అనెలిడా
అనెలిడా (లాటిన్ Annelida) ద్విపార్శ్వ సౌష్టవం, త్రిస్తరిత, ఖండీభవనంగల, నిజ శరీరకుహర అకశేరుకాలు. అనెలిడా అనే పదాన్ని జె.బి.లామార్క్ (J.B.Lamarck) 1809లో ప్రప్రథమంగా ఉపయోగించాడు. లాటిన్ పదం 'ఆన్యులస్' అంటే చిన్న ఉంగరం; గ్రీకు భాషలో 'ఈడోస్' అంటే రూపం అని అర్థం. నీటిలోనూ, భూమి మీద ఉండే వానపాములు, ఇసుక పాములు, జలగలు మొదలగునవి వీనిలో ఉంటాయి. ఎక్కువగా స్వేచ్ఛగా కదులుతూ ఉంటాయి. జలగలాంటి కొన్ని జీవులకు రక్తం పీల్చుకొనే పరభక్షక అలవాట్లు ఉంటాయి.
అనెలిడా | |
---|---|
![]() | |
Glycera sp. | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Superphylum: | |
Phylum: | అనెలిడా Lamarck, 1809
|
Classes and subclasses | |
Class పాలీకీటా (paraphyletic?) |
సామాన్య లక్షణాలుసవరించు
- ఈ వర్గం జీవులలో శరీర నిర్మాణం అవయవ వ్యవస్థీకరణ ద్వారా ఏర్పడి, అవయవాలు, వాటికి సంబంధించిన వివిధ వ్యవస్థలను ఏర్పరచాయి.
- ఇవి త్రిస్తరిత జీవులు. వీటి శరీరంలో మూడు స్తరాలుంటాయి.
- ఇవి బహిస్త్వచం, అంతస్త్వచం, మధ్యత్వచం.
- వీటి దేహం పొడవుగా ఉంటుంది.
- వీటి శరీరమంతా ఉంగరాల వంటి ఖండితాలు బాహ్యంగాను, అంతర్గతంగానూ ఏర్పడతాయి. వీటిని దేహఖండాలు అంటారు.
- ఉంగరం వంటి ప్రతీ ఖండితంలోను శరీరకుహరం, నాడీ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ మొదలైన అవయవాల భాగాలు కనపడుతూ ఉంటాయి.
- ఈ విధమైన దేహ ఖండాలు గల శరీర విభజన పద్ధతికి దేహఖండీభవనం అని పేరు.
- ఖండితాల మధ్య గల అడ్డు పొరలకు ఖండితాంతర విభాజకాలు అని పేరు.
- ఈ జంతువుల శరీరాలు ద్విపార్శ్వ సౌష్టవ పద్ధతిలో ఏర్పడతాయి.
వర్గీకరణసవరించు
వీటిలో నాలుగు వర్గాలు ఉన్నాయి.అవి
- పాలికీటా దీనికి ఉదాహరణలు - ఇసుక పురుగు, సీ మౌస్, పాడల్ పురుగు, లగ్ పురుగు, పలో పురుగు.
- ఆలిగోకీటా దీనికి ఉదాహరణలు - వానపాములు
- హిరుడీనియా దీనికి ఉదాహరణలు - జలగలు
- ఆర్కి అనెలిడా దీనికి ఉదాహరణలు - పాలిగార్డియస్