వైభవ్ రెడ్డి
భారత నటుడు
వైభవ్ రెడ్డి దక్షిణ భారత చలనచిత్ర నటుడు, తెలుగు సినిమా దర్శకుడైన ఎ. కోదండరామిరెడ్డి కుమారుడు.[1] తన తండ్రి దర్శకత్వం వహించిన గొడవ (2007) సినిమాతో చలనచిత్రరంగంలోకి ప్రవేశించాడు.
వైభవ్ రెడ్డి | |
---|---|
![]() | |
జననం | సుమంత్ 1978 ఏప్రిల్ 21 |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2007 - ప్రస్తుతం |
జననం - విద్యాభ్యాసం సవరించు
వైభవ్ 1978, ఏప్రిల్ 21న నెల్లూరులో జన్మించాడు. వీరిది తెలుగు కుటుంబం. చెన్నైలోనే తన విద్యాభ్యాసం సాగింది.
సినిమారంగం సవరించు
తెలుగు సినిమా దర్శకుడైన ఎ. కోదండరామిరెడ్డి కుమారుడిగా తన తండ్రి దర్శకత్వం వహించిన గొడవ (2007) సినిమాతో చలనచిత్రరంగంలోకి ప్రవేశించిన వైభవ్, వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన సరోజ, గోవా, గ్యాంబ్లర్ (మనకథ) సినిమాలతో గుర్తింపు పొందాడు.
నటించిన చిత్రాల జాబితా సవరించు
సంవత్సరం | చిత్రంపేరు | పాత్రపేరు | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2007 | గొడవ | బాలు | తెలుగు | |
2008 | సరోజ | రాంబాబు | తమిళం | తెలుగులో సరోజగా అనువాదమైంది |
2009 | కాస్కో | వంశీ/పవన్ కళ్యాణ్ | తెలుగు | |
2010 | గోవా | రాయరాజన్ | తమిళం | |
ఈసన్ | చెజియన్ దేవనాయగమ్ | తమిళం | ||
2011 | మనకథ (గ్యాంబ్లర్) | సుమంత్ | తమిళం | |
2013 | యాక్షన్ త్రిడి | శివ | తెలుగు | |
బిర్యాని | వైభవ్ | తమిళం | అతిథి పాత్ర | |
2014 | బ్రమ్మన్ | వైభవ్ | తమిళం | అతిథి పాత్ర |
ఢమాల్ డుమీల్ | మణికందన్ | తమిళం | తెలుగులో ధనా ధన్‌గా అనువాదమైంది | |
అనామిక[2] | పార్థసారథి | తెలుగు | ||
నీ ఎంగె ఎన్ అంబె | తమిళం | |||
కప్పల్ | వాసు | తమిళం | తెలుగులో పాండవుల్లో ఒకడుగా అనువాదమైంది | |
2015 | అంబాల | శక్తి | తమిళం | తెలుగులో మగ మహా రాజుగా అనువాదమైంది |
మాస్ | ఘోష్ట్ | తమిళం | అతిథి పాత్ర
తెలుగులో రాక్షసుడిగా అనువాదమైంది | |
2016 | అరన్మనై 2 | మాయ భర్త | తమిళం | అతిథి పాత్ర
తెలుగులో కళావతిగా అనువాదమైంది |
హలో నాన్ పేయ్ పేసురెన్ | అముధన్ | తమిళం | ||
ఇరైవి | వసంత్ | తమిళం | అతిథి పాత్ర | |
ముతిన కాత్తిరికా | మాయ ప్రియుడు | తమిళం | అతిథి పాత్ర | |
చెన్నై600028 II | మరుతుపండి | తమిళం | ||
2017 | నిబునన్ | సందీప్ | తమిళం | |
విస్మయ | కన్నడం | |||
మెయాద మాన్ | తమిళం | |||
2018 | ఆర్.కె. నగర్ | తమిళం | చిత్రీకరణ | |
కాట్టేరి | తమిళం | చిత్రీకరణ |
మూలాలు సవరించు
- ↑ తెలుగు ఫిల్మీబీట్. "సినీ పీల్డ్ వద్దనుకున్నా కానీ.. కోదండరామి రెడ్డి". telugu.filmibeat.com. Retrieved 13 October 2017.[permanent dead link]
- ↑ సాక్షి (April 23, 2014). "'అనామిక' ఆడియో ఆవిష్కరణ". Retrieved 13 October 2017.
ఇతర లంకెలు సవరించు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో వైభవ్ రెడ్డి పేజీ