అర్జున్ సింగ్ (మధ్యప్రదేశ్)
అర్జున్ సింగ్ (1930 నవంబరు 5 - 2011 మార్చి 4[1]) మధ్య ప్రదేశ్కు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1980 లలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండుసార్లు[2], పంజాబ్ గవర్నరుగా, 2000 నుంచి 2011 వరకు లోక్సభ, రాజ్యసభల సభ్యుడిగా ఎన్నికై పివి నరసింహారావు & మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో రెండుసార్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిగా పనిచేశాడు.
అర్జున్ సింగ్ | |||
| |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | ఛుర్హాట్ | 1930 నవంబరు 5||
మరణం | 2011 మార్చి 4 న్యూ ఢిల్లీ, భారతదేశం | (వయసు 80)||
రాజకీయ పార్టీ | స్వతంత్ర (1957-1960) కాంగ్రెస్ (1960-1996, 1998-2011) ఆల్ ఇండియా ఇందిరా కాంగ్రెస్ (తివారీ) (1996-1998) | ||
జీవిత భాగస్వామి | సరోజ్ కుమారి | ||
సంతానం | అజయ్ సింగ్ అభిమన్యు సింగ్ వీణ సింగ్ | ||
పూర్వ విద్యార్థి | అలాహాబాద్ యూనివర్సిటీ |
రాజకీయ జీవితం
మార్చుఅర్జున్ సింగ్ 1980, 1985 మధ్య మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేశాడు. ఆయన రాష్ట్రంలో రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ఒక రోజు తర్వాత, పంజాబ్ గవర్నరుగా నియమితుడయ్యాడు. 1985 లో లోక్సభ సభ్యుడిగా ఎన్నికై పి.వి.నరసింహారావు మంత్రివర్గంలో వాణిజ్య, కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా తిరిగి 1991 లో మానవ వనరుల అభివృద్ధి మంత్రిగా పని చేశాడు.
ఆయన 1992 లో బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత పివి నరసింహారావుకు వ్యతిరేకంగా మారి, ఆ తరువాత ఎన్.డి తివారీ నాయకత్వంలో 1994 లో అఖిల భారత ఇందిరా కాంగ్రెస్ (తివారీ) పేరుతో తిరుగుబాటు కాంగ్రెసు పార్టీని స్థాపించాడు. రావు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తరువాత అర్జున్ సింగ్ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాడు.
నిర్వహించిన పదవులు
మార్చు- 1957 - 1985 మధ్యప్రదేశ్ శాసనసభ సభ్యుడు
- 1963 - 1967 మధ్యప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయం, సాధారణ పరిపాలన శాఖ (GAD), సమాచార & ప్రజాసంబంధాల రాష్ట్ర మంత్రి
- 1967 మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రణాళిక & అభివృద్ధి మంత్రి
- 1972 - 1977 విద్యా మంత్రి, మధ్యప్రదేశ్ ప్రభుత్వం
- 1977 - 1980 మధ్యప్రదేశ్ శాసనసభ ప్రతిపక్ష నాయకుడు
- 1980 - 1985 మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి
- 1985 - 1985 పంజాబ్ గవర్నర్
- 1985 - 1988 పార్లమెంటు సభ్యుడు, లోక్ సభ
- 1985 - 1986 వాణిజ్య మంత్రి, భారత ప్రభుత్వం
- 1986 - 1988 కమ్యూనికేషన్స్ మంత్రి, భారత ప్రభుత్వం
- 1988 - 1991 మధ్యప్రదేశ్ శాసనసభ సభ్యుడు
- 1988 - 1989 మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి
- 1991 - 1996 పార్లమెంటు సభ్యుడు, లోక్ సభ
- 1991 - 1994 మానవ వనరుల అభివృద్ధి మంత్రి, భారత ప్రభుత్వం
- 2000 - 2011 పార్లమెంటు సభ్యుడు, రాజ్యసభ
- 2000 - 2004 సభ్యుడు, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సలహా కమిటీ
- 2001 - 2004 సభ్యుడు, నిబంధనలపై కమిటీ
- 2002 - 2004 చైర్మన్, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ పర్పస్ కమిటీ
- 2004 - 2009 మానవ వనరుల అభివృద్ధి మంత్రి, భారత ప్రభుత్వం [3]
మరణం
మార్చుఅర్జున్ సింగ్ అనారోగ్య సమస్యలతో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చేరి చికిత్స పొందుతూ 2011 మార్చి 4న మరణించాడు.[4] ఆయన అంత్యక్రియలు ఆయన స్వస్థలమైన చుర్హాట్లో జరిగాయి. ఆయనకు భార్య సరోజ్ కుమారి, ఇద్దరు కుమారులు అజయ్ సింగ్ (ఎమ్మెల్యే), అభిమన్యు, కుమార్తె వీణ ఉన్నారు.[5]
మూలాలు
మార్చు- ↑ The Economic Times (5 March 2011). "Congress veteran Arjun Singh dead". Archived from the original on 25 September 2023. Retrieved 25 September 2023.
- ↑ India TV News (5 November 2014). "Arjun Singh, the missing MP Chief Minister during Bhopal Gas tragedy" (in ఇంగ్లీష్). Archived from the original on 25 September 2023. Retrieved 25 September 2023.
- ↑ CV at Indian Parliament website Archived 28 ఫిబ్రవరి 2008 at the Wayback Machine.
- ↑ India Today (4 March 2011). "Veteran Congress leader Arjun Singh dead" (in ఇంగ్లీష్). Archived from the original on 25 September 2023. Retrieved 25 September 2023.
- ↑ DNA India (21 November 2013). "Veteran Congress leader Arjun Singh dies aged 81" (in ఇంగ్లీష్). Archived from the original on 25 September 2023. Retrieved 25 September 2023.