అనిల్ కుమార్ యాదవ్
మందాడి అనిల్ కుమార్ యాదవ్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నుండి 2024లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ నుండి కాంగ్రెస్ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు.[2]
అనిల్ కుమార్ యాదవ్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 3 ఏప్రిల్ 2024 - 2 ఏప్రిల్ 2030 | |||
నియోజకవర్గం | తెలంగాణ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 20-1-587, గొల్లకిడికి, పురానాపూల్, హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం | 1983 సెప్టెంబరు 10||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | ఎం.అంజన్ కుమార్ యాదవ్, నాగమణి | ||
జీవిత భాగస్వామి | దేవిక యాదవ్ | ||
నివాసం | 20-1-587, గొల్లకిడికి, పురానాపూల్, హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం[1] |
రాజకీయ జీవితం
మార్చుఅనిల్ కుమార్ యాదవ్ తన తండ్రి అంజన్ కుమార్ యాదవ్ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా వివిధ హోదాల్లో పని చేశాడు. ఆయన తండ్రి ఎం.అంజన్ కుమార్ యాదవ్ 2004, 2009లో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచాడు. అనిల్ కుమార్ యాదవ్ 2015 నుండి 2020 వరకు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం యువజన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసి 2018 శాసనసభ ఎన్నికల్లో ముషీరాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ చేతిలో ఓటమి పాలయ్యాడు. ఆయనను 2023లో సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా పార్టీ నియమించింది.[3]
అనిల్ కుమార్ యాదవ్ పేరును 2024లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ నుండి కాంగ్రెస్ తరపున రాజ్యసభ సభ్యుడిగా కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది.[4][5][6][7]
అనిల్ కుమార్ యాదవ్ 2024 ఏప్రిల్ 06న రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[8]
మూలాలు
మార్చు- ↑ Election Commision Of India (17 February 2024). "Anil Kumar Yadav Mandadi Election Affidavit" (PDF). Archived from the original (PDF) on 17 February 2024. Retrieved 17 February 2024.
- ↑ Andhrajyothy (14 February 2024). "కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీలు వీరే." Archived from the original on 14 February 2024. Retrieved 14 February 2024.
- ↑ Deccan Chronicle (17 June 2023). "Anil Kumar Yadav appointed as DCC Secunderabad chief" (in ఇంగ్లీష్). Archived from the original on 15 February 2024. Retrieved 15 February 2024.
- ↑ Hindustantimes Telugu (14 February 2024). "కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్". Archived from the original on 14 February 2024. Retrieved 14 February 2024.
- ↑ Eenadu (14 February 2024). "తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు వీరే". Archived from the original on 14 February 2024. Retrieved 14 February 2024.
- ↑ The Hindu (14 February 2024). "Congress names Renuka Chowdhury, Anil Yadav as Rajya Sabha nominees" (in Indian English). Archived from the original on 15 February 2024. Retrieved 15 February 2024.
- ↑ Nava Telangana (20 February 2024). "రాజ్యసభ సభ్యుడిగా అనిల్ కుమార్ యాదవ్ ఎన్నిక -". Archived from the original on 21 February 2024. Retrieved 21 February 2024.
- ↑ Andhrajyothy (7 April 2024). "రాజ్యసభ సభ్యునిగా అనిల్ కుమార్ యాదవ్ ప్రమాణ స్వీకారం". Archived from the original on 7 April 2024. Retrieved 7 April 2024.