అనుపు
అనుపు , పల్నాడు జిల్లాలో కృష్ణానది తీరాన, నాగార్జున సాగర్ రిజర్వాయర్ ముంపు గ్రామం. డామ్ కుడి వైపు (లాంచ్ స్టేషను నుండి సాగరమాత దేవాలయం మీదుగా) సుమారు 8 కి.మా. దూరంలో ఉంది.[1]
చరిత్ర
మార్చుకీ.శ నాల్గవ శతాబ్దంలో బౌధ్ధమతాచార్యుడు ఆచార్య నాగార్జునుడు ఇచ్చటకు వచ్చి కృష్ణానది ఒడ్డున విశ్వవిద్యాలయాన్ని స్ధాపించారు. కాలక్రమంలో విశ్వవిద్యాలయం శిథిలమైంది.
శోధన
మార్చుభారత పునరావస్తు పరిశోధనలలో విశ్వవిద్యాలయ శిథిలాలు, అవశేషాలు తవ్వకాలలో దొరికేయి.
నాగార్జున విశ్వ విద్యాలయ అవశేషాల పునర్నిర్మాణం, అనుపు
మార్చునాగార్జున సాగర్ జలాశయ ముంపుకు ఈ ప్రాంతం గురైంది. అప్పుడు విశ్వవిద్యాలయ అవశేషాలను నాగార్జున కొండ మ్యూజియంలో పొందు పరచి శిథిలాలను అనుపు గ్రామంలో యధాతధంగా పొందు పరిచి పునర్నిర్మించారు. ఈ గ్రామ పరిసరాలను దర్శించినప్పుడు ప్రముఖ బౌధ్ద విశ్వవిద్యాలయం నలంద రేఖా మాత్రంగా గుర్తుకు వస్తుంది. సాగర్ నుండి మాచర్లకు వెళ్లే దారి నుండి మళ్లుతున్నప్పుడు ఎత్తునుండి పల్లంలో కనిపించే జలాశయం మనోహరంగా ఉంటుంది. ఆ రోజుల్లో విశ్వవిద్యాలయ ప్రాగంణంలో నిర్మించిన స్టేడియం శిథిలాల పై నుండి జలాశయం కనువిందు చేస్తుంది. నిజానికి నలందలో ఇంత దృశ్య సంపద లేదు. ఐతే నలంద యధాతధ శిథిలాలు కాగా, అనుపులో శిథిలాలు పునర్నిర్మతమైనవి. నలంద సహజ సిద్దం కాగా అనుపు పునర్నిర్మితం.
పునర్నిర్మిత నాగార్జున విశ్వవిద్యాలయ శిధిలాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-04-15. Retrieved 2015-08-05.