అధినాయకుడు
అధినాయకుడు 2012, జూన్ 1న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ కీర్తి క్రియేషన్స్ పతాకంపై ఎం.ఎల్. పద్మకుమార్ చౌదరి నిర్మాణ సారథ్యంలో పరుచూరి మురళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ, జయసుధ, లక్ష్మీ రాయ్, సలోని, కోట శ్రీనివాసరావు తదితరులు నటించగా, కల్యాణి మాలిక్ సంగీతం అందించాడు.[3] ఈ చిత్రంలో బాలకృష్ణ తొలిసారిగా త్రిపాత్రాభినయం (తాత, తండ్రి, కొడుకు పాత్రలు) చేశాడు.[4]
అధినాయకుడు (2001 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పరుచూరి మురళి |
---|---|
నిర్మాణం | ఎం.ఎల్. పద్మకుమార్ చౌదరి |
చిత్రానువాదం | పరుచూరి మురళి |
తారాగణం | నందమూరి బాలకృష్ణ, జయసుధ, లక్ష్మీ రాయ్, సలోని, కోట శ్రీనివాసరావు, |
సంగీతం | కల్యాణి మాలిక్ |
నేపథ్య గానం | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, మనో, కళ్యాణి మాలిక్, రీటా, చైత్ర అంబపూడి, నేహ |
గీతరచన | భాస్కరభట్ల రవికుమార్, రామజోగయ్య శాస్త్రి |
సంభాషణలు | పరుచూరి మురళి |
ఛాయాగ్రహణం | టి. సురేంద్ర రెడ్డి |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | శ్రీ కీర్తి క్రియేషన్స్ |
పంపిణీ | రిలయన్స్ ఎంటర్టైన్మెంట్[1] బ్లూస్కై సినిమాస్ (యుఎస్ఏ)[2] |
నిడివి | 151 నిముషాలు |
భాష | తెలుగు |
కథా నేపథ్యం
మార్చుబాబి (బాలకృష్ణ) కాంట్రాక్టులు తీసుకొని హత్యలు చేస్తుంటాడు. తాను అనాథ కాదు తనకో కుటుంబం ఉందనే విషయం తెలుసుకోవడంతోపాటు తన తండ్రి రామకృష్ణ ప్రసాద్ (బాలకృష్ణ)ని చంపేయాటనికి తననే పంపించారని అర్దం చేసుకుంటాడు. ఫ్యాక్షనిస్ట్ (ప్రదీప్ రావత్) నుంచి తన తండ్రిని రక్షించుకోవడంకోసం ఇంటికి వెళ్ళగా, కొన్ని అపార్థాల వల్ల కొడుకుని దగ్గరకు రానివ్వడు. చివరకు బాబి.. తన తండ్రికి ఎలా దగ్గరయ్యాడు, తన తాత హరిశ్చంద్ర ప్రసాద్ (బాలకృష్ణ) ఆశయాలు తెలుసుకుని ఏం చేసాడన్నది మిగతా కథ.
