అల్లం అప్పారావు

అల్లం అప్పారావు జేఎన్‌టీయూ కాకినాడకు తొలి వీసీ. కంప్యూటర్స్‌ నిపుణుడు.

అల్లం అప్పారావు
అల్లం అప్పారావు
జననంఅల్లం అప్పారావు
ఉండి, పశ్చిమ గోదావరి జిల్లా
మరణం20 May 2023
Dallas ,texas
ప్రసిద్ధికంప్యూటర్స్‌ నిపుణుడు
దక్షిణ భారతదేశంలోనే తొలి సైంటిఫిక్‌ కంప్యూటర్‌ వ్యవస్థ ఐబీఎం-1130 ను ఏయూ లో నెలకొల్పారు
తండ్రిగురుమూర్తి
తల్లిలక్ష్మీబాయి

స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి. నాన్న గురుమూర్తి, అమ్మ లక్ష్మీబాయి. నాన్న ఉపాధి కోసం విజయనగరం వచ్చి, రాజుల సంస్థానంలో దివాన్‌గా చేరాడు. ఆ తరువాత సంస్థానాలన్నీ ప్రభుత్వంలో విలీనం కావడంతో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగం ఇచ్చారు. ఎస్‌.కోట, ఎల్‌.కోట, కొత్తవలసల్లో చదువు. 1964 లో పీ యూసీ, 1967లో బీఎస్సీ .

తొలి ఉద్యోగం పేరే 'కంప్యూటర్'. గణాంక వివరాలన్నింటిని సమీకరించే పని. హిందూస్థాన్‌ పాలిమర్స్‌లో 'కలర్‌ కెమిస్ట్‌' ఉద్యోగం నెల రోజులే చేశాడు. దాన్ని వదిలి ఏయూలో పరిశోధకులకు సహాయకునిగా వుండే 'కంప్యూటర్‌ ఆపరేటర్‌'గా జాయిన్‌ అయ్యాడు. బుల్లయ్య, రామచంద్రరావు మాస్టార్లు ఇద్దరూ కలిసి 1970-71 మధ్యకాలం లో దక్షిణ భారతదేశంలోనే తొలి సైంటిఫిక్‌ కంప్యూటర్‌ వ్యవస్థ ఐబీఎం-1130 ను ఏయూ లో నెలకొల్పారు. దాని నిర్వహణలో ప్రముఖ పాత్ర పోషించాడు. ఎంఏ (ఎకనామిక్స్‌) చేశాడు. 1976-78లో ఎల్రక్టికల్‌ ఇంజనీరింగ్‌ చేశాడు. పీహెచ్‌డీ పూర్తిచేసి 1981లో థీసిస్‌ సమర్పిస్తే 1984 లో డిగ్రీ ఇచ్చారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో లెక్చరర్‌గా, రీడర్‌గా చేయకుండా నేరుగా ప్రొఫెసర్‌ అయిన తొలి వ్యక్తి. కంప్యూటర్స్‌ విభాగాధిపతిగా, చీఫ్‌ వార్డెన్‌గా, బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ ఛైర్మన్‌గా, ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ గా అనేక బాధ్యతలు నిర్వహించాడు. ఆయన దగ్గర ఇప్పటివరకూ 15 మంది పీహెచ్‌డీలు చేసి పట్టాలు పొందారు. ఎమ్మెస్సీ చేసిన వారికి ఎంటెక్‌ చేసే అవకాశం కల్పించాడు. ఎన్టీఆర్‌ యూనివర్సిటీతో కలిసి 'క్లినికల్‌ రీసెర్చి'పై అధ్యయనం ప్రారంభించాడు. మధుమేహ రోగం మూలాలు తెలుసుకోవడానికి అమెరికాకు చెందిన వి.ఎన్‌.దాస్‌, విశాఖలోని డాక్టర్‌ శ్రీధర్‌లతో కలసి డయాబెటీస్‌ జెనిటిక్స్‌పై 'బయో ఇన్‌ఫర్మేటిక్స్‌' అంశంపై పదేళ్లుగా పరిశోధనలు చేస్తున్నాడు. ప్రొఫెసర్‌ చందు సుబ్బారావుతో కలసి 'ఐ.టి. కల్చర్‌' అనే పుస్తకం రాశాడు.

నవంబర్ 2018లో ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఆయనను గౌరవ డాక్టరేటుతో సత్కరించింది.[1]

భావాలు

మార్చు
  • ఎవరికైనా 45ఏళ్ల వయస్సులో గొప్ప అవకాశాలు వస్తే అద్భుతమైన ఫలితాలు సాధించగలుగుతారు
  • ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ (సాంకేతిక రంగం) అంటే అదొక సంస్కృతి. ఒంటరిగా మనజాలదు. అన్నింట్లోనూ ఉంటుంది. ఇది అన్ని రంగాల్లోనూ అవసరమే. ఈ రంగం ఒక్కటే ప్రత్యేకంగా పడిపోవడం అంటూ జరగదు. ఆర్థిక మాంద్యం అన్ని రంగాల్లోనూ ఉండడం వల్ల వాటితోపాటు ఇది కూడా తగ్గింది. ఇప్పుడు ఆయా రంగాలు పుంజుకుంటే ఐటీ కూడా వాటితో పాటే వృద్ధి చెందుతుంది.
  • మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలి.

మూలాలు

మార్చు