అల్లూరి వెంకట సూర్యనారాయణ రాజు

అల్లూరి వెంకట సూర్యనారాయణ రాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్ గా పని చేశాడు.

అల్లూరి వెంకట సూర్యనారాయణ రాజు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
12 మార్చి 1985 నుండి 29 నవంబర్ 1989 వరకు

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1983 - 1989, 1994 - 2004
నియోజకవర్గం రాజోలు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 10 మే 1946
మాయిడ గ్రామం , విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ

జననం, విద్యాభాస్యం మార్చు

అల్లూరి వెంకట సూర్యనారాయణ రాజు 10 మే 1946లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయనగరం జిల్లా, మాయిడ గ్రామంలో జన్మించాడు. ఆయన విజయవాడలోని లయోలా కళాశాలలో ఇంటర్మీడియట్, రాజమండ్రిలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో బీకామ్ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం మార్చు

అల్లూరి వెంకట సూర్యనారాయణ రాజు తూర్పు గోదావరి జిల్లా, రాజోలు మండలం, చింతలపల్లి గ్రామానికి సర్పంచిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. ఆయన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల సంస్థ అధ్యక్షునిగా పని చేశాడు. సూర్యనారాయణ రాజు 1983లో జరిగిన ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా 12 మార్చి 1985 నుండి 29 నవంబర్ 1989 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా పని చేశాడు.[1] అల్లూరి వెంకట సూర్యనారాయణ 1989లో జరిగిన ఎన్నికలలో ఓడిపోయాడు. ఆయన 1994, 1999లో ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి 2004లో ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 1995-1996 వరకు విశేషాధికారాల కమిటీ అధ్యక్షుడిగా, 2000-2001 వరకు ప్రభుత్వ సంస్థల కమిటి అధ్యక్షుడిగా, 2002-2003 వరకు వివిధ శాసనసభ కమిటీకి అధ్యక్షులుగా ఉన్నాడు.

మూలాలు మార్చు

  1. Andrapradesh Legislature (2021). "Former Deputy Speakers - Legislative Assembly". aplegislature.org. Archived from the original on 30 November 2021. Retrieved 31 December 2021.