అల్లిపూల వెన్నెల

అల్లిపూల వెన్నెల 2021లో బతుకమ్మ పండుగ సందర్భంగా రూపొందించిన పాట. బతుకమ్మకు అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి దక్కేలా తెలంగాణ జాగృతి సంస్థ నిర్మించిన ‘అల్లిపూల వెన్నెల’ పాటకు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించగా, ఏఆర్‌ రెహ్మాన్ సంగీతం అందించాడు.[1]

అల్లిపూల వెన్నెల

నిర్మాణం మార్చు

నగరం నుండి సొంతూరు బయల్దేరిన ఓ కుటుంబం తమ స్వగ్రామంలో బతుకమ్మ పండుగ వేడుకలు జరుపుకునేందుకు బయల్దేరుతుంది. సొంతూరికి వచ్చే క్రమంలో ఓ మహిళ తన కూతురికి బతుకమ్మ గొప్పదనం తెలిపేలా పాట పాడుతూ ఉంటుంది. తెలంగాణా ప్రజలు జరుపుకునే బతుకుమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రూపొందించిన ఈ పాటకు సంగీత దర్శకుడు, ఆస్కార్‌ అవార్డు విజేత ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించగా‌, దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వం వహించాడు. ఈ పాట షూటింగ్ యాదాద్రి భువనగిరి జిల్లా, భూదాన్‌ పోచంపల్లి లో జరిగింది. ఈ పాటను అక్టోబరు 5న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, విడుదల చేసింది. ఈ పాటను కాపీరైట్‌ లేకుండా హెచ్‌డీలో విడుదల చేశారు.[2]

నటీనటులు మార్చు

  • మేకా రాజన్
  • అనఘ
  • యాంజెలీనా

సాంకేతిక నిపుణులు మార్చు

సాహిత్యం మార్చు

అల్లిపూల వెన్నెల… చెరువులోన కురవగా పూలఇంద్ర ధనస్సులే నేలమీద నిలవగా కొమ్మలన్ని అమ్మలై వేల పూలు విరియగా పుట్టమన్ను మట్టిలో… మట్టి గౌరి పుట్టగా

అల్లిపూల వెన్నెల… చెరువులోన కురవగా..

తరలివచ్చే తంగెడు… తనకు పట్టు చీరగా రవికెలాగా తామర… పువ్వులన్ని మారగా

తనువుకేమో గుమ్మడి… బంధమయ్యి నిలువునా పొద్దుపొడుపు దిద్దినే నుదుటి మీద కుంకుమ

కూలి తల్లి గొంతులో కోయిలమ్మ కూయగా తెలంగాణకొచ్చేనే బతుకమ్మ పండుగ

కమ్మగుండె గూటికి… ఆడపడచు ఆటకి గునుగు పూల తోటకి ఏనుగు మీద తేగకి ఏరువాక ఎదలకి… ఏటిలోని అలలకి కట్ల పూల కళ్ళకి… కానుకయ్యి పల్లకి తరలి తరలి వచ్చెనే బతుకమ్మ వరదలపై తరలిపోవు తన జన్మ

మెట్టినింటి పిలుపుతో వెళ్లిపోయే చెల్లెలా జ్ఞాపకాల బరువులో చెమ్మగిల్లె తల్లిలా ఆడబిడ్డ చెయ్యిని… తల్లి తల్లి గడపని దాటిపోయే నీటిలో ఒదిగిపోయె వేళలో సాగనంపి చెల్లెలు… చెరువు కొమ్మ చివరలో మరల మరలి రమ్మని బతుకమ్మని వీడగా

అల్లిపూల వెన్నెల… చెరువులోన కురవగా పూలఇంద్ర ధనస్సులే నేలమీద నిలవగా కొమ్మలన్ని అమ్మలై వేల పూలు విరియగా పుట్టమన్ను మట్టిలో… మట్టి గౌరి పుట్టగా

సై సై హయ్ హయ్ సై సై హయ్ హయ్ సై సై హయ్ హయ్ ఆ ఆ ఆఆ [6]

మూలాలు మార్చు

  1. Eenadu (6 October 2021). "రెహమాన్‌ సంగీత సారథ్యంలో 'అల్లిపూల వెన్నెల' బతుకమ్మ పాట". Archived from the original on 18 October 2021. Retrieved 18 October 2021.
  2. Sakshi (5 October 2021). "'అల్లిపూల వెన్నెల' బతుకమ్మ సాంగ్‌ వచ్చేసింది." Archived from the original on 18 October 2021. Retrieved 18 October 2021.
  3. Telangana Today (2 October 2021). "Gautham Menon shoots and AR Rahman scores music for Bathukamma song this year". Archived from the original on 18 October 2021. Retrieved 18 October 2021.
  4. TV 5 (5 October 2021). "తెలుగువారికి అల్లిపూల వెన్నెలను అందిస్తున్న రెహ్మాన్." (in ఇంగ్లీష్). Archived from the original on 18 October 2021. Retrieved 18 October 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. Eenadu (6 October 2021). "మన మిట్టపల్లిదే 'అల్లిపూల వెన్నెల'". Archived from the original on 18 October 2021. Retrieved 18 October 2021.
  6. Namasthe Telangana (5 October 2021). "జాగృతి ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న పాట ఇదే." Archived from the original on 18 October 2021. Retrieved 18 October 2021.