1977
1977 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1974 1975 1976 - 1977 - 1978 1979 1980 |
దశాబ్దాలు: | 1950లు 1960లు - 1970లు - 1980లు 1990లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
మార్చు- ఫిబ్రవరి 1: భారత తీర రక్షక దళం ఏర్పాటయింది.
- ఫిబ్రవరి 11: భారత తాత్కాలిక భారత రాష్ట్రపతిగా బి.డి.జట్టి పదవిని చేపట్టాడు.
- మార్చి 24: భారత ప్రధానమంత్రిగా మొరార్జీ దేశాయ్ పదవీబాధ్యతలు చేపట్టినాడు.
- జూలై 25: భారత రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డి పదవిని చేపట్టాడు.
- నవంబర్ 19: దివి సీమ తుపాను వచ్చింది.
జననాలు
మార్చు- జనవరి 14: నిమిషా వేదాంతి, భూగర్భ చమురు నిల్వలపై పరిశోధన చేసిన శాస్త్రజ్ఞురాలు.
- జనవరి 14: నారాయణ్ కార్తికేయన్, భారతదేశానికి చెందిన మొదటి ఫార్ములా వన్ మోటార్ రేసింగ్ డ్రైవరు.
- జనవరి 23: అభినయ శ్రీనివాస్, తెలంగాణ ఉద్యమ, సినీ గీత రచయిత, గాయకుడు.
- జనవరి 31: అంకుష్ చౌదరి, టెలివిజన్, సినిమా నటుడు, స్క్రీన్ రైటర్, దర్శకుడు, నిర్మాత
- మార్చి 2: ఆండ్రూ స్ట్రాస్, ఇంగ్లిష్ క్రికెటర్. ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు నాయకుడు. ఎడమచేతి వాటం ఓపెనింగ్ బ్యాట్స్మన్.
- మే 11: పోసాని సుధీర్ బాబు , తెలుగు సినిమా నటుడు, తెలుగు నటుడు ఘట్టమనేని కృష్ణ చిన్నల్లుడు.
- జూన్ 1: సలోని, తెలుగు, పలు భాషల సినీనటి.
- జూలై 29: అంబటి బాల మురళి, 17 ఏళ్ల వయసులో ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన వైద్యునిగా రికార్డు సృష్టించాడు.
- అక్టోబర్ 8: మంచు లక్ష్మి, భారతీయ సినీ, టెలివిజన్ నటి, నిర్మాత,
- డిసెంబర్ 4: అజిత్ అగార్కర్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
- డిసెంబర్ 31: సుచేతా కడేత్కర్, సాహస యాత్రికురాలు. ఆసియాలో అతిపెద్దదైన గోబీ ఎడారిని విజయవంతంగా దాటింది.
మరణాలు
మార్చు- జనవరి 13: హెన్రీ లాంగ్లోయిస్, అంతర్జాతీయ ఫిల్మ్ ఆర్కైవ్స్ సమాఖ్య (ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ఆర్కైవ్స్ (ఎఫ్.ఐ.ఎ.ఎఫ్) వ్యవస్థాపకుడు. (జ.1914)
- జనవరి 20: హెన్రీ కిసింజర్, అమెరికా దౌత్యనీతివేత్త.
- జనవరి 29: బస్టర్ నుపెన్, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్. (జ.1902)
- ఫిబ్రవరి 11: ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, భారత ఐదవ రాష్ట్రపతి. (జ.1905)
- ఏప్రిల్ 8: శంకరంబాడి సుందరాచారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ రచయిత. (జ.1914)
- సెప్టెంబర్ 18: సుధీ రంజన్ దాస్, భారతదేశ సుప్రీంకోర్టు ఐదవ ప్రధాన న్యాయమూర్తి (జ. 1894)
- సెప్టెంబర్ 29: కొలచల సీతారామయ్య, ఆయిల్ టెక్నాలజీ పరిశోధక నిపుణులు. (జ.1899)
- నవంబర్ 8: బి.ఎన్.రెడ్డి, తెలుగు సినిమా దర్శకులు. (జ.1908)
- నవంబర్ 23: నిడమర్తి అశ్వనీ కుమారదత్తు, కార్మిక నాయకుడు, పత్రికా నిర్వాహకుడు. (జ.1916)
- : అనంతపంతుల రామలింగస్వామి, తెలుగు కవి. (జ.1890)