అబ్దుల్ అజీజ్ ముహమ్మద్

(అబ్దుల్‌ అజీజ్‌ ముహమ్మద్‌ నుండి దారిమార్పు చెందింది)

అబ్దుల్‌ అజీజ్‌ ముహమ్మద్‌ రచనా వ్యాసంగముతో బాటు ఆధ్యాత్మిక ప్రసంగాలు చేయడం, శ్రీమద్రామాయణం, శ్రీమద్భాగవతం, హరికథలు చెప్పడంలో దిట్ట.

బాల్యము

మార్చు

అబ్దుల్‌ అజీజ్‌ ముహమ్మద్‌ విశాఖపట్నం జిల్లా ఎస్‌.రాయవరంలో 1970 మార్చి 21 న జన్మించారు. తల్లితండ్రులు: మదీనా, కాశింబీబి.

ఉద్యోగం

మార్చు

అబ్దుల్‌ అజీజ్‌ ముహమ్మద్‌ విశాఖపట్నం నావెల్‌డాక్‌ యార్డ్‌లో టెక్నీషియన్‌ పనిచేస్తున్నారు.

రచనా వ్యాసంగము

మార్చు

అబ్దుల్‌ అజీజ్‌ ముహమ్మద్‌ ముస్లిం గురువు షేక్‌ సత్తార్‌ ప్రోత్సాహంతో 1979లో 'శంకుస్థాపన' కవిత రాయడంతో సాహిత్యరంగ ప్రవేశం చేశారు. ఇతని కలంపేర్లు: మహోదాయ, హరిఃఓమ్‌. ఈ పేరుతో అనేక కవితలు, కథానికలు, వ్యాసాలు ప్రచురితం అయ్యాయి. పలు కవితలు ఆంగ్లం లోకి కూడా అనువాదం అయ్యాయి. 'శంకుస్థాపన' కవిత 2000లో ఆంగ్లంలోకి, 'గుజరాత్‌గాయం' కవితా సంపుిటిలోని 'ఖబర్దార్‌' కవిత పలు జాతీయ భాషల్లో తర్జుమా అయ్యింది. హరి:ఓమ్‌ (1997) తదితర కవితా సంపుటాలు ప్రచురితమయ్యాయి.

అవార్డులు-పురస్కారాలు

మార్చు

విశాఖపట్నంలో సాహితీ సరస్వతి పురస్కారాన్ని, వచన కవితా సురభి పురస్కారాన్ని మచిలీపట్నంలో అందుకున్నారు.

ప్రత్యేకతలు

మార్చు

అబ్దుల్‌ అజీజ్‌ ముహమ్మద్‌ ముస్లిం అయి వుండీ రచనా వ్యాసంగముతో బాటు ఇతనికి ఆధ్యాత్మిక ప్రసంగాలు చేయడం, శ్రీమద్రామాయణం, శ్రీమద్భాగవతం, హరికథలు చెప్పడంలో దిట్ట.

లక్ష్యం

మార్చు

ఇతనికి త్యాగరాజు, అన్నమాచార్యులు, రామదాసు కీర్తనల ఆలాపన, వీటిపై పరిశోధన చేయడము, ప్రసంగాలు నిర్వహించడము. రచనల ద్వారా ఆధ్యాత్మిక ప్రచారం సాగించాలని ఇతనికి ఆకాంక్ష ఎక్కువ. దానితో బాటు పరమత సహనం, మతసామరస్యం, ప్రగతిశీలత సాధించాలన్నది ఇతని ప్రధాన లక్ష్యం.

మూలాలు

మార్చు
  • అక్షరశిల్పులుగ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010

ప్రచురణకర్త-- ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌

చిరునామా వినుకొండ - 522647. పుట 30