అర్చన కవి

భారతీయ అభినేత్రి

అర్చన జోస్ కవి (జననం 1990 జనవరి 4) భారతీయ నటి, యూట్యూబర్, టెలివిజన్ హోస్ట్. ఎం. టి. వాసుదేవన్ నాయర్ స్క్రిప్ట్, లాల్ జోస్ దర్శకత్వం వహించిన నీలతామర (2009) చిత్రంతో ఆమె సినిమా ప్రపంచంలోకి అరంగేట్రం చేసింది.[1][2]

అర్చన కవి
2010లో అర్చన కవి
జననం
అర్చన జోస్ కవి

(1990-01-04) 1990 జనవరి 4 (వయసు 34)[ఆధారం చూపాలి]
న్యూ ఢిల్లీ, భారతదేశం
వృత్తి
  • నటి
  • యూట్యూబర్
క్రియాశీల సంవత్సరాలు2009 - ప్రస్తుతం

2013లో వచ్చిన బ్యాక్‌బెంచ్ స్టూడెంట్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది,[3][4]

బాల్యం, విద్యాభ్యాసం

మార్చు

ఆమె న్యూఢిల్లీలో సీనియర్ పాత్రికేయుడు జోస్ కవియిల్, రోసమ్మ దంపతులకు జన్మించింది. జోస్ కవియిల్ కుటుంబం కేరళలోని కన్నూర్ జిల్లా కుడియన్మలకి చెందినది.[5] ఆమెకు ఆశిష్ కవి అనే అన్నయ్య ఉన్నాడు. ఆమె ఢిల్లీలోని సెయింట్ జేవియర్స్ స్కూల్ లో చదువుకుంది. 2006లో మార్ అగస్టినోస్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు కోసం అర్చన కేరళలోని రామాపురం వెళ్లింది.[6]

కెరీర్

మార్చు

ఆమె టెలివిజన్ ఛానెల్ యెస్ ఇండియావిజన్‌లో ఇంటర్న్‌షిప్ చేసింది.[7] అక్కడ కొన్ని కార్యక్రమాల నిర్మాణంలో సహాయం చేసింది. ఆ తరువాత ఆమె అదే ఛానెల్‌లో బ్లడీ లవ్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఈ సమయంలో దర్శకుడు లాల్ జోస్ ఆమెను గుర్తించాడు. అతను మార్చి 2009లో తన చిత్రంలో ప్రధాన మహిళా పాత్రతో ఆమెను వెండితెరకు పరిచయం చేసాడు.[8]

వ్యక్తిగతం

మార్చు

ఆమెకి స్టాండప్ కమెడియన్ అబిష్ మాథ్యూతో 2015 అక్టోబరు 31న నిశ్చితార్థం జరిగింది. వారు 2016 జనవరి 23న కేరళలోని వల్లర్‌పదం చర్చ్‌లో వివాహం చేసుకున్నారు,[9] అయితే 2021లో, ఈ జంట విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది.[10]

ఫిల్మోగ్రఫీ

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర భాష నోట్స్
2009 నీలతామర కుంజిమలు మలయాళం
2010 మమ్మీ & మీ ఆభరణం
బెస్ట్ ఆఫ్ లక్ నీతూ
2011 సాల్ట్ ఎన్ పెప్పర్ పూజా నాయర్ అతిధి పాత్ర
2012 స్పానిష్ మసాలా లిల్లీకుట్టి
అరవాన్ చిమిట్టి తమిళం
మజవిల్లినాట్టం వారే రబియా మలయాళం
2013 బ్యాక్‌బెంచ్ స్టూడెంట్ ప్రియాంక తెలుగు
అభియుంజనం అభిరామి మలయాళం
హానీబీ సారా
పట్టం పోల్ షెరిన్
బ్యాంగిల్స్ ఏంజెల్
నాడోడిమన్నన్ అతిరా
2014 టూ నూరా విత్ లవ్ శ్రీపార్వతి
డే నైట్ గేమ్ అభిరామి
మొనాయి అన్గానే ఆనయి మెరిన్
జ్ఞాన కిరుక్కన్ సుమతి తమిళం
2015 సుఘమాయిరిక్కట్టే రామ్లా మలయాళం
కుక్కిలియార్ సరయు
2016 దూరం రసియా
వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ దేర్ ఎ కల్లన్

మూలాలు

మార్చు
  1. johnsonrichards (25 June 2012). "Archana Kavi:"I AM BLESSED" | Kochi Cochin News". Cochinsquare.com. Archived from the original on 12 December 2009. Retrieved 12 July 2012.
  2. "Going native". The Hindu. Chennai, India. 25 November 2009. Retrieved 10 June 2013.
  3. "First look of Back Bench Student". Times of India. Archived from the original on 2013-04-11. Retrieved 24 June 2020.
  4. "Back Bench Student to hit screens on March 15". The Hindu. Retrieved 24 June 2020.
  5. Sebastian, Shevlin. "Archana acting like a 'naadan' girl". The New Indian Express. Archived from the original on 23 అక్టోబరు 2013. Retrieved 14 October 2013.
  6. Asha Prakash, TNN (22 August 2011). "Archana Kavi Turns Tribal". The Times of India. Archived from the original on 12 April 2012. Retrieved 14 October 2013.
  7. Athira M. (27 December 2012). "Television beckons". The Hindu. Chennai, India. Retrieved 14 October 2013.
  8. Sreedhar Pillai, TNN (10 July 2010). "Archana Kavi gets bold". The Times of India. Archived from the original on 4 November 2012. Retrieved 14 October 2013.
  9. "Archana Kavi to marry stand-up comedian Abish Mathew | Archana Kavi to marry Abish Mathew".
  10. "Archana Kavi opens up about her fight with depression and her divorce". OnManorama. Retrieved 2021-12-23.
"https://te.wikipedia.org/w/index.php?title=అర్చన_కవి&oldid=4334187" నుండి వెలికితీశారు