అనూప్ ధనక్
అనూప్ ధనక్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉక్లానా నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మనోహర్ లాల్ ఖట్టర్ మంత్రివర్గలో కార్మిక శాఖ మాజీ మంత్రిగా (స్వతంత్ర బాధ్యత) పని చేశాడు.
అనూప్ ధనక్ | |||
ఆర్కియాలజీ & మ్యూజియంలు, కార్మిక శాఖ రాష్ట్ర మంత్రి (స్వతంత్ర బాధ్యత)
| |||
పదవీ కాలం 2019 – 2024 | |||
నియోజకవర్గం | ఉక్లానా | ||
---|---|---|---|
పదవీ కాలం 2014 – 2024 | |||
ముందు | నరేష్ సెల్వాల్ | ||
తరువాత | నరేష్ సెల్వాల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
నివాసం | హర్యానా | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చుఅనూప్ ధనక్ ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి లో 2014 శాసనసభ ఎన్నికలలో ఉక్లానా నుండి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సీమా గైబీపూర్ పై సీమా గైబీపూర్ ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1] ఆయన ఆ తరువాత జననాయక్ జనతా పార్టీ (జెజెపి)లో చేరి 2019 ఎన్నికలలో జెజెపి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఆశా ఖేదర్ పై 23,693 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[2] మనోహర్ లాల్ ఖట్టర్ మంత్రివర్గంలో ఆర్కియాలజీ & మ్యూజియంలు, కార్మిక శాఖ (స్వతంత్ర బాధ్యత)తో రాష్ట్ర మంత్రిగా పని చేశాడు.[3]
అనూప్ ధనక్ వ్యక్తిగత కారణాలతో 2024 ఆగస్ట్ 17న జననాయక్ జనతా పార్టీ (జెజెపి) అన్ని పదవులకు రాజీనామా చేసి,[4] అనంతరం భారతీయ జనతా పార్టీలో చేరి,[5] 2024 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి నరేష్ సెల్వాల్ చేతిలో 28092 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[6]
మూలాలు
మార్చు- ↑ India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ The Times of India (15 November 2019). "JJP's MLA Anoop Singh Dhanak rewarded for his loyalty". Retrieved 3 November 2024.
- ↑ Hindustantimes (17 August 2024). "Haryana: Uklana MLA Anoop quits JJP ahead of assembly polls". Retrieved 3 November 2024.
- ↑ The Economic Times (1 September 2024). "Former JJP leaders Anoop Dhanak, Ram Kumar Gautam, Jogi Ram Sihag join BJP". Archived from the original on 1 September 2024. Retrieved 14 November 2024.
- ↑ The Hindu (8 October 2024). "Haryana election results | How did those who switched alliances fare?" (in Indian English). Retrieved 3 November 2024.