అనంత ఉదయభాస్కర్
అనంత సత్య ఉదయభాస్కర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2021లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[1]
అనంత ఉదయభాస్కర్ | |||
ఎమ్మెల్సీ
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 8 డిసెంబర్ 2021 - ప్రస్తుతం | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | 19 మే 1974 ఎల్లవరం గ్రామం, అడ్డతీగల మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
జాతీయత | భారతదేశం | ||
రాజకీయ పార్టీ | స్వతంత్ర | ||
ఇతర రాజకీయ పార్టీలు | కాంగ్రెస్ పార్టీ, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | మంగారత్నం, చక్రరావు | ||
జీవిత భాగస్వామి | లక్ష్మీదుర్గ | ||
సంతానం | మోనిక, హర్షిత |
జననం, విద్యాభాస్యం
మార్చుఅనంత ఉదయభాస్కర్ 1974 మే 19లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లా, అడ్డతీగల మండలం, ఎల్లవరం గ్రామం లో చక్రరావు, మంగారత్నం దంపతులకు జన్మించాడు. ఆయన ఎల్‌ఎల్‌బీ వరకు చదువుకున్నాడు.[2]
రాజకీయ జీవితం
మార్చుఅనంత ఉదయభాస్కర్ రాజకీయ కుటుంబం నుండి రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 2001లో కాంగ్రెస్ పార్టీ తరఫున జెడ్‌పిటిసి సభ్యునిగా, 2006 దొరమామిడి పంచాయతీ నుంచి ఎంపిటిసి సభ్యునిగా గెలిచి ఎంపిపిగా పనిచేశాడు. ఆయన ఆయన వై.యస్. రాజశేఖరరెడ్డి మరణం తరువాత కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2011లో వైసిపి జిల్లా యువజన అధ్యక్షునిగా, 2013లో రంపచోడవరం నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌గా పనిచేశాడు.
అనంత ఉదయభాస్కర్ 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో వంతల రాజేశ్వరి, నాగులపల్లి ధనలక్ష్మి గెలుపులో కీలకంగా పనిచేశాడు. ఆయన 2019లో తూర్పు గోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) చైర్మన్‌గా ఎన్నికయ్యాడు.[3] అనంత ఉదయభాస్కర్‌ను 2021లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా స్థానిక సంస్థల కోటా వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పార్టీ టికెట్ కేటాయించింది.[4] ఆయన శాసనమండలి సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికై 2021 డిసెంబరు 8న ప్రమాణ స్వీకారం చేశాడు.[5]
ఆయన డ్రైవర్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న అనంతబాబును 2022 మే 25న వైఎఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేసింది.[6]
మూలాలు
మార్చు- ↑ Andhrajyothy (27 November 2021). "ఎమ్మెల్సీగా అనంత ఉదయభాస్కర్ ఏకగ్రీవం". Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.
- ↑ Sakshi (13 November 2021). "కొనసాగుతున్న కొత్త విప్లవం". Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.
- ↑ Prajasakti (2019). "డిసిసిబి చైర్మన్‌గా అనంత ఉదయభాస్కర్" (in ఇంగ్లీష్). Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.
- ↑ Sakshi (13 November 2021). "సెంట్రల్ జైలులో ఉంచినా.. నమ్మిన జెండా వీడలేదు.. సమర్థతను గుర్తించి". Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.
- ↑ Namasthe Telangana (8 December 2021). "ప్రమాణం చేసిన వైసీపీ ఎమ్మెల్సీలు". Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.
- ↑ HMTV (25 May 2022). "వైసీపీ నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు సస్పెన్షన్". Archived from the original on 30 May 2022. Retrieved 30 May 2022.