అయస్కాంత గ్రహణశీలత
(అయస్కాంత ససెప్టబిలిటీ నుండి దారిమార్పు చెందింది)
విద్యుదాయస్కాంత శాస్త్రంలో, ఆయస్కాంత గ్రహణశీలత (ససెప్టిబిలిటీ) χ ఒక కొలమానం లేని శాల్తీ (dimensionless quantity). ఒక వస్తువుని ఆయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు ఆ వస్తువు అయస్కాంత తత్త్వాన్ని సంతరించుకుంటుందో తెలుపుతుంది.[1] అయస్కాంత క్షేత్ర బలం వల్ల వస్తువు పొందిన అయస్కాంతీకరణ తీవ్రతకు, అయస్కాంత క్షేత్ర బలానికి ఉన్న నిష్పత్తిని వస్తువు యొక్క అయస్కాంత ససెప్టబిలిటీ అంటారు. ఒక వస్తువును అయస్కాంత క్షేత్రంలో ఉంచితే, అది పొందే అయస్కాంతీకరణ తీవ్రత క్షేత్రబలానికి అనులోమానుపాతంలో ఉంటుంది.
అయస్కాంత క్షేత్రం బలం = ఏంపియర్లు/మీటరు అనిన్నీ, ఆ వస్తువు పొందే అయస్కాంతీకరణ తీవ్రత = ఏంపియర్లు/మీటరు అనిన్నీ అనుకుంటే
అవుతుంది. అందుకని χ కొలమానం లేని శాల్తీ అవుతుంది. ఈ సమీకరణంలోని χ స్థిరాంకంను ఆయస్కాంత గ్రహణశీలత (ససెప్టబిలిటి) అంటారు.