ఝాబువా జిల్లా
మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో ఝాభౌ జిల్లా (హిందీ:झाबुआ जिला) ఒకటి. ఝాభౌ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది.
ఝాబువా జిల్లా
झाबुआ जिला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
డివిజను | Indore |
ముఖ్య పట్టణం | Jhabua |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | Ratlam |
విస్తీర్ణం | |
• మొత్తం | 3,782 కి.మీ2 (1,460 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 10,24,091 |
• జనసాంద్రత | 270/కి.మీ2 (700/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 44.45% |
• లింగ నిష్పత్తి | 989 |
సగటు వార్షిక వర్షపాతం | 800 మి.మీ. |
Website | అధికారిక జాలస్థలి |
భౌగోళికం
మార్చుఝాబౌ జిల్లా మధ్యప్రదేశ్ పశ్చిమ భాగంలో ఉంది. జిల్లా సరిహద్దులో పంచమల్ జిల్లా, గుజరాత్ రాష్ట్రంలోని వదోదరా జిల్లా, రాజస్థాన్ రాష్ట్రంలోని బన్‌స్వారా జిల్లా,, అలిరాపూర్ జిల్లా, ధార్ జిల్లా, రత్లాం జిల్లాలు ఉన్నాయి.[1] జిల్లా వైశాల్యం 3,782 చ.కి.మీ.జిల్లా భూభాగం ఎత్తుపల్లలుగా ఉంటుంది. వార్షిక వర్షపాతం 800 మి.మీ. జిల్లా 5 తాలూకాలు, 6 డెవెలెప్మెంటు బ్లాకులుగా (మండలాలు) విభజించబడి ఉంది.[1]
చరిత్ర
మార్చుఝాబౌ జిల్లా 2008 మేలో 2 జిల్లాలుగా (ఝాభౌ, అలీరాజ్‌పూర్) విభజించబడింది.
- అలీరజ్పుర్ 6 బ్లాక్స్ ఉన్నాయి :- జొబత్, ఉదైగర్హ్, భబ్ర, సొందవ, కత్థివద కొత్త జిల్లా, అలిరజ్పుర్.
- జబువా జిల్లాలో 7 బ్లాకులు ఉన్నాయి :- హబూ, మెఘ్నగర్, రనపుర్, రామ, తంద్ల, పెత్లవద్.
ఆర్ధికం
మార్చుఝాబౌ జిల్లా అత్యధిక కరువు బాధిత ప్రాంతంగా గుర్తుంచబడింది. ఝాబౌ జిల్లాలో నిస్సారమైన భూములు అధికంగా ఉన్నాయి. జిల్లాలోని స్త్రీలు చక్కని వెదురు వస్తువులు, బొమ్మలు, పూసల మాలలు, ఇతర వస్తువులు వంటి సంప్రదాయ వస్తులు తయారు చేస్తారు. అలాగే ఇతర గృహాలంకరణ వస్తువులను కూడా తయారు చేస్తుంటారు. పురుషులు టీర్ కంథి, ధనుర్భాణాలు వారి చిహ్నంగా ధరిస్తుంటారు. అది వారి శూరత్వం - స్వీయరక్షణకు గుర్తుగా ఉంటుంది.
2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో ఝాబౌ జిల్లా ఒకటి అని గుర్తించింది. .[2] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న మధ్యప్రదేశ్ రాష్ట్ర 24 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[2]
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,024,091,[3] |
ఇది దాదాపు. | సైప్రస్ దేశ జనసంఖ్యకు సమానం.[4] |
అమెరికాలోని. | మొంటనా నగర జనసంఖ్యకు సమం.[5] |
640 భారతదేశ జిల్లాలలో. | 440 వ స్థానంలో ఉంది.[3] |
1చ.కి.మీ జనసాంద్రత. | 285 [3] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 30.58%.[3] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 959:1000 [3] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 44.45%.[3] |
జాతియ సరాసరి (72%) కంటే. |
- 2001 గణాంకాల ప్రకారం (అలీరాజ్‌పూర్ విడిదీయబడిన తరువాత) మొత్తం జనసంఖ్యలో 91% గ్రామీణ ప్రజలున్నారు. వీరిలో 85.60% గిరిజనప్రజలు ఉండగా 3 % ప్రజలు షెడ్యూల్డ్ తెగలకు చెందిన ప్రజలు ఉన్నారు.[1] అలీరాజ్‌పూర్ విడిదీయబడక ముందు జిల్లాలో స్త్రీ: ప్రుషుల నిష్పత్తి 990:1000. జనసాంధ్రత చ.కి.మీకి 206.
