అలీరాజ్‌పూర్
అలీరాజ్‌పూర్ మధ్యప్రదేశ్ రాష్ట్రం అలీరాజ్‌పూర్ జిల్లాలోని పట్టణం. 76.5% కంటే ఎక్కువ జనాభా దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్న అలిరాజ్‌పూర్ జిల్లా, భారతదేశంలోని అత్యంత పేద జిల్లాగా పేరుపొందింది.[1][2]
అలీరాజ్‌పూర్
అలీరాజ్‌పూర్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 22°18′19″N 74°21′9″E / 22.30528°N 74.35250°E | |
దేశం | India |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
జిల్లా | అలీరాజ్‌పూర్ |
జనాభా (2011) | |
• Total | 28,498 |
భాషలు | |
• అధికారిక | హిందీ, English |
Time zone | UTC+5:30 (IST) |
అలీరాజ్‌పూర్ గతంలో సంస్థానం. మధ్య భారతదేశంలోని భోపవర్ ఏజెన్సీలో భాగంగా ఉండేది. ఇది గుజరాత్, మహారాష్ట్రల సరిహద్దులకు సమీపంలో మధ్యప్రదేశ్ లోని మాళ్వా ప్రాంతంలో ఉంది. అలీరాజ్‌పూర్‌లోని విక్టోరియా వంతెన 1897 రాణి పరిపాలన వజ్రోత్సవం జ్ఞాపకార్థం నిర్మించారు.
జనాభా
మార్చు2001 భారత జనగణన ప్రకారం,[3] అలీరాజ్‌పూర్ జనాభా 25,161. జనాభాలో పురుషులు 52%, స్త్రీలు 48%, ఆరేళ్ళ లోపు పిల్లలు 15% ఉన్నారు.
చరిత్ర
మార్చుబ్రిటీష్ రాజ్ కాలంలో అలీరాజ్‌పూర్ అలీరాజ్‌పూర్ సంస్థానానికి రాజధానిగా ఉండేది. [4] 1947 సంవత్సరంలో స్వాతంత్ర్యం లభించిన తరువాత, అలీరాజ్‌పూర్ పాలక కుటుంబం ఢిల్లీకి తరలి వెళ్లింది, అలీ రాజ్‌పూర్ చివరి పాలకుడైన సురేంద్ర సింగ్ 1980 లలో స్పెయిన్‌లో భారత రాయబారిగా పనిచేశారు.
భౌగోళికం
మార్చుఅలీరాజ్పూర్ ప్రధానంగా కొండ. ప్రాంతం. మాజీ అలీరాజ్‌పూర్ తాలూకా ఝాబువా జిల్లాలోని ఝాబువా తాలూకా కంటే పెద్దది. ఇప్పుడు అలీరాజ్‌పూర్ ఒక జిల్లా. రాజ్వరా కోట పట్టణం మధ్యలో ఉంది.
రవాణా
మార్చుఅలీరాజ్పూర్ నుండి ఇండోర్‌కు, సమీప జిల్లాలకూ చక్కటి రోడ్డు సౌకర్యాలున్నాయి.
2019 అక్టోబరు 30 న అలీరాజ్‌పూర్ నుండి వడోదర లోని ప్రతాప్‌నగర్‌కు కొత్త రైలు మార్గాన్ని ప్రారంభించారు.
మూలాలు
మార్చు- ↑ "Alirajpur district in Madhya Pradesh poorest in the country: Global report". www.downtoearth.org.in (in ఇంగ్లీష్). Archived from the original on 2020-10-18. Retrieved 2021-01-01.
- ↑ "Alirajpur is the Black Hole of Indian Democracy - Politics News , Firstpost". Firstpost. 2019-04-19. Archived from the original on 2021-01-01. Retrieved 2021-01-01.
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 1 November 2008.
- ↑ Malleson, G. B.: An historical sketch of the native states of India, London 1875, Reprint Delhi 1984