అబీడ్స్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. హైదరాబాదులోవున్న పురాతన, అత్యంత ప్రసిద్ధ వ్యాపార కేంద్రాలలో అబిడ్స్ ఒకటి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ టి.ఎస్.ఎఫ్.సి. భవనం, ప్రెసిడెంట్ ప్లాజా, గోల్డెన్ త్రెషోల్డ్లు ఉన్నాయి.[1] ఇది నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న కారణంగా ఈ ప్రాంతానికి ప్రాముఖ్యత పెరిగింది.

అబీడ్స్
సమీప ప్రాంతాలు
అబీడ్స్ కూడలి
అబీడ్స్ కూడలి
అబీడ్స్ is located in Telangana
అబీడ్స్
అబీడ్స్
Location in Telangana, India
అబీడ్స్ is located in India
అబీడ్స్
అబీడ్స్
అబీడ్స్ (India)
నిర్దేశాంకాలు: 17°21′58″N 78°28′34″E / 17.366°N 78.476°E / 17.366; 78.476Coordinates: 17°21′58″N 78°28′34″E / 17.366°N 78.476°E / 17.366; 78.476
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాద్
మెట్రోహైదరాబాద్
పేరు వచ్చినవిధముఆల్బెర్ట్ అబిడ్
ప్రభుత్వం
 • నిర్వహణహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
ప్రామాణిక కాలమానంUTC+5:30 (IST)
పిన్ కోడ్
500001
వాహనాల నమోదు కోడ్టి.ఎస్
లోకసభ నియోజకవర్గంహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం
నగర ప్రణాళిక సంస్థహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
జాలస్థలిtelangana.gov.in

చరిత్రసవరించు

ఈ ప్రదేశంలో అబీదు అనబడు ఒక మధ్యప్రాచ్య వ్యాపారవేత్త ఉండేవాడు. అరుదైన, విలువైన రాళ్ళను కోఠిలో ఉన్న నవాబుకి బహుమతులుగా ఇచ్చేవాడు. అందుకే ఈ ప్రదేశానికి అబీడ్స్ అనే పేరు వచ్చింది.

వాణిజ్యంసవరించు

ఇక్కడ ప్రభుత్వ తపాలా ప్రధాన కార్యాలయం ఉంది. పుల్లారెడ్డి మిఠాయిల దుకాణము, బిగ్ బజార్, సిటీ సెంట్రల్ మాల్, తాజ్ మహల్ హోటల్, బ్రాండ్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇక్కడ పాత పుస్తకాలు ఎక్కువగా అమ్ముతారు.

దేవాలయాలుసవరించు

అబిడ్స్ లో ప్రసిద్ధ దేవాలయాలు ఇస్కాన్ దేవాలయం, ఆంజనేయ దేవాలయం ఉన్నాయి. వీటిని వారసత్వ ప్రదేశాలుగా భావిస్తారు.

విద్యసవరించు

వలసవాదం, మిషనరీ పని ద్వారా అనేక ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు ఇక్కడ స్థాపించబడ్డాయి.

పాఠశాలలుసవరించు

  • స్టాన్లే బాలికల హైస్కూల్
  • సేయింట్ జార్జ్స్ గ్రామర్ స్కూల్
  • లిటిల్ ప్లవర్ హైస్కూల్
  • రోసరీ కాన్వెంట్ హైస్కూల్
  • ఆల్ సేయింట్స్ హైస్కూల్
  • నజరెత్ హైస్కూల్
  • స్లేట్ ది స్కూల్
  • సేయింట్ జాన్స్ గ్రామర్ స్కూల్

రవాణాసవరించు

హైదరాబాద్ పాత బస్తీకి, సికింద్రాబాదుకు మధ్యలో ఈ అబిడ్స్ ఉంది. ఇక్కడి నుండి నగరంలోని అన్ని ప్రాంతాలకు వివిధ వాహనాల రవాణా సదుపాయం ఉంది.

చిత్రమాలికసవరించు

మూలాలుసవరించు