అనసూయ సేన్‌గుప్తా (నటి)

అనసూయ సేన్‌గుప్తా (జననం 1986 సెప్టెంబరు 1) ఒక భారతీయ నటి, నిర్మాణ రూపకర్త. ఆమె చిత్ర పరిశ్రమలో స్థిరపడింది. అలాగే, ఆమె ప్రతిష్ఠాత్మక 2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అన్‌ సర్టెయిన్‌ రిగార్డ్‌ విభాగంలో ఉత్తమ నటి పురస్కారం గెలుచుకుంది. ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయురాలిగా అరుదైన ఘనత ఆమెది.[1]

అనసూయ సేన్‌గుప్తా
జననం (1986-09-01) 1986 సెప్టెంబరు 1 (వయసు 38)
జాతీయతభారతీయురాలు
వృత్తినటి, ప్రొడక్షన్ డిజైనర్
క్రియాశీల సంవత్సరాలు2009–ప్రస్తుతం
పురస్కారాలుఅన్ సెర్టైన్ రిగార్డ్ అవార్డు (2024)

ప్రారంభ జీవితం

మార్చు

ఆమె 1986 సెప్టెంబరు 1న పశ్చిమ బెంగాల్ కోల్‌కాతాలో బెంగాలీ కుటుంబంలో జన్మించింది.[2]

ఆమె జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం నుండి ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని చేసింది. అయితే, ఆమె పాత్రికేయ వృత్తిని చేపట్టాలని అనుకుంది.

కెరీర్

మార్చు

2009లో అంజన్ దత్ దర్శకత్వం వహించిన మ్యాడ్లీ బెంగాలీ (Madly Bangalee) చిత్రంలో సేన్ గుప్తా సహాయక పాత్ర పోషించింది. 2013లో ముంబైకి మారడానికి ముందు ఆమె కొంతకాలం నాటక రంగానికి పనిచేసింది. ఆమె ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరించింది.[3]

బల్గేరియన్‌ దర్శకుడు కాన్‌స్టాంటిన్‌ బొజనోవ్‌ రూపొందించిన ది షేమ్‌లెస్‌ (2024)’ చిత్రంలో ఆమె నటించింది. ఇందులో, ఆమె రేణుక అనే సెక్స్‌ వర్కర్‌ పాత్ర పోషించింది. ఈ సినిమా భారతదేశం, నేపాల్‌లలో చిత్రీకరించారు. 2024 కేన్స్‌ ఉత్సవానికి ఎంపికయిన ఈ చిత్రానికి వీక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది.

పురస్కారం

మార్చు

అనసూయ సేన్‌గుప్తా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అన్‌ సర్టెయిన్‌ రిగార్డ్‌ విభాగంలో పెర్ఫార్మెన్స్ అవార్డ్స్ ను గెలుచుకుంది. ది షేమ్‌లెస్‌ (2024) లో ఆమె నటనకు ఈ అవార్డు వరించింది.[4][5][6]

మూలాలు

మార్చు
  1. "Cannes Film Festival: కేన్స్‌లో చరిత్ర సృష్టించిన భారతీయ నటి.. 'ఉత్తమ నటి'గా అవార్డు | anasuya-sengupta-wins-un-certain-regard-best-actress-trophy-at-2024-cannes". web.archive.org. 2024-05-28. Archived from the original on 2024-05-28. Retrieved 2024-05-28.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Anasuya Sengupta Age, Date Of Birth, Movies, Award and Other". Vindhya Bhaskar. Vindhya Bhaskar. Retrieved 26 May 2024.
  3. "Who is Anasuya Sengupta? The first Indian actor to win Best Actress at Cannes once felt 'claustrophobic, lost' in Mumbai's film industry". The Indian Express. New Delhi. 25 May 2024. Retrieved 25 May 2024.
  4. "Un Certain Regard Winners List 2024". Festival de Cannes. 24 May 2024. Retrieved 25 May 2024.
  5. "Anasuya Sengupta creates history, becomes first Indian actress to win Best Actress at Cannes Film Festival". The Indian Express (in ఇంగ్లీష్). New Delhi. 25 May 2024. Retrieved 25 May 2024.
  6. "Cannes 2024: Anasuya Sengupta wins Un Certain Regard best actress trophy, creates history". The Hindu (in Indian English). 25 May 2024. Retrieved 25 May 2024.