అల్యూమినియం బ్రోమైడ్

అల్యూమినియం బ్రోమైడ్ ఒకరసాయన సంయోగపదార్థం. అల్యూమినియం బ్రోమైడ్‌ ఒక అకర్బన రసాయన సమ్మేళనపదార్థం. ఈ సంయోగపదార్థం ఎంపిరికల్ ఫార్ములా AlBrx. ఇక్కడ x అనునది 3, లేదా 6 కావొచ్చును. ఉదాహరణకు AlBr3,, Al2Br6 కావొచ్చును. అల్యూమినియం, బ్రోమిన్ మూలకాల సంయోగము వలన ఈ సంయోగపదార్థం ఏర్పడినది. ఈ స్పెసిసిన్ లో అల్యూమినియం ట్రైబ్రోమైడ్‌ను అల్యూమినియం బ్రోమైడ్ అని వ్యవహరిస్తారు. ఈ రసాయన సమ్మెళనశ్రేణిలో అత్యధికఉషోగ్రత వద్ద అల్యూమినియం లోహంతో హైడ్రోబ్రోమిన్ చర్యవలన అల్యూమినియం బ్రోమైడ్ ఏర్పడును. గది ఉష్ణోగ్రతవద్ద అల్యూమినియం బ్రోమైడ్ డిస్‌ప్రోపోర్సేనేట్ (disproportionate) చెందును.అనగా ఏకకాలంలో ఆక్సీకరణ, క్షయికరణపొంది రెండు భిన్నమైన పదార్థాలుగా ఏర్పడును.

అల్యూమినియం బ్రోమైడ్
Ball and stick model of dimeric aluminium bromide
పేర్లు
Preferred IUPAC name
Aluminium bromide
ఇతర పేర్లు
Aluminic bromide

Aluminium(III) bromide

Aluminium tribromide
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [7727-15-3]
పబ్ కెమ్ 24409
యూరోపియన్ కమిషన్ సంఖ్య 231-779-7
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య BD0350000
SMILES Br[Al](Br)Br
ధర్మములు
AlBr3
Al2Br6
మోలార్ ద్రవ్యరాశి 266.69 g/mol[1]
స్వరూపం white to pale yellow
crystalline solid
వాసన pungent
సాంద్రత 3.205 g/cm3[2]
ద్రవీభవన స్థానం 97.8 °C (208.0 °F; 370.9 K)
బాష్పీభవన స్థానం 265 °C (509 °F; 538 K)
reacts
ద్రావణీయత slightly soluble in methanol, diethyl ether, acetone
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
monoclinic
ప్రమాదాలు
ఇ.యు.వర్గీకరణ {{{value}}}
Lethal dose or concentration (LD, LC):
1598 mg/kg (oral, rat)
సంబంధిత సమ్మేళనాలు
ఇతరఅయాన్లు {{{value}}}
ఇతర కాటయాన్లు
boron tribromide
సంబంధిత సమ్మేళనాలు
iron(III) bromide
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references
6/n "[AlBr]n" → Al2Br6 + 4Al

అయితే 1000 °C కన్న ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద పైన పేర్కొన్న రసాయనచర్య వ్యతిరేకంగా జరుగును.

భౌతిక ధర్మాలు

మార్చు

శుద్ధమైన సంయోగపదార్థం తెల్లగా ఉండును. ఇనుపధాతు సంబంధిత మలినాలున్న పదార్థం పాలిపోయిన పసుపు రంగు స్పటికాలుగా ఉండును.[3] ఘాటైన వాసన కల్గిఉన్నది. అల్యూమినియం బ్రోమైడ్ అణుభారం 266.69 గ్రాములు/మోల్.[1] సాధారణంగా 25 °C వద్ద అల్యూమినియం బ్రోమైడ్ సాంద్రత 3.205 గ్రాములు/సెం.మీ3.[2] అల్యూమినియం బ్రోమైడ్ సంయోగ పదార్థం ద్రవీభవన స్థానం 97.8 °C (208.0 °F;370.9K). అలాగే అల్యూమినియం బ్రోమైడ్ బాష్పీభవన స్థానం 265 °C (509 °F; 538K).

నిర్మాణ సౌష్టవం

మార్చు

ఘనస్థితిలోను, నాన్ కోఅర్డీనేటింగు ద్రావణులల్లో(CS2),, ద్రవీకరణస్థితిలో అల్యూమినియం ట్రైబ్రోమైడ్ నిజానికి డైఅల్యూమినియం హెక్సాబ్రోమైడ్ రూపంలో ఉండును,, ఈ స్థితిలో దీని అణుఫార్ములా Al2Br6. అల్యూమినియం బ్రోమైడ్ను ఇగిర్చినపుడు/బాష్పీకరించినపుడు, వాయుస్థితిలో కుడా పైలక్షణాలనే కలిగిఉండును. అధిక ఉష్ణోగ్రత వద్ద వాయుఅణువులు ఏకాంగ రూపం(monomers) గా విడిపోవును.

