అబ్దుల్ బాసిత్
భారతదేశానికి చెందిన మాజీ వాలీబాల్ ఆటగాడు
అబ్దుల్ బాసిత్ సిద్ధిఖీ, భారతదేశానికి చెందిన మాజీ వాలీబాల్ ఆటగాడు. భారత వాలీబాల్ జట్టులో గొప్ప కెప్టెన్‌గా పరిగణించబడ్డాడు.[1]
అబ్దుల్ బాసిత్ | |||
---|---|---|---|
వ్యక్తిగత సమాచారం | |||
పూర్తి పేరు | అబ్దుల్ బాసిత్ సిద్ధిఖీ | ||
జననం | 1959 హైదరాబాద్, తెలంగాణ | ||
మరణం | 1991 హైదరాబాద్, తెలంగాణ | ||
Volleyball information | |||
స్థానం | ఆల్ రౌండర్ | ||
జాతీయ జట్టు | |||
|
జననం
మార్చుబాసిత్ 1959లో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జన్మించాడు. అబ్దుల్ బాసిత్ కుటుంబం ఉత్తరప్రదేశ్ లోని సహరాన్‌పూర్ జిల్లాకు చెందినది.
కెరీర్
మార్చురెండుసార్లు భారత పురుషుల జాతీయ వాలీబాల్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు.[2] 1986 సియోల్ ఆసియా గేమ్స్‌లో జపాన్‌ను ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకున్న జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.[3] 1978 బ్యాంకాక్ ఆసియా క్రీడలు, 1982 న్యూఢిల్లీ ఆసియా క్రీడలు, 1986 సియోల్ ఆసియా క్రీడలలో[4] భారతదేశం తరపున ఆడాడు.
అబుదాబిలో ఆడారు. జాతీయ ఛాంపియన్‌షిప్స్‌లో భారతీయ రైల్వే, ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
అవార్డులు
మార్చు- 1989: అర్జున అవార్డు[5]
మరణం
మార్చుబాసిత్ 1991లో విద్యుదాఘాతానికి గురై మరణించాడు.
మూలాలు
మార్చు- ↑ Subrahmanyam, V. V. (2022-02-17). "volleyball -special report". The Hindu. ISSN 0971-751X. Retrieved 2023-09-28.
- ↑ "Nourishment for souls". The New Indian Express. Retrieved 2023-09-28.
- ↑ Venkat, Rahul. "Indian volleyball team: star names and Asian Games success". Olympics.com. Retrieved 16 November 2021.
- ↑ "Asian Games: India's Hangzhou volleyball run evokes a 1986 nostalgia trip". Hindustan Times (in ఇంగ్లీష్). 2023-09-24. Retrieved 2023-09-28.
- ↑ "Arjuna Awardees in Volleyball". www.mindmapcharts.com. Retrieved 2023-09-28.[permanent dead link]