అలర్జిక్ రైనైటిస్
అలర్జిక్ రైనైటిస్ , దీనిని హే ఫీవర్ అని కూడా పిలుస్తారు, ఇది ముక్కులో ఒక రకమైన వాపు, ఇది రోగనిరోధక వ్యవస్థ గాలిలో అలెర్జీ కారకాలకు అతిగా ప్రతిస్పందించినప్పుడు సంభవిస్తుంది.[1]
అలర్జిక్ రైనైటిస్ | |
---|---|
ఇతర పేర్లు | హే జ్వరం, పొలినోసిస్, అలెర్జీ రైనోసైనసిటిస్ |
పుప్పొడి (వివిధ రకాల మొక్కల నుండి సేకరించినవి, 500 సార్లు పెద్దగా చూపించబడ్డాయి | |
ప్రత్యేకత | ఇమ్యునాలజీ, అలెర్జీ |
లక్షణాలు | ముక్కు కారడం లేదా నిండుగా ఉండటం, తుమ్ము, ఎరుపు, దురద, కళ్ళలో నీళ్ళు రావడం, కళ్ళ చుట్టూ వాపు |
సాధారణ ప్రారంభం | ఇరవై నుంచి నలభై సంవత్సరాల మధ్య |
కారణాలు | జన్యువులు, పర్యావరణ కారకాలు |
ప్రమాద కారకములు | ఉబ్బసం, అలెర్జీ కండ్లకలక లేదా అటోపిక్ డెర్మటైటిస్ |
రోగనిర్ధారణ పద్ధతి | లక్షణాలతో |
భేదాత్మక రోగనిర్థారణ పద్ధతి | జలుబు |
నివారణ | ఆరంభంనుంచి జంతువులకు అలవాటు కావడం |
ఔషధం | నాసికా స్టెరాయిడ్స్, యాంటిహిస్టామైన్‌లు, డైఫెన్‌హైడ్రామైన్, క్రోమోలిన్ సోడియం, మాంటెలుకాస్ట్ వంటి ల్యుకోట్రీన్ రిసెప్టర్ వ్యతిరేకులు |
తరుచుదనము | ~20% |
లక్షణాలు
మార్చుసంకేతాలు లేదా లక్షణాలలో ముక్కు కారడం లేదా నిండుగా ఉండటం, తుమ్ము, ఎరుపు, దురద, కళ్ళలో నీళ్ళు రావడం, కళ్ళ చుట్టూ వాపు వంటివి ఉంటాయి.[2] ముక్కు నుండి వచ్చే ద్రవం సాధారణంగా తేటగా ఉంటుంది.[3] అలెర్జీ బహిర్గతం అయిన తరువాత కొన్ని నిమిషాల్లోనే లక్షణాలు ప్రారంభమవుతాయి, నిద్రను, చేస్తున్న పనిని లేదా అధ్యయనం చేసే సామర్థ్యాన్ని తగ్గించవచ్చు. కొంతమందికి సంవత్సరంలో నిర్దిష్ట సమయాల్లో మాత్రమే ఈ లక్షణాలు కనపడుతాయి, అంటే పుప్పొడి బహిర్గతంగా వెదజల్లబడే కాలంలో ఈ పరిస్థితి ఏర్పడవచ్చు.[4] అలర్జిక్ రైనైటిస్ ఉన్న చాలా మందికి ఉబ్బసం, అలెర్జీ కండ్లకలక లేదా అటోపిక్ డెర్మటైటిస్ కూడా ఉంటాయి.[3]
కారణాలు
మార్చుఅలెర్జీ రినిటిస్ సాధారణంగా పుప్పొడి, పెంపుడు జంతువుల జుట్టు, దుమ్ము లేదా బూజు వంటి పర్యావరణ అలెర్జీ కారకాల ద్వారా ఏర్పడుతుంది. వారసత్వంగా వచ్చిన జన్యువులు, పర్యావరణ కారకాలు అలెర్జీల అభివృద్ధికి దోహదం చేస్తాయి.[4] పొలంలో పెరగడం, ఎక్కువమంది తోబుట్టువులను ఉండటం అనేది ఈ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.[3] అంతర్లీన యంత్రాంగంలో అలెర్జీ కారకంతో జతచేయబడిన IgE (ఇమ్మ్యూనోగ్లోబులిన్) ప్రతిరోధకాలు ఉంటాయి, తదనంతరం మాస్ట్ కణాల (హిస్టామిన్, హెపారిన్ అధికంగా ఉండే బంధన కణజాలం లో ఉండే కణం) నుండి హిస్టామిన్ వంటి తాపజనక రసాయనాల విడుదలకు దారితీస్తుంది.[3] రోగనిర్ధారణ సాధారణంగా లక్షణాలు, అలెర్జీ-నిర్దిష్ట IgE ప్రతిరోధకాల కోసం చర్మం గుచ్చి చేసే పరీక్ష లేదా రక్త పరీక్షలపై ఆధారపడి ఉంటుంది. అయితే, ఈ పరీక్షలు సానుకూలంగా ఉండినా కూడా, ఫలితాలు తప్పు చూపించవచ్చు.[5] అలెర్జీల లక్షణాలు సాధారణ జలుబును పోలి ఉంటాయి, అయితే అవి రెండు వారాలకు పైగా కూడా ఉంటాయి, సాధారణంగా జ్వరం ఉండకపోవచ్చు.[4]
చికిత్స
మార్చుఆరంభంనుంచి జంతువులకు అలవాటు కావడం వలన ఈ నిర్దిష్ట అలెర్జీలు అభివృద్ధి చేసే ప్రమాదం తగ్గుతుంది.[4] అనేక రకాలైన మందులు ఈ లక్షణాలను తగ్గిస్తాయి, అవి: నాసికా స్టెరాయిడ్స్, యాంటిహిస్టామైన్‌లు, డైఫెన్‌హైడ్రామైన్, క్రోమోలిన్ సోడియం, మాంటెలుకాస్ట్ వంటి ల్యుకోట్రీన్ రిసెప్టర్ వ్యతిరేకులు (antagonists) [2] అయితే, మందులు పూర్తిగా ఈ వ్యాధి లక్షణాలను నియంత్రించలేవు ఇంకా అవి దుష్ప్రభావాలను కూడా కలిగించవచ్చు.[3] అలెర్జెన్ ఇమ్యునోథెరపీ (AIT) అని పిలువబడే పెద్ద మొత్తంలో అలెర్జీ కారకాలకు ప్రజలను బహిర్గతం చేయడం ప్రభావవంతంగా ఉండవచ్చు.[6] అలెర్జీ కారకాన్ని చర్మం కింద ఇంజెక్షన్‌గా లేదా నాలుక కింద టాబ్లెట్‌గా ఇవ్వవచ్చు. చికిత్స సాధారణంగా మూడు నుండి ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది, ఆ తర్వాత ప్రయోజనాలు దీర్ఘకాలం ఉండవచ్చు.[1]
