పరమాణువు

(పరమాణు నుండి దారిమార్పు చెందింది)

పదార్థం (matter) అణువుల సముదాయం అని డాల్టన్ సిద్దాంంతీకరించేడు. ఒక మూలకం (element) తన రసాయన స్వభావాన్ని కోల్పోకుండా ఎంత చిన్న ముక్క కాగలదో అదే అణువు అంటే. ప్రతి అణువులోను ఒక కేంద్రకం (nucleus), ఆ కేంద్రకం చుట్టూ ఎలక్ట్రానులు ఉన్నట్లు ఊహించుకోవచ్చని ఒక నమూనా చెబుతోంది. అణువు కేంద్రకంలో ప్రోటానులు, నూట్రానులు అనేవి ఉంటాయి. ఈ ఎలక్ట్రానులని, ప్రోటానులని, నూట్రానులని గుత్తగుచ్చి పరమాణువులు అనొచ్చు. ఈ పరమాణువుల కంటే చిన్నవి ఏవైనా ఉన్నాయా? నిజంగా వాటికి అస్తిత్వం ఉందో లేదో తెలియదు కాని, సిద్దాంతాలకోసం నిర్మించిన నమూనాలలో క్వార్కులు అనేవి ఉన్నాయి. పరమాణువుల కంటే చిన్నవాటిని అన్నిటిని మూట కట్టి పరమాణు రేణువులు (sub-nuclear particles) అనొచ్చు.

రెండు కాని అంతకంటె ఎక్కువ కాని ఉన్న అణు సమూహాలని బణువు (molecule) అంటారు. ఈ అణు సమూహాలలో ఉన్న అణువులు అన్నీ ఒకే మూలకానికి చెందినవి అవాలని నియమం ఏదీ లేదు. ఉదాహరణకి నీటి బణువు (water molecule) రెండు ఉదజని అణువులు, ఒక ఆమ్లజని అణువు ఉంటాయి. కొన్ని బణువులలో కొద్ది అణువులే ఉంటాయి: ఒక ఆమ్లజని బణువు (O2) లో రెండు ఆమ్లజని అణువులు ఉంటాయి. ఒక నీటి బణువు (H2O) రెండు ఉదజని అణువులు, ఒక ఆమ్లజని అణువు ఉంటాయి. కొన్ని బణువులలో 100 అణువులు పైబడే ఉండొచ్చు. అటువంటి పెద్ద బణువులని బృహత్ బణువులు (mega molecules) అంటారు. ఇంతవరకు ప్రస్తావించిన వాటిని పరిమాణపు తగ్గుదలలో అమర్చి బృహత్ బణువులు, బణువులు, అణువులు, పరమాణువులు, పరమాణు రేణువులు అని వర్గీకరించవచ్చు.

పద అయోమయంసవరించు

"atom"అనే ఇంగ్లీషు మాటని తెలుగులో అణువు అని కొన్ని చోట్ల, పరమాణువు అని కొన్ని చోట్ల అంటున్నారు. కొన్ని భారతీయ భాషలలో (హిందీ, కన్నడ భాషలలో) "atom"ని పరమాణువు అంటారుట. "మోలిక్యూల్"ని అణువు అంటారుట. కాని అణుశక్తి వంటి ప్రయోగాలలో అణువు అంటే "atom" అనే అర్థం అవుతోంది. ఈ అయోమయాన్ని నివృత్తి చేసేందుకు పై నిర్వచనాలు ఇవ్వడం జరిగింది.

స్వరూపంసవరించు

అణువు = ఏటం

అణుశక్తి = ఎటామిక్‌ ఎనర్జీ

అణ్వస్త్రం = ఎటామిక్‌ వెపన్‌ (ఉ. ఏటం బాంబు)

పరమాణువు = సబ్‌ ఎటామిక్ పార్టికిల్‌ (ఉ. ఎలక్‌ట్రాన్, ప్రోటాన్‌, నూట్రాన్‌, వగైరా)

పరమాణు రేణువు = సబ్‌ నూక్లియార్‌ పార్టికిల్‌ (ఉ. క్వార్క్)

బణువు = మోలిక్యూల్‌ (ఉ. NaCl, H2O, CH4)

బృహత్‌ బణువు = మెగా మోలిక్యూల్‌ (ఉ. జీవరసాయనంలో కనబడే అనేక పదార్థాలు, ఆంగిక రసాయనంలో కనబడే అనేక పదార్థాలు)

కణిక = నూక్లియస్‌ (జీవశాస్త్రం లోను, భౌతిక శాస్త్రంలోను ఇదే పదం వివిధమైన అర్థాలతో వాడవచ్చు.)

కణ్వస్త్రం = నూక్లియార్‌ వెపన్‌ (హైడ్రొజన్‌ బాంబు)

ఇవి కూడా చూడండిసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=పరమాణువు&oldid=2773434" నుండి వెలికితీశారు