విషయాలు | వివరణలు |
---|---|
అనుసరించి - జనసంఖ్య | 784,286 |
గ్రామీణ జనసంఖ్య | 91% |
గిరిజన ప్రజల శాతం | 85.6% |
ఇందులో పురుషుల సంఖ్య | 396,141 |
స్త్రీలసంఖ్య | 388,145 |
స్త్రీ పురుష నిష్పత్తి | 960: 1000 |
.[6]
ప్రజలు
మార్చుఝాబౌ జిల్లాలో ఆదివాసి ప్రజలు అధికంగా ఉన్నారు. అందువలన జిల్లాలో నిరక్షరాశ్యత, పేదరికం అధికంగా ఉన్నాయి. జిల్లాలో 50% కంటే అధికంగా దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారు. జిల్లాలో భిల్లు, భిలియా ప్రజలు అధికంగా జిల్లా లోతట్టు ప్రాంతంలో నివసిస్తున్నారు.
భాషలు
మార్చుజిల్లాలో భిల్లు భాషలలో ఒకటైన బరేలి రాథ్వి భాష 64,000 మంది ప్రజలలో వాడుకలో ఉంది. ఈ భాషను వ్రాయడానికి దేవనాగరి లిపిని ఉపయోగిస్తుంటారు. [7] అలాగే భిల్లై భాష 11,50,000 మంది ప్రజలలో వాడుకలో ఉంది.[8]
అక్షరాశ్యత
మార్చుజిల్లాలో అక్షరాస్యత 36.9%. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అక్షరాస్యతాపరంగా ఝాబౌ జిల్లా అత్యంత తక్కువగా ఉంది..[9]
సంస్కృతి
మార్చుజిల్లా కేంద్రం ఝాబౌ నుండి 8 కి.మీ దూరంలో ఉన్న దియోఝిరి గ్రామంలో పురాతన ఆలయం, ఝిరి (నిరంతర ప్రవాహం ఉన్న సెలయేరు) ఉన్నాయి. సెలయేటి జలాలతో ఒక కుండం ఏర్పడింది. వైశాఖపూర్ణిమ నాడు ఈ ఆలయంలో ఉత్సవం నిర్వహిస్తారు. గ్రిగేరియన్ కేలండర్ అనుసరించి ఈ ఉత్సవం ఏప్రిల్ మాసంలో నిర్వహించబడుతుంది. జిల్లాలోని ఖతివద పెద్ద సైజు మామిడి కాయల ఉత్పత్తికి ప్రాముఖ్యత కలిగి ఉంది.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 "Jhabua". District administration. Archived from the original on 2010-09-01. Retrieved 2010-08-20.
- ↑ 2.0 2.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Cyprus 1,120,489 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Montana 989,415
- ↑ "Population, decadal growth rate, sex ratio and density – States/Union territories and Districts : 2001". Table 1. Education for all in India, Source:Registrar General of India, Government of India, New Delhi. Archived from the original on 2009-09-17. Retrieved 2010-08-12.
- ↑ M. Paul Lewis, ed. (2009). "Bareli, Rathwi: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
- ↑ M. Paul Lewis, ed. (2009). "Bhilali: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-30.
- ↑ "Seminar On Progress Of Literacy In India: What The Census 2001 Preveals Niepa, New Delhi, October 05, 2002". India’s Literacy Panorama. educationforallinindia.com. Archived from the original on 2010-03-29. Retrieved 2010-08-17.
వెలుపలి లింకులు
మార్చు- [1] List of places in Jhabua