అబ్బూరి వరప్రసాదరావు

రంగస్థల నటుడు

అబ్బూరి వరప్రసాదరావు సుప్రసిద్ధ రంగస్థల నటులు.[1][2] భారత నాటకాలైన కురుక్షేత్రం, పాండవోద్యోగ విజయం నాటకాలలో శ్రీకృష్ణ పాత్ర ధరించి ఆ నాటకాలకు మంచి ప్రచారాన్ని, మన్ననను, ఆర్థిక విజయాన్ని సంపాదించింది వీరు ప్రముఖమైన నటనే. వీరి స్వస్థలం కొల్లిపర మండలం జెముడుపాడు.

అబ్బూరి వరప్రసాదరావు

వీరు ఆరుగురు అన్నదమ్ములు; వారిలో అబ్బూరి వెంకటప్పయ్య, అబ్బూరి ఆదినారాయణ శర్మ, అబ్బూరి వరప్రసాదరావులు ముగ్గురూ ఆరితేరిన నటులు.

వీరు కొంతకాలం బందరు కు చెందిన డి.వి. సుబ్బారావు గారి కంపెనీలో పనిచేశారు. తరువాత మిత్రులైన మల్లాది సూర్యనారాయణ, నందుల ఆంజనేయులు తో కలిసి తెనాలి లో ఆంధ్ర డ్రమెటిక్ కంపెనీ అనే సంస్థను నెలకొల్పి హరిశ్చంద్ర నాటకం ప్రదర్శించడం ప్రారంభించారు. ముందుగా వశిష్టుడి పాత్ర పోషించినా తరువాత సన్నిహితుల సలహాపై హరిశ్చంద్ర పాత్ర ధరించారు. ఆ తరువాత శ్రీకృష్ణ పాత్రధారణ నేర్చుకున్నారు. చాలా సన్నని కంఠస్వరాన్ని కలిగిన ప్రసాదరావు ధరించిన ఈ పాత్రలకు విశేషంగా ప్రజాదరణ లభించింది.

మూలాలు మార్చు

  1. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.544.
  2. "Famous Artists in Andhra Natakam". Archived from the original on 2009-10-26. Retrieved 2009-09-18.

ఇతర లింకులు మార్చు