వ్యాధి ప్రాబల్యం
మార్చుఅలెర్జీ రినిటిస్ అనేది అత్యధిక సంఖ్యలో ప్రజలను ప్రభావితం చేసే అలెర్జీ రకం.[7] పాశ్చాత్య దేశాలలో, ఒక సంవత్సరంలో 10 నుండి 30% మంది గురవుతారు.[3][8] ఇది ఇరవై నుంచి నలభై సంవత్సరాల మధ్య చాలా సాధారణంగా వస్తూంటుంది.[3] 10వ శతాబ్దంలో మొదటిసారిగా ఈ వ్యాధిగురించిన ఖచ్చితమైన వివరణ వైద్యుడు రాజెస్ ఇచ్చారు.[9] 1859లో, చార్లెస్ బ్లాక్లీ పుప్పొడి దీనికి కారణం అని గుర్తించారు.[10] 1906లో ఈ యంత్రాంగాన్ని క్లెమెన్స్ వాన్ పిర్క్వెట్ వివరించారు.[7] ప్రారంభంలో దీనివలన కొత్త ఎండుగడ్డి వాసన వంటి లక్షణాలు సంభవించాయనే (తప్పు) సిద్ధాంతం కారణంగా ఎండుగడ్డి తో పేరు ఏర్పడింది.[11][12]
మందులు
మార్చుసూచనలు
మార్చు- ↑ 1.0 1.1 "Immunotherapy for Environmental Allergies". NIAID. May 12, 2015. Archived from the original on 17 June 2015. Retrieved 19 June 2015.
- ↑ 2.0 2.1 "Environmental Allergies: Symptoms". NIAID. April 22, 2015. Archived from the original on 18 June 2015. Retrieved 19 June 2015.
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 3.5 3.6 Wheatley, LM; Togias, A (29 January 2015). "Clinical practice. Allergic rhinitis". The New England Journal of Medicine. 372 (5): 456–63. doi:10.1056/NEJMcp1412282. PMC 4324099. PMID 25629743.
- ↑ 4.0 4.1 4.2 4.3 "Cause of Environmental Allergies". NIAID. April 22, 2015. Archived from the original on 17 June 2015. Retrieved 17 June 2015.
- ↑ "Environmental Allergies: Diagnosis". NIAID. May 12, 2015. Archived from the original on 17 June 2015. Retrieved 19 June 2015.
- ↑ Boldovjáková, D; Cordoni, S; Fraser, CJ; Love, AB; Patrick, L; Ramsay, GJ; Ferguson, ASJ; Gomati, A; Ram, B (January 2021). "Sublingual immunotherapy vs placebo in the management of grass pollen-induced allergic rhinitis in adults: A systematic review and meta-analysis". Clinical otolaryngology : official journal of ENT-UK ; official journal of Netherlands Society for Oto-Rhino-Laryngology & Cervico-Facial Surgery. 46 (1): 52–59. doi:10.1111/coa.13651. PMID 32979035.
- ↑ 7.0 7.1 Fireman, Philip (2002). Pediatric otolaryngology vol 2 (4th ed.). Philadelphia, Pa.: W. B. Saunders. p. 1065. ISBN 9789997619846. Archived from the original on 2020-07-25. Retrieved 2016-09-23.
- ↑ Dykewicz MS, Hamilos DL (February 2010). "Rhinitis and sinusitis". The Journal of Allergy and Clinical Immunology. 125 (2 Suppl 2): S103–15. doi:10.1016/j.jaci.2009.12.989. PMID 20176255.
- ↑ Colgan, Richard (2009). Advice to the young physician on the art of medicine. New York: Springer. p. 31. ISBN 9781441910349. Archived from the original on 2017-09-08.
- ↑ Justin Parkinson (1 July 2014). "John Bostock: The man who 'discovered' hay fever". BBC News Magazine. Archived from the original on 31 July 2015. Retrieved 19 June 2015.
- ↑ (May 19, 1838). "Dr. Marshall Hall on Diseases of the Respiratory System; III. Hay Asthma". Retrieved on September 23, 2016.
- ↑ History of Allergy. Karger Medical and Scientific Publishers. 2014. p. 62. ISBN 9783318021950. Archived from the original on 2016-06-10.