అమిత్ భండారీ

భారతీయ క్రికెట్ ఆటగాడు

అమిత్ భండారీ, భారతీయ క్రికెట్ ఆటగాడు.[1] 2000లో అరంగేట్రం చేసిన అమిత్, 2001-02 సీజన్‌లో ఆడాడు.[2]

అమిత్ భండారీ
క్రికెట్ సమాచారం
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్ మీడియం
మూలం: CricInfo, 2007 ఏప్రిల్ 21

అమిత్ భండారీ 1978, అక్టోబరు 1న ఢిల్లీలో జన్మించాడు.[3][4]

క్రికెట్ రంగం

మార్చు

2000 జూన్ 3న ఆసియా కప్ లో భాగంగా ఢాకా వేదికగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ తో అంతర్జాతీయ వన్డే క్రికెట్ లోకి అడుగుపెట్టాడు.[5] 2004 ఫిబ్రవరి 3న పెర్త్ వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా అడాడు.[6]

1997/98 లలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి వచ్చాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా 2008 మార్చి 5న ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా ఆడాడు.[7]

2003లో ఇండియా ఎ చేసిన ఇంగ్లాండ్ పర్యటనలో బౌలింగ్ చేసి, టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.[8] భారత జట్టులో స్థానంకోసం లక్ష్మీపతి బాలాజీ, ఆవిష్కర్ సాల్వితో కలిసి భండారి చేరాడు.

ఢిల్లీ సీనియర్, అండర్-23 జట్లకు సెలెక్టర్ల ఛైర్మన్ గా ఉన్నాడు. 2019 ఫిబ్రవరి 11న కొంతమంది అండర్-23 ఆటగాళ్ళ చేతిలో గాయపడిన కారణంగా అమిత్ వార్తల్లో నిలిచాడు. ఆ ఆటగాళ్ళను జట్టులోకి ఎంపిక చేయకపోవడంతో వారు అతనిపై దాడి చేశారు.

మూలాలు

మార్చు
  1. "Amit Bhandari". www.cricketwa.com. Retrieved 2023-08-03.
  2. "Amit Bhandari Profile - Cricket Player India | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-03.
  3. "Amit Bhandari Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-08-03.
  4. "Amit Bhandari Profile". Cricket Times. Retrieved 2023-08-03.
  5. "PAK vs IND, Asia Cup 2000, 5th Match at Dhaka, June 03, 2000 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-03.
  6. "ZIM vs IND, VB Series 2003/04, 12th Match at Perth, February 03, 2004 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-03.
  7. "SVCS vs DELHI, Vijay Hazare Trophy 2007/08, North Zone at Delhi, March 05, 2008 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-03.
  8. "Amit Bhandari Profile - Cricket Player, India | News, Photos, Stats, Ranking, Records - NDTV Sports". NDTVSports.com (in ఇంగ్లీష్). Retrieved 2023-08-03.