అరుంధతి నాగ్
అరుంధతి నాగ్ (పెళ్లికాకముందు పేరు అరుంధతి రావు) (జననం 1956 జూలై 6) [2] భారతీయ చలనచిత్ర, నాటక నటి. ఆమె భారతదేశం లోని బహుభాషా నాటకరంగంలో 40 సంవత్సరాలకు పైగా క్రియాశీలంగా వుంది. మొదట ముంబైలో ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ (ఐపిటిఎ) లో పాల్గొని గుజరాతీ, మరాఠీ , హిందీ భాషల నాటకాలలో నటించింది. కన్నడ నటుడు-దర్శకుడు శంకర్ నాగ్ తో వివాహం తరువాత ఆమె కన్నడంలో అనేక నాటకాలను ప్రదర్శించింది. బెంగళూరు రంగ శంకర పేరుతో నాణ్యమైన కళామందిరం నిర్మించింది. [3] ఆమె సంగీత నాటక అకాడమీ అవార్డు, పద్మశ్రీ, జాతీయ చలనచిత్ర పురస్కారాలు పొందింది.
అరుంధతి నాగ్ | |
---|---|
జననం | అరుంధతీ రావు 1956 జూలై 6 |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1973–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | శంకర్ నాగ్ (d, 1990) |
పిల్లలు | 1 |
బంధువులు | పద్మావతి రావు (సోదరి)[1]
గాయత్రి నాగ్ (తోటి కోడలు) |
వృత్తి
మార్చుఅరుంధతి నాగ్ 40 ఏళ్లకు పైగా రంగస్థలం, సినిమా, టెలివిజన్‌లో నటించింది. ఆమె 1992లోసంకేత్ ట్రస్ట్ స్థాపించింది. కార్యనిర్వాహక అధికారిగా పనిచేస్తున్నది బెంగుళూరు నగరంలో రంగ శంకర పేరుతో నాణ్యమైన కళామందిరం నిర్మించింది.[4]
వ్యక్తిగత జీవితం
మార్చుఅరుంధతి నాగ్ 1956లో ఢిల్లీలో నేతాజీ నగర్ లో జన్మించింది. 10 సంవత్సరాల వయస్సులో ఆమె కుటుంబం ముంబైకి వెళ్లింది. 17 సంవత్సరాల వయస్సులో, ఆమె నాటకరంగ కళాకారుడైన శంకర్ నాగ్ ను కలుసుకుంది. ఆరేళ్ల తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకుని బెంగళూరుకు వెళ్లారు. శంకర్ ప్రసిద్ధ సినీ నటుడు, దర్శకుడు అయ్యాడు. ఆర్.కె. నారాయణ్ మాల్గుడి డేస్ (1987) టీవీ అనుసరణ నిర్మించాడు.[5] 1990లో శంకర్ కారు ప్రమాదంలో మరణించాడు. అరుంధతి థియేటర్‌లో నటించడం కొనసాగించింది.
అవార్డులు
మార్చు- సంగీత నాటక అకాడమీ అవార్డు (2008 – థియేటర్, నటన) [6]
- పద్మశ్రీ (2010) [7][8]
- ఉత్తమ సహాయ నటిగా 57వ జాతీయ చలనచిత్ర పురస్కారం – పా చిత్రం
మూలాలు
మార్చు- ↑ Iyengar, Vidya (19 June 2016). "'I lead my life in disbelief'". Bangalore Mirror. Archived from the original on 23 March 2018. Retrieved 23 March 2018.
- ↑ "Harmony Org". web.archive.org. 2014-11-10. Archived from the original on 2014-11-10. Retrieved 2022-01-24.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Home Events - RangaShankara". web.archive.org. 2016-06-30. Archived from the original on 2016-06-30. Retrieved 2022-01-24.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "The Hindu : Metro Plus Bangalore : Dreams in concrete". web.archive.org. 2005-05-08. Archived from the original on 2005-05-08. Retrieved 2022-01-24.
- ↑ Jayaraman, Pavitra (2009-08-15). "Freedom to express | Arundhati Nag". mint (in ఇంగ్లీష్). Retrieved 2022-01-24.
- ↑ "SNA: Awardeeslist::". web.archive.org. 2016-03-31. Archived from the original on 2010-04-17. Retrieved 2022-01-24.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Wayback Machine" (PDF). web.archive.org. Archived from the original on 2017-06-14. Retrieved 2022-01-24.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Padma Awards". web.archive.org. 2016-10-01. Archived from the original on 2016-10-01. Retrieved 2022-01-24.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)