అన్నపూర్ణాదేవి (1927 – 2018 అక్టోబరు 13) ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు, పద్మ భూషణ్ అవార్డు గ్రహీత. ఆమె మహైర్ ఘరానా స్థాపకుడైన ప్రముఖ సంగీత విద్వాంసుడు అల్లాఉద్దీన్ ఖాన్కు కుమార్తె మరియు శిష్యురాలు. ఆమె అసలు పేరు రోషనారా ఖాన్. మైహార్ మహారాజు బ్రిజ్ నాథ్ సింగ్ ఆమె పేరును అన్నపూర్ణాదేవిగా మార్చారు. ఆమె తన తండ్రికి శిష్యుడైన సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్ను వివాహం చేసుకున్నది. అతనితో అనేక కచేరీలను చేసింది. వీరికి ఓ కుమారుడు శుభేంద్ర శంకర్ ఉన్నారు. 1962లో రవిశంకర్ ఆమెతో విడాకులు తీసుకొని యు.ఎస్.ఎ వెళ్ళాడు. తరువాత ఆమె బయట కచేరీలను చేయలేదు. 1992లో కుమారుడు మృతి చెందిన తర్వాత అన్నపూర్ణాదేవి రూషికుమార్ పాండ్యా అనే మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌ను వివాహం చేసుకుంది. అతను 2013లో మృతి చెందాడు. ప్రముఖ సంగీత విద్వాంసులైన ఆశిష్ ఖాన్ (సరోద్), అమిత్ భట్టాచార్య (సరోద్), బహదూర్ ఖాన్ (సరోద్), బసంత్ కబ్రా (సరోద్), హరిప్రసాద్ చౌరాసియా (బన్సూరి) వంటి వారు అన్నపూర్ణాదేవి శిష్యులే కావడం గమనార్హం.[1]

అన్నపూర్ణాదేవి
జననంరోషనారా ఖాన్
1927
మైహర్, సెంట్రల్ ఇండియా ఏజెన్సీ, బ్రిటిష్ ఇండియా
మరణం2018 అక్టోబరు 13 (2018-10-13)(వయసు 90–91)
ముంబై, భారతదేశం
జీవిత భాగస్వామి
పిల్లలుశుభేంద్ర శంకర్
తల్లిదండ్రులు
 • అల్లాఉద్దీన్ ఖాన్ (తండ్రి)
బంధువులుఆలీ అక్బర్ ఖాన్ (సోదరుడు)

జీవిత విశేషాలుసవరించు

ఆమె 1927లో బ్రిటిష్ ఇండియాలోని మైహార్ (ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో ప్రాంతం) లో జన్మించింది. [2][3][lower-alpha 1] ఆమె తండ్రి అల్లాఉద్దీన్ ఖాన్ మహారాజా బ్రిజన్ సింగ్ ఆస్థానంలో సంగీత విద్వాంసుడు. మైహార్ మహారాజు బ్రిజ్ నాథ్ సింగ్ ఆమె పేరును అన్నపూర్ణాదేవిగా మార్చారు.[6] ఆమె తండ్రి అల్లాదుద్దీన్ ఖాన్ మైహార్ ఘరానాను స్థాపించాడు. తన తండ్రివద్ద విద్యాభ్యాసం చేసింది. ఆమె సోదరుడు ఆలీ అక్బర్ ఖాన్ సరోద్ విద్వాంసుడు. ఆమె మాజీ భర్త ప్రముఖ సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్ దేవ విదేసాలలో అనేక ప్రదర్శనలిచ్చాడు. వారి కుమారుడు సుభేంద్ర శంకర్ కూడా సంగీత విద్వాంసుడే.

ఆమె వివాహం 1941 మే 15న పండిట్ రవిశంకర్తో జరిగింది. వారు 1982 అక్టోబరులో విడాకులు తీసుకున్నారు. ఆమె 1982 డిసెంబరు 9 న బొంబాయిలో రుషికుమార్ పాండ్యను వివాహమాడింది. [7] రుషికుమార్ పాండ్య వివాహం నాటికి ప్రముఖ సితార విద్యాంసుడు. రుషికుమార్ ఆమె సోదరుడు ఆలీ అక్బర్ ఖాన్ సిఫారసు మేరకు 1973 నుండి ఆమె వద్ద సితార్ నేర్చుకున్నాడు. అతను 2013లో గుండెపోటుతో తన 73వ యేట మరణిచాడు.[8][9][10]

పురస్కారాలుసవరించు

 • 1977, పద్మభూషణ పురస్కారం. [11]
 • 1991, సంగీత నాటక అకాడమీ పురస్కారం.
 • 1999, దేశికోత్తం పురస్కారం. రవీంద్రనాథ్ టాగూర్ విశ్వభారతి విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్.
 • 2004, సంగీత నాటక అకాడమీ పురస్కారం, ఆమెను జీవిత కాల సాఫల్య పురస్కారం[ఉల్లేఖన అవసరం]

మూలాలుసవరించు

 1. "Unveiling the mystique of a reclusive artiste", The Hindu - 28 June 2005
 2. OEMI.
 3. 3.0 3.1 Bondyopadhyay 2005, p. 22.
 4. Lavezzoli 2006, p. 52.
 5. "1927 Chaitra Purnima, Chaitra Pournami date for Ujjain, Madhya Pradesh, India". www.drikpanchang.com (ఆంగ్లం లో). Retrieved 13 October 2018.
 6. Shuansu Khurana (16 May 2010). "Notes from behind a locked door". Indian Express. Cite news requires |newspaper= (help)
 7. Bondyopadhyay 2005, Cast.
 8. https://timesofindia.indiatimes.com/city/kolkata/Every-Note-Annapurna-Devi-Plays-Is-Like-An-Offering-Rooshikumar-Pandya/articleshow/41890785.cms
 9. http://www.metamindmanagement.com/rooshikumarpandya_profiles.htm
 10. http://archive.indianexpress.com/news/death-of-a-caregiver/1108875/
 11. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. మూలం (PDF) నుండి 15 November 2014 న ఆర్కైవు చేసారు. Retrieved July 21, 2015. Cite uses deprecated parameter |deadurl= (help); Cite web requires |website= (help)

వనరులుసవరించు

బయటి లంకెలుసవరించు


ఉదహరింపు పొరపాటు: "lower-alpha" అనే గుంపుకు <ref> ట్యాగులున్నాయి, కానీ సంబంధిత <references group="lower-alpha"/> ట్యాగేదీ కనబడలేదు. లేదా మూసే </ref> లేదు