అనామిక (2014 సినిమా)

అనామిక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 2014లో వచ్చిన తెలుగు సినిమా. విద్యా బాలన్, పరంబ్రతా ఛటర్జీ తదితరులతో 2012లో తీసిన హిందీ సినిమా కహానీ ఆధారంగా దీపక్ ధర్, రజనీష్ కనుజాలు దీనిని తెలుగులో అనామిక పేరుతోనూ, తమిళ భాషలో నీ ఎంగె ఎన్ అన్బె అనే పేరుతోనూ పునర్నిర్మించారు.

అనామిక
అనామిక పోస్టర్
దర్శకత్వంశేఖర్ కమ్ముల
స్క్రీన్ ప్లేయండమూరి వీరేంద్రనాథ్
శేఖర్ కమ్ముల
దీనిపై ఆధారితంకహానీ  
by సుజయ్ ఘోష్
అద్వైత కళ
నిర్మాతదీపక్ ధర్
సమీర్ గొగాటే
రజనీష్ కనూజా
సమీర్ రాజేంద్రన్
తారాగణంనయనతార
వైభవ్ రెడ్డి
పశుపతి
హర్షవర్ధన్ రాణే
ఛాయాగ్రహణంవిజయ్ సి.కుమార్
కూర్పుమార్తాండ్ కె.వెంకటేష్
సంగీతంఎం.ఎం.కీరవాణి
నిర్మాణ
సంస్థలు
లాగ్‌లైన్ ప్రొడక్షన్స్
సెలెక్ట్ మీడియా హోల్డింగ్స్
విడుదల తేదీ
1 మే 2014 (2014-05-01)
సినిమా నిడివి
145 నిమిషాలు
దేశంభారతదేశం
భాషలుతెలుగు
తమిళ్

నటీనటులు

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

ఉద్యోగ నిమిత్తం భారతదేశం వచ్చి అడ్రస్ లేకుండా పోయిన తన భర్తను వెతుక్కుంటూ విదేశం నుండి హైదరాబాద్‌కు వస్తుంది అనామిక! ఎయిర్ పోర్టులో విమానం దిగీదిగడమే ఓల్డ్ సిటీలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి ఫిర్యాదు చేస్తుంది. తన భర్త అజయ్ శాస్త్రి గత కొంత కాలంగా కనిపించడం లేదని, అతని ఆచూకి తెలియచేయమని కోరుతుంది. పోలీస్ స్టేషన్‌లో మిశ్రమ స్పందన లభించినా... పార్థసారథి అనే పోలీస్ అధికారి మాత్రం ఆమెకు సాయం చేయడానికి ముందుకొస్తాడు. దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చేవరకూ తాను ఇక్కడే ఉంటానంటూ అనామిక| ఓల్డ్ సిటీలోని గెలాక్స్ హెూటల్లో బసచేస్తుంది. మధ్యలో పోలీస్ ఉన్నతాధికారులతోనూ, రాజకీయ నాయకులతోనూ ఆమెకు సమస్యలు ఎదురవుతాయి. వాటిని అధిగమించి అనామిక తన భర్త అచూకీని ఎలా తెలుసుకుంది? ఆ తర్వాత ఏం జరిగిందన్నది మిగతా కథ.[1]

పాటలు

మార్చు

ఈ సినిమాలోని పాటలను సిరివెన్నెల సీతారామశాస్త్రి వ్రాయగా ఎం.ఎం.కీరవాణి బాణీలు కట్టాడు.

పాటల వివరాలు
సం.పాటగాయకుడు(లు)పాట నిడివి
1."క్షణం క్షణం"సునీత4:15
2."ద సర్చ్"సునీత1:48
3."డెడ్ ఆర్ అలైవ్"సునీత1:51
4."అద్దంలో అమ్మాయి"దీపు3:49
మొత్తం నిడివి:11:43

స్పందనలు

మార్చు
  • అనామికగా నయనతార చక్కటి నటన ప్రదర్శించింది. అమాయకులైన ప్రజలను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాది అయిన భర్తను హతమార్చే ముందు కనీసం కొన్ని బలమైన, ప్రభావవంతమైన సంభాషణలు ఉండి ఉండాల్సింది. ఇతర పాత్రలలో చెప్పుకోవాల్సింది వైభవ్ గురించి. పోలీస్ అధికారి పార్థసారథిగా అతను పాత్రోచితంగానే నటించాడు. కీరవాణి సంగీతం, సీతారామ శాస్త్రి సాహిత్యం సన్నివేశ బలాన్ని పెంచే విధంగానే ఉన్నాయి. అలానే విజయ్ సి. కుమార్ కెమెరా పనితనం చెప్పుకోదగ్గదే. పాతబస్తీ వాతావరణాన్ని చక్కగా తెరకెక్కించారు. 'కహానీ' సినిమాకు తమదైన మార్కుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని శేఖర్ కమ్ముల అనుకోవడం వల్ల 'అనామిక' చిత్రం పేలవంగా తయారైంది. బహుశా ఉత్తమ చిత్రాల దర్శకుడిగా ఇమేజ్ సంపాదించుకున్న శేఖర్ కమ్ముల కాకుండా మరెవరినైనా దర్శకుడిగా పెట్టి ఈ సినిమా యథాతథంగా తీసి ఉంటే ఫలితం కొంతలో కొంత మెరుగ్గా ఉండి ఉండేది.[1] - వడ్డి ఓంప్రకాశ్ నారాయణ్, ఫిల్మ్ జర్నలిస్ట్
  • విద్యాబాలన్ నటించిన కహాని వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాన్ని రీమేక్ చేసినప్పుడు పోలికలు అనివార్యం. అనామిక విషయంలో, శేఖర్ కమ్ముల దాదాపుగా విఫలమయ్యాడు. ఎందుకంటే అతను అసలు కథను ప్రక్కదారి మళ్ళించాడు.[2] - హేమంత్ కుమార్, టైమ్స్ ఆఫ్ ఇండియా

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 చంద్రం (19 May 2014). "'అనామిక' కహానీ చెప్పడంలో తడబడిన శేఖర్ కమ్ముల !". జాగృతి వారపత్రిక: 50. Retrieved 17 February 2024.
  2. "ANAAMIKA MOVIE REVIEW". ది టైమ్స్ ఆఫ్ ఇండియా.

బయటి లింకులు

మార్చు