అభినయం (పుస్తకం)
అభినయం అనేది శ్రీనివాస చక్రవర్తి రాసిన పుస్తకం. అభినయంకు సంబంధించిన అనేక అంశాలపై వచ్చిన ఈ పుస్తకం దర్శకుడు, నటుడు స్టానిస్లవిస్కీ రాసిన 'ఎన్ యాక్టర్ ప్రిపేర్స్' అనే పుస్తకం ఆధారంంగా రాయబడింది.[1][2]
అభినయం | |
కృతికర్త: | శ్రీనివాస చక్రవర్తి |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | అభినయం |
ప్రచురణ: | ఆదర్శ ప్రచురణ (ముద్రణ: లీలా ప్రెస్, విజయవాడ) |
విడుదల: | 1956 |
పేజీలు: | 423 |
రచనానేపథ్యం
మార్చు1950లకాలంలో మహానటుల అభినయాన్ని ప్రతిసారి చూసుకోని తమ నటనలో పరిణితి పెంచుకోవడానికి నట విద్యార్థులకు ఇప్పుడున్న మాధ్యమాలు అందుబాటులో ఉండేవి కావు. నటనలో ఎంతో అనుభవం సంపాదించిన మహానటులు మాత్రమే నటన-దాని స్వరూపం గురించి చెప్పగలరు. దురదృష్టవశాత్తు మహానటుల్లో ఎక్కవమంది తమ నట అనుభవాలను గ్రంథస్థం చేయలేదు. గ్రంథస్థం చేసిన మహానటుల రచనల్లో స్టానిస్లవిస్కీ ముందు వరుసలో ఉన్నాడు.
నటులు ఒక్కో రసావస్థలో ఒక్కోక్క నిర్ధిష్ట విధానాన్ని అవలంభిస్తుంటారు. సామాన్య (కొత్త) నటులకు సహజంగా నటించడం కష్టంగా ఉంటుంది. స్టానిస్లవిస్కీ తన నటజీవిత ప్రారంభదశలో కృత్రిమంగా నటించేవాడు. అది గ్రహించి ఉత్తమ నటనపై పరిశోధన చేసి ఒక వినూత్నమైన అభినయ దృక్పథాన్ని రూపొందించాడు. ఆయా సిద్ధాంతాలను, వాటి ఆచరణ క్రమాలను క్రోడికరీంచి 'ఎన్ యాక్టర్ ప్రిపేర్స్' అనే పుస్తకం రాశాడు. ఈ సిద్ధాంతాలలో కొన్ని భరతముని రాసిన నాట్య శాస్త్రంలోని సిద్ధాంతాలను పోలివున్నాయి.
అనువాదంలో తెలుగు నాటకరంగానికి అవసరమైన, తెలిసిన నాటకాలలోని ఉదహరణలు వాడబడ్డాయి. కొన్నికొన్ని సందర్భాలలో నాట్య శాస్త్రంలోని అంశాలను ఉదహరించడం జరిగింది.[3]
విషయ సూచిక
మార్చుఈ పుస్తకంలో 16 అథ్యాయాలు ఉన్నాయి. అభినయంకు సంబంధించిన అనేక అంశాల గురించి ఆయా అథ్యాయాల్లో రచయిత విపులంగా రాశాడు.
- ప్రథమ పరీక్ష
- అభినయం - కళ
- ప్రక్రియ
- భావనాశక్తి
- ఏకాగ్రత
- కండరాల బిగువు సుళువులు
- ఘట్టాలు - ఆశయాలు
- విశ్వాసము-యథార్థ తాపపరిజ్ఞానం
- ఉద్వేగ స్మృతి-
- సంసర్గం
- అనువర్తన
- ఆంతరసం చాలక శక్తులు
- అవిచ్చిన్న రేఖ
- అంతకు సృజనాత్మక స్థితి
- పరమేశం
- ప్రత్యక్ చైతన్యద్వారంలో
ఇతర వివరాలు
మార్చు- ఈ పుస్తకం అచ్చు పూర్తై బైండింగు పనులు జరుగుతున్న సమయంలో 1956, నవంబరు 11న రచయిత రెండవ కుమారుడు రంగబాబు చనిపోయాడు. రంగబాబుకు ఈ పుస్తకం అంకితం ఇవ్వబడింది.
- ఈ పుస్తకానికి కొప్పరపు సుబ్బారావు పీఠిక రాశాడు.
- ఈ పుస్తకంలోని రెండు, మూడు అధ్యాయాలు వరుసగా విశాలాంధ్ర పత్రికలో ప్రచురితమయ్యాయి.
మూలాలు
మార్చు- ↑ వెబ్ ఆర్కైవ్, అభినయం (పుస్తకం). "అంజలి-శ్రీనివాస చక్రవర్తి". www.archive.org. Retrieved 11 January 2020.
- ↑ చక్రవర్తి, శ్రీనివాస (1956). అంజలి (శ్రీనివాస చక్రవర్తి) (మొదటి ed.). గద్దె లింగయ్య. p. i. Retrieved 11 January 2020.
- ↑ చక్రవర్తి, శ్రీనివాస (1956). పీఠిక (కొప్పరపు సుబ్బారావు) (మొదటి ed.). గద్దె లింగయ్య. p. 1-8.