరి కిషోర్ కుమార్ మగ తెలంగాణ రాష్ట్ర సమితి 64382 అద్దంకి దయాకర్ మగ భారత జాతీయ కాంగ్రెస్ 62003 2009 96 తుంగతుర్తి ఎస్సీ - రిజర్వ్ మోత్కుపల్లి నర్సింహులు మగ తెలుగుదేశం పార్టీ 80888 గుడిపాటి నర్సయ్య మగ భారత జాతీయ కాంగ్రెస్ 69025
2004 ఎన్నికలు సవరించు
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన రాంరెడ్డి దామోదర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావుపై 13184 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినాడు. దామోదర్ రెడ్డికి 68821 ఓట్లు రాగా, వెంకటేశ్వరరావుకు 55637 ఓట్లు లభించాయి.
మూలాలు సవరించు
- ↑ నమస్తే తెలంగాణ, నిపుణ విద్యావార్తలు (25 July 2017). "నియోజకవర్గాలు-విశేషాలు". Retrieved 22 June 2018.[permanent dead link]
- ↑ రేడియో జల్సా న్యూస్. "తుంగతుర్తి నియోజకవర్గం - సమీక్ష". www.radiojalsanews.blogspot.com. Devender Pulugujja. Archived from the original on 17 జూలై 2018. Retrieved 22 June 2018.