అబీడ్స్, హైదరాబాదు
అబీడ్స్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. హైదరాబాదులోవున్న పురాతన, అత్యంత ప్రసిద్ధ వ్యాపార కేంద్రాలలో అబిడ్స్ ఒకటి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ టి.ఎస్.ఎఫ్.సి. భవనం, ప్రెసిడెంట్ ప్లాజా, గోల్డెన్ త్రెషోల్డ్లు ఉన్నాయి.[1] ఇది నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న కారణంగా ఈ ప్రాంతానికి ప్రాముఖ్యత పెరిగింది.
అబీడ్స్ | |
---|---|
సమీప ప్రాంతాలు | |
Coordinates: 17°21′58″N 78°28′34″E / 17.366°N 78.476°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాద్ జిల్లా |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Named for | ఆల్బెర్ట్ అబిడ్ |
Government | |
• Body | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 500001 |
Vehicle registration | టి.ఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | ఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం |
నగర ప్రణాళిక సంస్థ | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
చరిత్ర
మార్చుఈ ప్రదేశంలో అబీదు అనబడు ఒక మధ్యప్రాచ్య వ్యాపారవేత్త ఉండేవాడు. అరుదైన, విలువైన రాళ్ళను కోఠిలో ఉన్న నవాబుకి బహుమతులుగా ఇచ్చేవాడు. అందుకే ఈ ప్రదేశానికి అబీడ్స్ అనే పేరు వచ్చింది.
వాణిజ్యం
మార్చుఇక్కడ ప్రభుత్వ తపాలా ప్రధాన కార్యాలయం ఉంది. పుల్లారెడ్డి మిఠాయిల దుకాణము, బిగ్ బజార్, సిటీ సెంట్రల్ మాల్, తాజ్ మహల్ హోటల్, బ్రాండ్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇక్కడ పాత పుస్తకాలు ఎక్కువగా అమ్ముతారు.
దేవాలయాలు
మార్చుఅబిడ్స్ లో ప్రసిద్ధ దేవాలయాలు ఇస్కాన్ దేవాలయం, ఆంజనేయ దేవాలయం ఉన్నాయి. వీటిని వారసత్వ ప్రదేశాలుగా భావిస్తారు.
విద్య
మార్చువలసవాదం, మిషనరీ పని ద్వారా అనేక ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు ఇక్కడ స్థాపించబడ్డాయి.
పాఠశాలలు
మార్చు- స్టాన్లే బాలికల హైస్కూల్
- సేయింట్ జార్జ్స్ గ్రామర్ స్కూల్
- లిటిల్ ప్లవర్ హైస్కూల్
- రోసరీ కాన్వెంట్ హైస్కూల్
- ఆల్ సేయింట్స్ హైస్కూల్
- నజరెత్ హైస్కూల్
- స్లేట్ ది స్కూల్
- సేయింట్ జాన్స్ గ్రామర్ స్కూల్
రవాణా
మార్చుహైదరాబాద్ పాత బస్తీకి, సికింద్రాబాదుకు మధ్యలో ఈ అబిడ్స్ ఉంది. ఇక్కడి నుండి నగరంలోని అన్ని ప్రాంతాలకు వివిధ వాహనాల రవాణా సదుపాయం ఉంది.
చిత్రమాలిక
మార్చు-
అబిడ్స్ లోని వివిధ దుకాణాలు
-
హైదరాబాదు యాబిడ్స్లో వీధి
-
అబీడ్స్ బ్ర్యాండ్ ఫ్యాక్టరీ
-
అబీడ్స్ లో ఉన్న తాజ్ మహల్ హోటల్
-
అబీడ్స్ లో ఉన్న జనరల్ పోస్టు ఆఫీసు