అనిల్ దల్పత్

పాకిస్తాన్ కు చెందిన మాజీ క్రికెటర్, కోచ్

అనిల్ దల్పత్ సోనావారియా (జననం 1963, సెప్టెంబరు 20) పాకిస్తాన్ కు చెందిన మాజీ క్రికెటర్, కోచ్. లోయర్-ఆర్డర్ బ్యాట్స్‌మన్ గా, వికెట్ కీపర్ గా రాణించాడు. 1980ల ప్రారంభంలో వాసిం బారీ గాయపడిన సమయంలో కొద్దిసేపు పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించాడు. పాకిస్థాన్ తరపున టెస్టు క్రికెట్ ఆడిన తొలి హిందువు అతడే.

అనిల్ దల్పత్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అనిల్ దల్పత్ సోనావారియా
పుట్టిన తేదీ (1963-09-20) 1963 సెప్టెంబరు 20 (వయసు 61)
కరాచీ, సింధ్, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రవికెట్-కీపర్
బంధువులుడానిష్ కనేరియా (బంధువు)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు1984 మార్చి 2 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1985 ఫిబ్రవరి 9 - న్యూజీలాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 47)1984 మార్చి 26 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే1986 అక్టోబరు 27 - వెస్టిండీస్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు
మ్యాచ్‌లు 9 15
చేసిన పరుగులు 167 87
బ్యాటింగు సగటు 15.18 12.42
100లు/50లు 0/1 0/0
అత్యధిక స్కోరు 52 37
క్యాచ్‌లు/స్టంపింగులు 22/3 13/2
మూలం: Cricinfo, 2006 ఫిబ్రవరి 4

ప్రారంభ జీవితం, కుటుంబం

మార్చు

అనిల్ దల్పత్ 1963, సెప్టెంబరు 20న పాకిస్థాన్‌లోని కరాచీలో జన్మించాడు. ఇతని తండ్రి క్లబ్ క్రికెటర్, పాక్ హిందువుల క్లబ్‌ అధిపతి దల్పత్ సోనావారియా.[1]డానిష్ కనేరియాకు మొదటి బంధువు.[1][2] కరాచీలో నివసిస్తున్నాడు. పాకిస్తాన్ తరపున టెస్ట్ క్రికెట్ ఆడిన మొదటి హిందువు. వసీం బారీ రిటైర్మెంట్ తర్వాత అవకాశం ఇచ్చిన అనేక వికెట్ కీపర్లలో అనిల్ దల్పత్ ఒకడు.

కెరీర్

మార్చు

1983-84లో కరాచీలో ఇంగ్లాండ్‌తో జరిగిన అరంగేట్రంలో మంచి ఆటతీరును ప్రదర్శించడంతో పాకిస్థాన్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొమ్మిది టెస్టుల్లో 1984-85లో కరాచీలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 25 అవుట్‌లను, అత్యధిక స్కోరు 52 పరుగులు చేశాడు.[1][3]

పదవీ విరమణ తర్వాత

మార్చు

పదవీ విరమణ తర్వాత, దల్పత్ కెనడాలో కోచ్ గా ఉన్నాడు. తరువాత వ్యాపారవేత్తగా మారాడు.[1][4]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 "Cricketing Dynasties: The Twenty Two Families of Pakistan's Test Cricket – Part 5". The News International.
  2. Shukla, Jyoti (9 December 2000). "Pakistan's secret weapon". Rediff.com. Retrieved 2023-09-08.
  3. "Anil blames Imran for destroying his career". DAWN.COM. 8 August 2002.
  4. "Non-Muslims to play international cricket for Pakistan". The News. Pakistan. 20 September 2020. Retrieved 2023-09-08.