అల్యూమినియం డైబోరైడ్
అల్యూమినియం డైబోరైడ్ లేదా అల్యూమినియం బోరైడ్ ఒక రసాయన సంయోగపదార్థం. ఇది ఒక అకర్బన సమ్మేళనపదార్థం. అల్యూమినియం డైబోరైడ్ రసాయన సంకేతపదం (AlB2).[1] ఈ సంయోగ పదార్థం అల్యూమినియం లోహమూలకం, ఉపధాతువు బోరాన్ మూలకముల సంయోగము వలన ఏర్పడినది. అల్యూమినియం లోహం, బోరాన్ ల సమ్మేళనం వలన ఏర్పడిన రెండు సంయోగపదార్థాలలో అల్యూమినియం డైబోరైడ్ ఒకటికాగా, మరొకటి అల్యూమినియం డోడెకాఅల్యూమినియం బోరైడ్ (AlB12). ఈ రెండు అల్యూమినియం సంయోగపదార్థాలను సాధారణంగా అల్యూమినియం బోరైడ్ అని వ్యవహరిస్తారు.
పేర్లు | |
---|---|
IUPAC నామము
aluminium diboride
| |
ఇతర పేర్లు
aluminium boride
aluminum diboride | |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [12041-50-8] |
యూరోపియన్ కమిషన్ సంఖ్య | 234-923-7 |
SMILES | B1=B[Al]1 |
| |
ధర్మములు | |
AlB2 | |
మోలార్ ద్రవ్యరాశి | 48.604 g/mol[1] |
స్వరూపం | Copper-red solid |
సాంద్రత | 3.16 g/cm³[2] |
ద్రవీభవన స్థానం | 1,655 °C (3,011 °F; 1,928 K) |
insoluble | |
నిర్మాణం | |
స్ఫటిక నిర్మాణం
|
Hexagonal, hP3 |
P6/mmm, No. 191 | |
ఉష్ణగతిక రసాయన శాస్త్రము | |
నిర్మాణము మారుటకు కావాల్సిన ప్రామాణిక ఎంథ్రఫీ ΔfH |
-151 kJ/mol |
ప్రామాణిక మోలార్ ఇంథ్రఫీ S |
34.7 J/mol K |
విశిష్టోష్ణ సామర్థ్యం, C | 43.6 J/mol K |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
verify (what is ?) | |
Infobox references | |
భౌతిక ధర్మాలు
మార్చుఅల్యూమినియం డైబోరైడ్ రాగి (లోహం) వంటి ఎరుపు రంగులో ఉండు ఘనపదార్థం. అల్యూమినియం డైబోరైడ్ అణుభారం 48.604 గ్రాములు/మోల్.[1] 25 °C ఉష్ణోగ్రత వద్ద అల్యూమినియం డైబోరైడ్ సాంద్రత 3.16 గ్రాములు/సెం.మీ3.[2] ఈ సంయోగపదార్థం ద్రవీభవన స్థానం 1,655 °C (3,011 °F;1,928 K). అల్యూమినియం డైబోరైడ్ నీటిలో కరుగదు.
నిర్మాణం
మార్చునిర్మాణ పరంగా అల్యూమినియం డైబోరైడ్‌లో బోరాన్ పరమాణువులు గ్రాఫైట్ వంటి పలకల వలె ఉండి, వాటి మధ్యలో అల్యూమినియం పరమాణువులు ఉండును. ఈ అణు నిర్మాణం ఒకవిధంగా మెగ్నిషియం డైబోరైడ్ నిర్మాణపోలిక కలిగి ఉంది. అల్యూమినియం డైబోరైడ్ ఒంటరి స్పటికాలు లోహవాహకతత్వం ప్రదర్శించును[3] .స్పటికసౌష్టవం షట్భుజాకారం (Hexagonal).
ఆరోగ్యపరమైన ఇబ్బందులు
మార్చుఅల్యూమినియం డైబోరైడ్ ను ప్రమాదకర మైన రసాయనంగానే పరిగణిస్తారు. ఇది ఆమ్లాలు, హైడ్రోజన్తో చర్య వలన విషవాయువులను ఉత్పత్తి చేయును. ఉదాహరణకు హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య వలన బోరెన్ (Borane), అల్యూమినియం క్లోరైడ్ను విడుదల చేయును.
ఉపయోగం
మార్చుఅల్యూమినియం డైబోరైడ్ ఎక్కువ నిరోధకగుణం, కఠినత్వం కలిగిఉండటం వలన దీని చూర్ణాన్ని పలు లోహ, అలోహ వస్తువులను గ్రైండింగు చేయుటకు, పాలిష్ చేయుటకు ఉపయోగిస్తారు.[4]
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు/ఆధారాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 "Aluminum diboride". sigmaaldrich.com. Retrieved 2015-10-12.
- ↑ 2.0 2.1 "ALUMINUM BORIDE". chemicalbook.com. Retrieved 2015-10-12.
- ↑ "On the electronic and structural properties of aluminum diboride Al0.9B2" Burkhardt, Ulrich; Gurin, Vladimir; Haarmann, Frank; Borrmann, Horst; Schnelle, Walter; Yaresko, Alexander; Grin, Yuri Journal of Solid State Chemistry 177 (2004) 389-394
- ↑ "Aluminum boride". britannica.com. Retrieved 2015-10-12.