అన్నాదమ్ముల సవాల్
(1978 తెలుగు సినిమా)
ADSWall.jpg
దర్శకత్వం కె.ఎస్.ఆర్.దాస్
తారాగణం కృష్ణ,
రజనీకాంత్
జయచిత్ర
చంద్రకళ
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ శ్రీ సారథీ స్టూడియోస్
భాష తెలుగు

కథసవరించు

అశోక్, కిశోర్ అన్నదమ్ములు. తల్లి మందులకోసం కిశోర్ దొంగతనం చేస్తాడు. అశోక్ దానిని సహించడు. ఫలితంగా కిశోర్ పారిపోతాడు. అశోక్ తన తమ్ముడు దొంగిలించిన పర్సును దాని సొంతదారుకు అప్పగించాలని వెళ్లేసరికి అక్కడ పర్సు తాలూకు కుర్రవాడి శవం ఎదురవుతుంది. యింటికి తిరిగివస్తే మంచం మీద తల్లి విగతజీవిగా కనిపిస్తుంది. పర్సు సొంతదారు తల్లిని, చెల్లిని ఆదుకోవాలని అశోక్ నిర్ణయించుకుంటాడు. స్వయంశక్తితో ఎస్టేటు యజమాని రంగబాబు అవుతాడు. కిశోర్ కూడా ఒక క్లబ్బు యజమాని పెంపకంలో పెద్దవాడవుతాడు. రాకా అనే బందిపోటు దొంగ క్లబ్బు యజమానిని, అతని కూతురును హత్యచేసి పోతాడు. హంతకుడి కోసం బయలుదేరిన కిశోర్‌కు అశోక్ ఎదురవుతాడు. కిశోర్ ఎవరో తెలియక తన చెల్లెలు జ్యోతిని ప్రేమించిన వ్యక్తిగా మాత్రమే గుర్తించి ఎస్టేట్ నుండి వెళ్లిపోవలసిందిగా ఆదేశిస్తాడు. తరువాత జరిగిన పరిణామాల వల్ల అన్నదమ్ములిద్దరూ ఒకరినొకరు గుర్తుపడతారు. ఈలోగా భయంకర్ అనే దొంగల ముఠా నాయకుడు రంగబాబు అమ్మను, చెల్లెలు జ్యోతిని, భార్య లక్ష్మిని ఎత్తుకుని పోతాడు. వారిని రక్షించడానికి అన్నదమ్ములిద్దరూ సవాల్ చేస్తారు[1].

నటీనటులుసవరించు

పాటలుసవరించు

ఈ చిత్రం లోని అన్నిపాటలకు సంగీతం అందించినవారు: చెళ్ళపిళ్ళ సత్యం.

సంఖ్య. పాటసాహిత్యంగానం నిడివి
1. "గువ్వ గూడెక్కె రాజు మేడెక్కె కళ్ళు కైపెక్కె ఒళ్ళు వేడెక్కె"  డా. సి. నారాయణ రెడ్డిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల  
2. "నా కోసమే నీవున్నది ఆకాశమే ఔనన్నది మౌనం వద్దు"  డా. సి. నారాయణ రెడ్డిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం  
3. "నిన్న రాత్రి మెరుపులు ఉరుములు వాన చలి"  దాశరధిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి  
4. "నీ రూపమే నా మదిలోన తొలి దీపమే మన అనుబంధమే"  దాశరధిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల  
5. "నేర్పమంటావా నువ్వు నేర్చుకుంటావా"  కొసరాజుఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రమేష్  

బయటి లింకులుసవరించు

  1. వి.ఆర్. (10 March 1978). "చిత్రసమీక్ష అన్నదమ్ములసవాల్". ఆంధ్రపత్రిక దినపత్రిక (సంపుటి 64, సంచిక 331). Retrieved 8 January 2018.[permanent dead link]