కొత్తవలస

ఆంధ్ర ప్రదేశ్, విజయనగరం జిల్లా, కొత్తవలస మండలం లోని జనగణన పట్టణం

కొత్తవలస, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా,కొత్తవలస మండలంలోని గ్రామం.

కొత్తవలస రైల్వే కూడలి

పాలనా పరంగా కొత్తవలస విజయనగరం జిల్లాలోని కొత్తవలస మండలం మండలానికి చెందిన గ్రామమైనా దాదాపు విశాఖపట్నంలో కలిసిపోయింది.విశాఖపట్నం నుంచి అరకు వెళ్లే మార్గంలో విశాఖపట్నానికి 27 కి.మీ. దూరంలో ఉంది. విజయనగరానికి 38 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొత్తవలస చుట్టూ కొండలు ఉన్నాయి. కనుచూపు మేరలో తూర్పు కనుమలు కనపడతూ ఉంటాయి. కొత్తవలస మామిడి, జీడి తోటలు, ఎర్రమట్టికి ప్రసిద్ధి. ఇక్కడి నుండి ప్రతీ సంవత్సరం కోల్కోత్తకి మామిడి కాయలు ఎగుమతి చేస్తారు. ఎర్రమట్టిని ఉపయోగించి బంగళా పెంకులు తయారు చేసి ప్రక్కనున్న ఒడిషా రాష్ట్రానికి ఎగుమతి చేస్తారు. ఇక్కడ దాదాపు 30 పెంకుల మిల్లులు ఉన్నాయి.

గణాంకాలుసవరించు

2011 భారత  జనగణన గణాంకాల  ప్రకారం జనాభా మొత్తం - మొత్తం 68,579 - పురుషులు 33,776 - స్త్రీలు 34,803

మూలాలుసవరించు

వెలుపలి లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=కొత్తవలస&oldid=2871868" నుండి వెలికితీశారు