Al2Br6 → 2 AlBr3 ΔH°diss = 59kJ/mol

డై అల్యూమినియం హెక్సాబ్రోమైడ్ చతుర్భుజాకారంగా రెండు అల్యూమినియం టెట్రాబ్రోమైడ్ (AlBr4) లను కలిగి రెండు ఒకేఅంచును ఉమ్మడిగా పంచుకొని ఉండును. కేవలM వాయుస్థితిలో ఉండు ఏకాంగ రూపం (monomer) అల్యూమినియం బ్రోమైడ్ (AlBr3) త్రికోణసమతల సౌష్టవాన్ని కలిగిఉండును. అల్యూమినియం యొక్క పరమాణు హైబ్రిడేసన్^ను sp2గా వర్ణిస్తారు. బ్రోమిన్ -అల్యూమినియం- బ్రోమిన్ బంధకోణం 120°.

సంశ్లేషణ

మార్చు

అతి సాధారణంగా లభ్యమగు అల్యూమినియం బ్రోమైడ్ రూపం డైఅల్యూమినియం హెక్సాబ్రోమైడ్ రూపం. ఇది సాధారణ ప్రమాణస్థితిలో రంగులేని ఘనపదార్థం . ఇనుపలోహ సంబంధిత మలినాలున్న అల్యూమినియం బ్రోమైడ్ పసుపు లేదా ఎరుపు-బ్రౌన్ మిశ్రమవర్ణాన్ని కలిగిఉండును. హైడ్రోబ్రోమిన్ తో అల్యూమినియం చర్యవలన అల్యూమినియం బ్రోమైడ్ ఏర్పడును.

2 Al + 6 HBr → Al2Br6 + 3 H2

ప్రత్యామ్నాయముగా నేరుగా అల్యూమినియాన్ని బ్రోమినేసన్ /బ్రోమినీకరణ చెయ్యడం వలన కూడా అల్యూమినియం బ్రోమైడ్‌ను ఉత్పత్తి చెయ్యవచ్చును.[3]

2 Al + 3 Br2 → Al2Br6

డై అల్యూమినియం హెక్సాబ్రోమైడ్ (Al2Br6 ) సులభంగా విడిపోయి లేవిస్ ఆమ్లం అల్యూమినియం ట్రైబ్రోమైడును ఏర్పరచును. అల్యూమినియం బ్రోమైడ్ (Al2Br6 ) నీటితో జలవిశ్లేషణ వలన హైడ్రోబ్రోమిన్ (HBr), Al-OH-Br సాముహ సమ్మేళనంలను ఏర్పరచును. నీటికన్న తక్కువ చర్యాశీలతగా అయినప్పటికీ ఆల్కహాల్, కార్బోక్సిలిక్ ఆమ్లాలతో అల్యూమినియం బ్రోమైడ్ రసాయనచర్యలో పాల్గొనును. సాధారణ లేవిస్‌క్షారాలతో (L) డైఅల్యూమినియం హెక్సాబ్రోమైడ్ వంటివి ఏర్పడును.

కార్బన్ టెట్రాక్లోరైడ్ తో 100 °C వద్ద అల్యూమినియం బ్రోమైడ్ రసాయనచర్య ఫలితంగా కార్బన్ టెట్రాబ్రోమైడ్ ఏర్పడును.

4 AlBr3 + 3 CCl4 → 4 AlCl3 + 3 CBr4

ఫాస్‌జీన్తో అల్యూమినియం బ్రోమైడ్ రసాయనచర్య వలన కార్బోనైల్ బ్రోమైడ్, అల్యూమినియం క్లోరోబ్రోమైడ్ ఏర్పడును.

AlBr3 + COCl2 → COBr2 + AlCl2Br

అల్యూమినియం బ్రోమైడ్ బలమైన లేవిస్ ఆమ్లం (Lewis acid)

ఉపయోగాలు

మార్చు

ఫ్రైడేల్-క్రాఫ్ట్స్ ఆల్కిలేసను చర్య(Friedel-Crafts alkylation reaction) లో నిర్జల అల్యూమినియం బ్రోమైడ్‌ను ఉత్ప్రేరకంగా ఉపయోగిస్తారు.అల్యూమినియం బ్రోమైడ్ యొక్క ఉత్ప్రేరకచర్య నిర్జల అల్యూమినియం క్లోరైడ్ చర్యాగుణాన్ని పోలిక కల్గిఉండును.

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు/ఆధారాలు

మార్చు
  1. 1.0 1.1 "Aluminium bromide". chemspider.com. Retrieved 2015-10-15.
  2. 2.0 2.1 "Aluminum bromide". sigmaaldrich.com. Retrieved 2015-10-15.
  3. 3.0 3.1 "Methods of Manufacturing". pubchem.ncbi.nlm.nih.gov. Retrieved 2015-10-15.
  • Dohmeier, Carsten; Loos, Dagmar; Schnöckel, Hansgeorg (1996). "Aluminum(I) and Gallium(I) Compounds: Syntheses, Structures, and Reactions". Angewandte Chemie International Edition in English. 35 (2): 129. doi:10.1002/anie.199601291.
  • "Encyclopedia of Reagents for Organic Synthesis". 2001. doi:10.1002/047084289X. ISBN 0471936235. {{cite journal}}: Cite journal requires |journal= (help)
  • Renfew, Malcom M. (1991). "Hazardous laboratory chemicals: Disposal guide (Armour, M.A.)". Journal of Chemical Education. 68 (9): A232. doi:10.1021/ed068pA232.2.