అమీర్‌పేట మెట్రో స్టేషను

హైదరాబాదులోని అమీర్‌పేట ప్రాంతంలో ఉన్న మెట్రో స్టేషను.

అమీర్‌పేట మెట్రో స్టేషను, హైదరాబాదులోని అమీర్‌పేట ప్రాంతంలో ఉన్న మెట్రో స్టేషను. హైదరాబాద్ మెట్రోకు సంబంధించిన ఎరుపురంగు లైను, నీలిరంగు లైనుల మధ్య అంతరమార్పు ఉన్న మెట్రో స్టేషను ఇది.[1][2] 2,00,000 చదరపు అడుగులు (19,000 చదరపు మీటర్లు) ఉన్న అమీర్‌పేట ఇంటర్-చేంజ్ మెట్రో స్టేషను, భారతదేశంలోని అతిపెద్ద మెట్రో స్టేషన్లలో ఒకటి.[3] హైదరాబాద్ఉలోని అత్యంత రద్దీగా ఉండే మెట్రో స్టేషన్లలో ఒకటైన ఈ అమీర్‌పేట మెట్రో స్టేషనులో, ప్రతిరోజూ సుమారు 32,000 మంది ప్రయాణం చేస్తున్నారు.[4][5]

అమీర్‌పేట మెట్రో స్టేషను
హైదరాబాదు మెట్రో స్టేషను
సాధారణ సమాచారం
Locationసంజీవరెడ్డి నగర్ రోడ్డు, అమీర్‌పేట, ఎల్లారెడ్డిగూడ రోడ్డు సమీపంలో, మైత్రివనం, హైదరాబాదు-500016, భారతదేశం
Coordinates17°26′05″N 78°26′53″E / 17.434802°N 78.448011°E / 17.434802; 78.448011
పట్టాలు4
నిర్మాణం
నిర్మాణ రకంపైన
Depth7.07 మీటర్లు
Platform levels2
History
Openedనవంబరు 29, 2017; 6 సంవత్సరాల క్రితం (2017-11-29)
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

చరిత్ర

మార్చు
 
అమీర్‌పేట మెట్రో దుకాణాలు

2017, నవంబరు 29న ఈ స్టేషను ప్రారంభించబడింది.

స్టేషను వివరాలు

మార్చు

సౌకర్యాలు

మార్చు

అమీర్‌పేట మెట్రో స్టేషను అతి రద్దీగా ఉండే వాణిజ్య కేంద్రం. ఇక్కడ దుస్తులు, బిర్యానీ, షావర్మా, తేనీరు మొదలైనవి విక్రయించే అనేక దుకాణాలు ఉన్నాయి.[6] పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రయాణికుల కోసం ఉచిత వైఫై సౌకర్యం కూడా ఉంది.[7]

స్టేషన్లలో కింది నుండి పై ప్లాట్‌ఫాం వరకు మెట్లు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉన్నాయి.[8]

స్టేషను లేఔట్

మార్చు
కింది స్థాయి
ప్రయాణీకులు తమ వాహనాలను పార్కింగ్ చేసేది.[9]
మొదటి స్థాయి
టికెట్ కార్యాలయం లేదా టికెట్ వెండింగ్ యంత్రాలు (టీవీఎంలు) ఇక్కడ ఉంటాయి. దుకాణాలు, శౌచాలయాలు, ఏటిఎంలు, ప్రథమ చికిత్స మొదలైన ఇతర సౌకర్యాలు ఈ ప్రాంతంలో ఉంటాయి.[9]
రెండవ స్థాయి
ఇది రెండు ప్లాట్‌ఫాంలను కలిగి ఉంటుంది. ఇక్కడి నుండి రైళ్ళు ప్రయాణికులను తీసుకువెళతాయి.[9]

ప్రమాదాలు

మార్చు

2019, సెప్టెంబరు 22న మౌనికా అనే 27 ఏళ్ళ మహిళ వర్షం సమయంలో అమీర్‌పేట మెట్రో స్టేషనుకు చెందిన ఎ-1053 స్తంభం కిందికి వచ్చింది.[10] ఆ స్తంభానికి చెందిన కాంక్రీట్ స్లాబ్[11] 9 మీటర్ల ఎత్తు నుండి ఆమె తలపై పడింది. ఆమెను అమీర్‌పేటలోని ఆస్టర్ ప్రైమ్ ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్సపొందుతూ మరణించింది.[12][13][14] హైదరాబాదు మెట్రో సంస్థ పరిహారంగా బాధితురాలి కుటుంబానికి 20 లక్షల రూపాయలు చెల్లించింది.[15] బీమా సంస్థ నుండి మరో రూ .15 లక్షలు, కుటుంబ సభ్యుడికి ఉద్యోగం ఇస్తామని ఎల్ అండ్ టి తెలిపింది.[16] ఐపీసీ సెక్షన్ 304-ఎ (నిర్లక్ష్యం మరణానికి కారణమవుతుంది) కింద ఎల్ అండ్ టిపై కేసు నమోదైంది.[17] ఈ సంఘటన జరిగిన ఒక రోజు తరువాత, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి కె.టి.రామారావు ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని హైదరాబాదు మెట్రో రైల్ అధికారులను ఆదేశించాడు.[18] ఇటువంటి సంఘటన మళ్లీ జరగకుండా అన్ని నిర్మాణాలను, సౌకర్యాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నాడు.[19]

మూలాలు

మార్చు
 1. "Ameerpet metro station gets e-bikes, eateries". Thehindu.com. Retrieved 2020-12-09.
 2. "station detail". Retrieved 2020-12-09.
 3. "Via the largest Metro station in the country". Economictimes.indiatimes.com. Retrieved 2020-12-09.
 4. "Hyderabad Metro sees record 4.6 lakh passengers on New Year's Eve". Retrieved 2020-12-09.
 5. "Hyderabad Metro breaks record with 2.55 lakh footfall". Retrieved 2020-12-09.
 6. "Romancing the city in metro". Archived from the original on 2019-10-22. Retrieved 2020-12-09.
 7. "Watch videos with free Wi-Fi at Hyderabad metro". Deccanchronicle.com. Retrieved 2020-12-09.
 8. https://www.ltmetro.com/metro-stations/
 9. 9.0 9.1 9.2 "Platform level". Hyderabad Metro Rail.
 10. "Woman dies as Metro wall peels off, falls on her". Retrieved 2020-12-09.
 11. "Shouldn't have asked her to take Metro, says husband of Hyderabad freak accident victim". Retrieved 2020-12-09.
 12. "Woman dies after concrete of Hyderabad Metro rail falls on her". Retrieved 2020-12-09.
 13. "Hyderabad: 27-year-old woman dies after concrete chunks at Metro station fall on her". The Indian Express. September 22, 2019. Retrieved 2020-12-09.{{cite web}}: CS1 maint: url-status (link)
 14. "Hyderabad: Metro commuters fear for their safety". The Times of India. 2019-09-23. Retrieved 2020-12-09.{{cite web}}: CS1 maint: url-status (link)
 15. "Woman killed in Hyd station: Rs 20 lakh for Mounika's life". Retrieved 2020-12-09.
 16. "Probe begins after woman killed at Hyderabad Metro station". Retrieved 2020-12-09.
 17. "L&T booked for death at Ameerpet Metro station". Retrieved 2020-12-09.
 18. "Shoddy maintenance bares safety chinks in Hyderabad metro project". Retrieved 2020-12-09.
 19. "Womans death raises questions on Hyderabad Metro quality". Retrieved 2020-12-09.

ఇతర లంకెలు

మార్చు