అర్ధనారి

భానుశంకర్‌ చౌదరి దర్శకత్వంలో 2016లో విడుదలైన తెలుగు చలనచిత్రం

అర్ధనారి 2016, జూలై 1న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] భరతరాజ్‌ సమర్పణలో పత్తికొండ సినిమాస్‌ పతాకంపై కర్లపూడి కృష్ణ, ఎమ్‌.రవికుమార్‌ నిర్మాణ సారథ్యంలో భానుశంకర్‌ చౌదరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అర్జున్ యజత్, మౌర్యాని జంటగా నటించగా, రవివర్మ సంగీతం అందించాడు. ఈ చిత్రంలో అర్జున్ యజత్ ట్రాన్స్ జెండర్ గా నటించాడు. ఈ చిత్రాన్ని వైడ్ యాంగిల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ హిందీలోకి ఇదే పేరుతో అనువదించింది.[2][3] ఈ చిత్రం 2016 నంది పురస్కారాలులో ద్వితీయ ఉత్తమ చిత్రంగా వెండి నందిని అందుకుంది.[4]

అర్ధనారి
అర్ధనారి సినిమా పోస్టర్
దర్శకత్వంభానుశంకర్ చౌదరి
రచనభానుశంకర్ చౌదరి
నిర్మాతఎం. రవికుమార్
తారాగణంఅర్జున్ యజత్
మౌర్యాని
మిర్చి మాధవి
ఘర్షణ్ శ్రీనివాసన్
హరికృష్ణ
ఛాయాగ్రహణంశ్రీ శ్రీనివాస్ గధిరాజు
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతంరవివర్మ
నిర్మాణ
సంస్థ
పత్తికొండ సినిమాస్‌
విడుదల తేదీ
జూలై 1, 2016
సినిమా నిడివి
139 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

హిజ్రా అయిన అర్ధనారి (అర్జున్ యజత్) హైదరాబాద్ సిటీలోకి రాగానే హత్యలు చేయడం ప్రారంభిస్తుంది. పోలీసులకు దొరక్కుండా వరుసగా టార్గెట్ ప్రకారం పదుల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులను, అధికారులను కిడ్నాప్ చేసి హత్యలు చేస్తుండడంతో ఈ కేసు పోలీసులకు పెద్ద సమస్యగా మారుతుంది. చివరికి ఒక చిన్న క్లూ ద్వారా అర్థనారిని అరెస్టు చేసిన పోలీసులు, ఆమెను కోర్టు ముందు నిలబెట్టి హత్యలు చేయడానికి కారణం ఏమిటని ప్రశ్నిస్తారు. కానీ ఆర్థనారి మాత్రం పోలీసులకు, కోర్టుకు సమాధానం చెప్పకుండా ప్రజలతోనే నేరుగా మాట్లాడతానని చెబుతుంది. తను ఎవరూ, ఎందుకు అన్ని హత్యలు చేసిందనేది ఈ సినిమా కథ.

నటవర్గం

మార్చు
  • అర్జున్ యజత్
  • మౌర్యాని
  • మిర్చి మాధవి
  • ఘర్షణ్ శ్రీనివాసన్
  • హరికృష్ణ

సాంకేతికవర్గం

మార్చు
  • రచన, దర్శకత్వం: భానుశంకర్ చౌదరి
  • నిర్మాత: ఎం. రవికుమార్
  • సంగీతం: రవివర్మ
  • ఛాయాగ్రహణం: శ్రీ శ్రీనివాస్ గధిరాజు
  • కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
  • నిర్మాణ సంస్థ: పత్తికొండ సినిమాస్‌

విడుదల - స్పందన

మార్చు

300 థియేటర్స్‌లో[5] విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ సమీక్షలను వచ్చాయి.[6] ఇండియాగ్లిట్జ్ ఈ చిత్రానికి 2.5/5 రేటింగ్ ఇవ్వగా,[7] ఇలువ్సినిమా 3/5 రేటింగ్ ఇచ్చింది.[8]

మూలాలు

మార్చు
  1. "Releasing Today: Horror Galore At the Cinemas". greatandhra. 1 July 2016. Archived from the original on 3 జూలై 2016. Retrieved 20 January 2020.
  2. "Arddhanaari-Overview". filmibeat. 14 June 2016. Retrieved 20 January 2020.
  3. "Arddhanaari-Preview". indiaglitz. 28 June 2016. Retrieved 20 January 2020.
  4. "వెండితెర ఆ'నందు'లు". eenadu.net. హైదరాబాదు: ఈనాడు. Archived from the original on 15 November 2017. Retrieved 20 January 2020.
  5. "Ardhanari Releasing in 300 Screens". filmytollywood. 30 June 2016. Retrieved 20 January 2020.[permanent dead link]
  6. "Arddhanaari-Overview". ibtimes. 1 July 2016. Retrieved 20 January 2020.
  7. "Ardhanaari Movie Review - Half-done, half-witted". indiaglitz. 1 July 2016. Retrieved 20 January 2020.
  8. "Ardhanaari - Interesting Transgender Story". iluvcinema. 1 July 2016. Archived from the original on 4 July 2016. Retrieved 20 January 2020.

ఇతర లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=అర్ధనారి&oldid=3194553" నుండి వెలికితీశారు