మిట్టపల్లి సురేందర్
మిట్టపల్లి సురేందర్, వరంగల్ జిల్లాకు చెందిన తెలుగు జానపద, సినీ గీతరచయిత. తెలంగాణ ఉద్యమానికి పాటలకు ఊపిరి పోసిన పల్లెకవి సురేందర్. తలరాతను మార్చే బతుకుకోసం ఎదిరించి పోరాడమని తన పాటల ద్వారా బోధించినోడు మిట్టపల్లి సురేందర్. తెలంగాణ కోసం అమరులైన యువకుల బలిదానాల మీద అతను రాసిన "రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా పాట" బహుళ ప్రజాదారణ పొందింది. దర్శకులు ఆర్.నారాయణమూర్తి ఆ పాటను తన పోరు తెలంగాణ (2011) చిత్రంకోసం వాడుకున్నారు. అదే పాటకుగానూ 2011లో సురేందర్ నంది పురస్కారం అందుకున్నాడు. సురేందర్ ఇప్పటివరకు దాదాపు 300ల పాటలు రాశారు. అందులో 20 పాటలు తొమ్మిది సినిమాలకు రాసినవి ఉన్నాయి.
మిట్టపల్లి సురేందర్ | |
---|---|
జననం | 1985 జనవరి 9 వెల్లంపల్లి , టేకుమట్ల మండలం , జయశంకర్ జిల్లా, తెలంగాణ |
వృత్తి | కవి, గీత రచయిత, గాయకుడు |
మతం | హిందూ |
భాగస్వాములు | సుజిత |
పిల్లలు | 2 |
తండ్రి | నర్సయ్య |
తల్లి | మధునమ్మ |
జీవిత విశేషాలు
మార్చుమధురమైన పాటలు రాసిన మిట్టపల్లి సురేందర్ పుట్టింది పూర్వపు వరంగల్ జిల్లా, ప్రస్తుత జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం, వెల్లంపల్లి గ్రామం. తండ్రి నర్సయ్య, తల్లి మధునమ్మ. అతను రాసిన గేయాలన్నీ బడుగు జీవుల మనసు గాయాలను మాన్పేవేనని సగర్వంగా చెప్పుకుంటాడు సురేందర్. గోరటి వెంకన్న, చంద్రబోస్, అందెశ్రీ, వేటూరి వంటి కవులు రాసిన సాహిత్యం తన పాటలకు స్ఫూర్తిని అంటాడు. సురేందర్ సాహితీ సౌరభాలు తెలంగాణ పల్లెల్లో ప్రతి ఇంటా ఆదరణ పొందాయి. సురేందర్ ప్రైవేట్ సాంగ్స్ మాత్రమే కాకుండా సినిమాల్లో కూడా పాటలు రాసాడు. నాన్స్టాప్, ధైర్యం, రాజన్న, సత్యాగ్రహి వంటి చిత్రాల్లో సినీగీతాలు రాసి సినీ ప్రముఖుల చేత శబాష్ అనిపించుకున్నాడు.[1]
సినీ జీవితం
మార్చుమిట్టపల్లి సురేందర్ 2005లో ‘ధైర్యం’ సినిమాతో సినీగీత రచయితగా సినీరంగంలోకి అడుగు పెట్టాడు. ఆయన తరువాత 2011లో ‘పోరు తెలంగాణ’ సినిమాలో ‘రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా! రక్తబంధం విలువ నీకు తెలియదురా!’ అనే పాటకు నంది పురస్కారం వరించింది. [2]
పని చేసిన సినిమాలు
మార్చు- ధైర్యం (2005) - ‘బైపీసీ బద్మాష్ పోరి బాగుంది మామో’
- పోరు తెలంగాణ (2011) - ‘రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా! రక్తబంధం విలువ నీకు తెలియదురా!’
- రాజన్న (2011) - ‘కాలిగజ్జె ఘల్లుమంటె పల్లెతల్లి మేలుకుంటదో ఓ అమ్మలారా! అక్కలారా!’
- జై తెలంగాణ (2012) - ‘ఆకలి కడుపులు.. చీకటి గడపలు.. ఇంకా ఎంత కాలం?
- భిక్కు రాథోడ్ (2012) - ‘పదరా పదరా.. ఈ కాలం కన్నా వేగంగా..’
- లవ్ అంటే (2013) - ‘మనసే కోరిందిలే నీ చెలిమినే.. ప్రతి జన్మకే’
- అనగనగా ఒక చిత్రం (2015) - ‘చిట్టి చిట్టి నీ మదిని చుట్టు ముట్టి’
- తుపాకీ రాముడు (2019) - ‘కొమ్మా కొమ్మాలొ వెన్నెలగాసే అమ్మా నీ కోసం’
- జార్జిరెడ్డి (2019) - ‘వాడు నడిపే బండి రాయల్ ఎన్‌ఫీల్డ్’
- లవ్ స్టోరి (2021) - ‘నీ చిత్రం చూసి.. నా చిత్తం చెదిరి నే చిత్తరు వైతిరయ్యో’ [3][4]
- చోర్ బజార్ (2022)
- సింబా (2024)
బతుకమ్మ పాట
మార్చుమిట్టపల్లి సురేందర్ 2021లో బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రూపొందిన అల్లిపూల వెన్నెల అనే బతుకమ్మ పాటను రచించాడు.[5]
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-04-14. Retrieved 2017-07-11.
- ↑ Namasthe Telangana (1 May 2021). "ఆ కలం.. పల్లె జీవననాదం!". Namasthe Telangana. Archived from the original on 14 May 2021. Retrieved 14 May 2021.
- ↑ Eenadu (2021). "నీ చిత్రం చూసి.. నా చిత్తం చెదిరి." Archived from the original on 3 December 2021. Retrieved 28 December 2021.
- ↑ Eenadu (3 March 2021). "ఈ కాలం కన్న.. ఒక క్షణ ముందే నే గెలిచి వస్తానని - lovestory song writer". Archived from the original on 21 April 2021. Retrieved 28 December 2021.
- ↑ Eenadu (6 October 2021). "మన మిట్టపల్లిదే 'అల్లిపూల వెన్నెల'". Archived from the original on 18 October 2021. Retrieved 18 October 2021.