నటవర్గం
మార్చు- నందమూరి బాలకృష్ణ (హరిశ్చంద్ర ప్రసాద్/రామకృష్ణ ప్రసాద్/బాబీ (త్రిపాత్రాభినయం)
- లక్ష్మీ రాయ్ (దీప్తీ)
- జయసుధ (లక్ష్మీ)
- సుకన్య (రామకృష్ణ ప్రసాద్ భార్య)
- సలోని (శ్రావణి)
- ప్రదీప్ రావత్ (రామప్ప)
- ఆదిత్య మీనన్ (రామప్ప సోదరుడు)
- కోట శ్రీనివాసరావు (రాజకీయ నాయకుడు)
- మురళీ శర్మ (ఇన్స్పెక్టర్ వినాయక్)
- వేణుమాధవ్ (దొంగ)
- బ్రహ్మానందం (బ్రహ్మీ)
- చరణ్ రాజ్ (హంతకుడు)
- ఎం. ఎస్. నారాయణ
- యనమదల కాశీ విశ్వనాథ్ (మంత్రి)
- అమిత్ తివారి
- సబ్బా
- రెహమాన్ (రామకృష్ణ ప్రసాద్ సోదరుడు)
- జాన్ కొక్కెన్
సాంకేతికవర్గం
మార్చు- కథ, స్ర్కీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: పరుచూరి మురళి
- నిర్మాత: ఎం.ఎల్. పద్మ కుమార్ చౌదరి
- నిర్మాణ సంస్థ: శ్రీ కీర్తి క్రియేషన్స్
- ఛాయాగ్రహణం: టి. సురేంద్ర రెడ్డి
- కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
- సంగీతం: కల్యాణి మాలిక్
- పాటలు: భాస్కరభట్ల రవికుమార్, రామజోగయ్య శాస్త్రి
- గాయకులు: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, మనో, కళ్యాణి మాలిక్, రీటా, చైత్ర అంబపూడి, నేహ
- కళ: చిన్నా
- నృత్యం: నోబుల్, ప్రేమ్ రక్షిత్, రఘు, పపి
- స్టిల్స్: రఘునాథ్ జూపల్లి
- పోరాటాలు: రామ్ లక్ష్మణ్
పాటలు
మార్చుఈ చిత్రానికి కల్యాణి మాలిక్ సంగీతం అందించగా, ఆదిత్యా మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "ఓలమ్మీ అమ్మీ (రచన: భాస్కరభట్ల రవికుమార్)" | భాస్కరభట్ల రవికుమార్ | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, రీటా | 4:30 |
2. | "గురుడా ఇలా రార (రచన: భాస్కరభట్ల రవికుమార్)" | భాస్కరభట్ల రవికుమార్ | మనో, రీటా | 4:11 |
3. | "ఊరంతా (రచన: భాస్కరభట్ల రవికుమార్)" | భాస్కరభట్ల రవికుమార్ | కళ్యాణి మాలిక్ | 3:52 |
4. | "మస్త్ జవానీ (రచన: రామజోగయ్య శాస్త్రి)" | రామజోగయ్య శాస్త్రి | ఎస్.పి. బాలు, చైత్ర అంబడిపూడి | 3:53 |
5. | "అందం ఆకుమడి (రచన: భాస్కరభట్ల రవికుమార్)" | భాస్కరభట్ల రవికుమార్ | మనో, నేహ | 3:49 |
6. | "అదిగో (రచన: భాస్కరభట్ల రవికుమార్)" | భాస్కరభట్ల రవికుమార్ | కళ్యాణి మాలిక్ | 3:05 |
మొత్తం నిడివి: | 25:20 |
విడుదల - స్పందన
మార్చుచాలా రోజులు వాయిదాపడిన తరువాత 2012, జూన్ 1న ఈ చిత్రం విడుదలయింది.[5]
రేటింగ్
మూలాలు
మార్చు- ↑ B.V.S., Prakash. "Reliance comes to T'town". Deccan Chronicle. Archived from the original on 12 మే 2012. Retrieved 5 జూన్ 2020.
- ↑ "News: Adhinayakudu in US by BlueSky". Telugucinema.com. Archived from the original on 24 జూన్ 2012. Retrieved 5 జూన్ 2020.
- ↑ "Adinayakudu – Telugu Movie Reviews, Trailers, Wallpapers, Photos, Cast & Crew, Story & Synopsis – entertainment.oneindia.in". Social Post. Popcorn.oneindia.in. Archived from the original on 24 మే 2012. Retrieved 5 జూన్ 2020.
- ↑ "Adhinayakudu will be biggest hit: Producer – Telugu Movie News". IndiaGlitz. 12 December 2011. Archived from the original on 11 జనవరి 2012. Retrieved 5 June 2020.
- ↑ "'Adhinayakudu' to have lot of masala and politics". CNN-IBN. Archived from the original on 3 డిసెంబరు 2013. Retrieved 5 June 2020.
- ↑ "Adhinayakudu". The Times of India. Retrieved 5 June 2020.
- ↑ "Adhinayakudu Review – Balakrishna Movie". Supergoodmovies.com. 1 జూన్ 2012. Archived from the original on 3 జూన్ 2012. Retrieved 5 జూన్ 2020.