తాజ్ మహల్ హోటల్ (అబీడ్స్)

హైదరాబాద్‌లోని అబిడ్స్ ప్రాంతంలో ఉన్న ఉన్న ఒక వారసత్వ హోటల్.

తాజ్ మహల్ హోటల్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని అబిడ్స్ ప్రాంతంలో ఉన్న ఉన్న ఒక వారసత్వ హోటల్.[1] ఉడిపి వంటకాలకు ఈ హోటల్ ప్రసిద్ధి చెందింది.[2] మసాలా దోసె, కట్లెట్, ఉప్మా ఇక్కడి ఆల్-టైమ్ ఫేవరెట్. గత 65 సంవత్సరాలుగా కర్ణాటకలోని ఒకే విక్రేత నుండి కాఫీ పొడిని తీసుకువస్తున్నారు. భోజనం మొదట్లో 25 పైసలు, అపరిమిత ఆహారం 1 రూపాయి ఉండేది. కప్ - సాసర్‌, వాష్ బేసిన్ల కాన్సెప్ట్‌ను మొదటిసారిగా హోటల్ నుండే పరిచయమయ్యాయి.[3]

తాజ్ మహల్ హోటల్
తాజ్ మహల్ హోటల్
సాధారణ సమాచారం
ప్రదేశంఅబిడ్స్
పట్టణం లేదా నగరంహైదరాబాదు, తెలంగాణ
దేశంభారతదేశం
నిర్మాణ ప్రారంభం1950; 74 సంవత్సరాల క్రితం (1950)

చరిత్ర

మార్చు

కర్ణాటకలోని ఉడిపి సమీపంలోని బెల్పు ప్రాంతానికి చెందిన ఇద్దరు స్నేహితులు బాబూరావు, ఆనంద్‌రావు 1942లో హైదరాబాదు నగరానికి వచ్చారు. బాబురావుకు వంట చేయడంలో మంచి నైపుణ్యం ఉండగా, ఆనంద్‌రావుకు వ్యాపార నైపుణ్యం ఉంది. వీరిద్దరూ సికింద్రాబాద్‌లోని మహంకాళి దేవాలయం సమీపంలో ఓ చిన్న స్థలాన్ని అద్దెకు తీసుకున్నారు. కొత్త రుచులతో కూడిన దక్షిణ భారత టిఫిన్లను హైదరాబాద్‌కు పరిచయం చేశారు. బాబూరావు తన సోదరుడు సుందర్‌రావు ముంబైలోని షిప్పింగ్ కంపెనీలో చదువుకున్నాడు, బాగా ఇంగ్లీష్ మాట్లాడుతాడు, పరిపాలనా విషయాలు తెలుసు. అలా వాళ్ళు ముగ్గురు కలిసి 1948లో ఈ తాజ్ మహల్ హోటల్ అబిడ్స్ శాఖను స్థాపించారు.[2][3]

ప్రత్యేకత

మార్చు

ఈ రెస్టారెంట్‌లో శాకాహారమైన ఉడిపి వంటకాలు ఉన్నాయి. బటన్ వడ, పాలక్ పనీర్ దోస, ఫిల్టర్డ్ కాఫీ, సాంబార్, మసాలా దోస, థాలీ మొదలైన వంటకాలు ఇది ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఇప్పటికీ రెడీమేడ్ మసాలా పొడిని ఉపయోగించకుండా స్వంతంగా తయారుచేసిన మసాలాను ఉపయోగిస్తారు. అంతేకాకుండా, వంట చేసేవారు స్నానం చేసిన తరువాతనే వంటగదిలోకి ప్రవేశిస్తారు.

ఇక్కడికి అనేకమంది ప్రముఖులు వస్తుంటారు. అక్కినేని నాగేశ్వరరావు, జమున, మాజీ ముఖ్యమంత్రులు, ఎం.ఎఫ్. హుస్సేన్ వంటి వారు ఇక్కడ తనకు ఇష్టమైన బటన్ ఇడ్లీలను వినడానికి ఈ ప్రదేశాన్ని సందర్శించేవారు. 1968లో మెథడిస్ట్ పాఠశాలలో కాంగ్రెస్ సెషన్ జరిగినప్పుడు తాజ్ మహల్ హోటల్ వారు క్యాటరింగ్ చేసారు. ఇందిరా గాంధీ నేలపై కూర్చుని భోజనం చేయగా, ఆమెకు సుందర్‌రావు వడ్డించాడు.[3]

ఈ భవనం 90 ఏళ్ల నాటిది, హెచ్‌ఎండీఏ ఈ భవనాన్ని వారసత్వ కట్టడంగా ప్రకటించింది.

అవార్డులు

మార్చు

ఈ హోటల్ కు వచ్చిన అవార్డులు, ప్రశంసలు:[4]

  • 2017 – 2018లో మేక్ మై ట్రిప్ ద్వారా అత్యుత్తమ రేటింగ్ పొందింది
  • 2016 – 2017లో గొయిబిబో ద్వారా అత్యుత్తమ రేటింగ్ పొందింది
  • 2016 - 2017లో గొయిబిబో ద్వారా సిఫార్సు చేసిన ఎక్సలెన్స్ గెస్ట్ సర్టిఫికేట్
  • 2016 సంవత్సరానికి ట్రిప్ అడ్వైజర్ ద్వారా ట్రావెలర్స్ ఛాయిస్ డెస్టినేషన్ అవార్డు
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి 2005లో సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్ హెరిటేజ్ లో ఇంటాచ్ అవార్డు
  • 2016లో సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్ బర్ప్ ద్వారా బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ ప్లేస్ అవార్డు

మూలాలు

మార్చు
  1. "Film on Telugu art - Times Of India". 15 September 2012. Archived from the original on 15 September 2012.
  2. 2.0 2.1 Murthy, Neeraja (2017-03-17). "A taste of time". The Hindu. ISSN 0971-751X. Retrieved 2022-04-16.
  3. 3.0 3.1 3.2 Murthy, Neeraja (2015-12-14). "The glorious Taj journey". The Hindu. ISSN 0971-751X. Retrieved 2022-04-16.
  4. "Awards & Accolades | Taj Mahal Hotels". www.tmhgroup.in (in ఇంగ్లీష్). Retrieved 2022-04-16.