అరిగె రామస్వామి

అరిగె రామస్వామి 1875లో తెలంగాణ రాష్ట్రములోని రంగారెడ్డి జిల్లా రామన్ కోలా గ్రామంలోని హరిజన కుటుంబములో జన్మించారు. చిన్న చదువుతోనే రైల్వే ఆడిట్ ఆఫీసులో నాలుగవ శ్రేణి ఉద్యోగం (ఆఫీస్ బాయ్) గా ప్రారంభించి తరువాత పలురకాల ఉద్యోగములు చేసారు. ఇతను బ్రిటిష్ వలస వాద పూర్వరంగాల్లో ప్రాచుర్యం పొందిన వైష్ణవ మతం, అచల సిద్దాంతాన్ని బ్రహ్మసమాజం గూర్చి ప్రచారం చేశారు. ఇతను సునీతబాల సమాజాన్ని 1912 లో స్థాపించి,దళితుల విద్యకొరకు కృషిచేశాడు. ఈ సంస్థ సామాజిక ఉత్సవాల్లో మధ్యపాన నిషేధం, దేవదాసి వ్యవస్థ నిర్మూలనకు కృషి చేసింది. 1931 లో అరుంద తీయ మహాసభను స్థాపించాడు. 1931 లో అరుందతీయ సమావేశం రెడ్డి హాస్టల్ లో జరిగింది. 1935 లో హిందూ సోషల్ సర్వీస్ లీగ్ తరుపున పోటీచేసి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు కౌన్సిలర్ గా ఎన్నికైన తొలి దళిత వ్యక్తిగా నిలిచారు. నోట్: సురవరం ప్రతాపరెడ్డి ప్రచురించిన గోల్కొండ కవుల సంచికలో చోటు సంపాదించుకున్న ఏకైక దళిత కవి అరిగే రామస్వామి.

చరిత్ర మార్చు

సమాజములో ఉన్న అసమానత, పీడిత, నిమ్న జాతుల ఉద్ధరణకై, వారిలో చైత్యన్యం రావడానికి కృషి చేసిన సంఘ సంస్కర్త, దేశభక్తుడు. అప్పటి నిజాం ప్రభుత్వములో ప్రజలకు ఎటువంటి విషయములలోను స్వేచ్ఛ అనేది ఉండేది కాదు. హిందూ సమాజములో అంటరానివారిగా చూడటం, నిమ్నకులాలతో వెట్టిచాకిరి చేయించడం, ప్రభుత్వ ఉద్యోగుల నిరంకుశ ధోరణి, మూఢాచారాలతో ఉన్న ప్రజలను మేలుకొలిపిన నాయకులలో ఒకరు అరిగె రామస్వామి, రెండో వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ, మూడవ వారు బి. ఎస్. వెంకట్రావు. రామస్వామి కి చిన్ననాటి నుంచి ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ. 1912 భూమానంద మందపల్లి హనుమంత రాజా అనే యోగి ప్రభావంతో, సంపూర్ణ శాకాహారిగా మారిపోయినాడు. గురువు ఆశీర్వాదములతో "సునీత బాల సమాజం" పేరుపై ఒక సంస్థను ఏర్పాటు చేసి, సికింద్రాబాద్, కుమ్మరి గూడా బస్తీలలో సంఘ సంస్కరణకు పూనుకొన్నాడు. హరిజన వర్గాల్లో వున్నా మల, మాదిగ, మల దాసరి వంటి ఉపతెగలు తొలగించి వారిలో సమైక్య భావాన్ని పెంపొందించారు. తెలంగాణ లో గ్రంథాలయ ఉద్యమమునకు పాల్గొని, గ్రంథాలయములు నెలకొల్పటం, వాటితో నిరక్షరాస్యతా నిర్మూలనకు కృషి చేశారు.[1]

రాజకీయ జీవితం - సంస్కరణలు మార్చు

రామస్వామి నిజం రాష్ట్ర ఆంధ్ర మహాసభలో కార్యవర్గ సభ్యుడిగా , అల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా , 1950-1952 లో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సంయుక్త కార్యదర్శి గా ఉన్నారు . నిజాం ( రజాకార్ల ఉద్యమంతర్వాత ) , కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ సంస్థానము నుంచి నామినేట్ చేసిన సభ్యులలో ఒకరు రామస్వామి . డాక్టర్ బూర్గుల రామకృష్ణా రావు మంత్రివర్గం లో ఉపమంత్రి గా (1954 నుంచి 1956) వరకు, ఆంధ్ర ప్రదేశ్ అవతరణ తర్వాత శాసనసభ కు ఎన్నికై , కాసు బ్రహ్మానంద రెడ్డి మంత్రివర్గం లో ఉపమంత్రి గా పనిచేసారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మమండలి లో నియమించి బడ్డారు.[2]

అరిగె రామస్వామి 1973 జనవరి 26 వ రోజు మరణించారు . ఒక గాంధేయ వాడిగా, తాను నమ్మిన సిద్ధాంతములను , విశ్వాసములను, ఆదర్శములను , తెలంగాణ ప్రాంతము లో హరిజన ఉద్యమం లోను, గ్రంథాలయాల స్థాపనలోను రామస్వామి కృషి మరవలేనిది.

మూలాలు మార్చు

  1. "Aige Ramaswamy - 10 వ తరగతి పాఠ్య పుస్తకం". NCERT తెలంగాణ రాష్ట్ర పుస్తకము. 20 Oct 2020. Retrieved 20 Oct 2020.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. India, The Hans (2017-12-16). "Highly Decorated Personalities". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2020-10-20.