అవంతిపొర
అవంతిపొర దీనిని అవంతిపూర్ అని పిలుస్తారు.[3] దీని ఇతర పేర్లు అవండిపూర్,[4] వూంట్‌పొర్. ఇది భారతదేశం, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం, పుల్వామా జిల్లాలోని పట్టణం. ఇది జీలం నది ఒడ్డున ఉన్నది. ఈ పట్టణం శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై (ప్రస్తుతం జాతీయ రహదారి నం. 44) శ్రీనగర్‌కు దక్షిణంగా, అనంతనాగ్‌కు ఉత్తరంగా ఉంది. అవంతిపొరకు కాశ్మీరీ రాజు అవంతివర్మన్ పేరు పెట్టారు. అతనిచే నిర్మించబడిన 9వ శతాబ్దానికి చెందిన రెండు హిందూ దేవాలయాల శిథిలాలు నేటికీ ఉన్నాయి.[5]
అవంతిపొర
వూంట్‌పొర్ అవంతిపూర్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 33°55′24″N 75°00′46″E / 33.9232602°N 75.012846°E | |
దేశం | భారతదేశం ( India) |
రాష్ట్రం | జమ్మూ కాశ్మీర్ |
జిల్లా | పుల్వామా జిల్లా |
Named for | అవంతివర్మన్ రాజు |
Elevation | 1,582 మీ (5,190 అ.) |
జనాభా (2011) | |
• Total | 12,647 |
భాషలు | |
• అధికారిక భాషలు | కాశ్మీరి, ఉర్దూ, హిందీ, డోగ్రీ భాష, ఇంగ్లీష్ [1][2] |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 192122 |
టెలిఫోన్ కోడ్ | 01933 |
Vehicle registration | JK 13 |
చరిత్ర
మార్చుక్రీ.శ 855 నుండి 883 వరకు కాశ్మీర్‌ను పరిపాలించిన ఉత్పల రాజవంశానికి చెందిన మొదటి రాజు అవంతివర్మన్ ఈ నగరాన్ని స్థాపించాడు.[6] అవంతివర్మన్ అవంతిపొరలో "అవంతిస్వామి దేవాలయం" అనే పేరుతో విష్ణువు దేవాలయాన్ని నిర్మించాడు. అతను రాజు కావడానికి ముందు అవంతిపొరలో "అవంతీశ్వర" అనే శివాలయాన్ని నిర్మించాడు. అవి మధ్య యుగాలలో నాశనం చేయబడ్డాయి. 20వ శతాబ్దం ప్రారంభంలో పురావస్తు శాస్త్రవేత్త దయా రామ్ సాహ్ని ఆ ప్రదేశంలో త్రవ్వకాలు జరిపినపుడు అవి బయటపడ్డాయి. అవంతిస్వామి ఆలయం 33°55′24″ ఉత్తరం, 75°00′46″ తూర్పున ఉంది, అవంతీశ్వర ఆలయం 33°55′41″ ఉత్తరం, 75°00′16″ తూర్పున ఉంది. ఇవి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంరక్షణలో ఉన్నాయి.
-
అవంతిస్వామి ఆలయం
-
అవంతీశ్వర ఆలయం
జనాభా
మార్చు2001 భారత జనాభా లెక్కల ప్రకారం,[7] అవంతిపొరలో 6,250 జనాభా ఉంది. ఈ జనాభాలో 54% పురుషులు, 46% స్త్రీలు ఉన్నారు. అవంతిపొర సగటు అక్షరాస్యత రేటు 84.38%. ఇది జాతీయ సగటు 74% కంటే ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 91.84%, స్త్రీల అక్షరాస్యత 82.55%. జనాభాలో 9 శాతం 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.
ఎయిర్ ఫోర్స్ స్టేషన్
మార్చుఅవంతిపొర ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పుల్వామాకు 5 కి.మీ దూరంలో అవంతిపొర సమీపంలోని మలంగ్‌పొర వద్ద ఉంది.[8]
ఎయిమ్స్ కాలేజీ
మార్చు2019లో కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్ అవంతిపొరకు దాదాపు రూ.1,828 కోట్ల బడ్జెట్ మంజూరు చేసింది, ఇందులో 300 పడకల సూపర్-స్పెషాలిటీ హాస్పిటల్, మెడికల్ కాలేజీ, 60 మంది విద్యార్థుల సామర్థ్యంతో నర్సింగ్ కాలేజీ ఉంది. దీని నిర్మాణం 31 డిసెంబర్ 2024 నాటికి పూర్తి కానుంది.[9]
మూలాలు
మార్చు- ↑ "The Jammu and Kashmir Official Languages Act, 2020" (PDF). The Gazette of India. 27 September 2020. Retrieved 27 September 2020.
- ↑ "Parliament passes JK Official Languages Bill, 2020". Rising Kashmir. 23 September 2020. Archived from the original on 24 September 2020. Retrieved 30 May 2021.
- ↑ Corlett, Dudley S. (1923), "The Gardens of Kashmir", Art and Archeology, The Archeological Society of Washington, affiliated with the Archeological Institute of America, p. 27
- ↑ "Annual Report 1976-77", Ministry of Education and Social Welfare, Government of India, p. 223, 1976
- ↑ "Awantipora". www.brainwayholidays.com. Archived from the original on 2023-07-25. Retrieved 2023-07-25.
- ↑ "Avantiswami Temple, Avantipur". Archeological Survey of India. Retrieved 23 July 2016.This web-page spells the town Avantipur, and says that it is in Anantnag district, which it was before the creation of Pulwama district in 1979.
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
- ↑ "VIAW pilot info @ OurAirports". web.archive.org. 2019-01-22. Archived from the original on 2019-01-22. Retrieved 2023-07-25.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "AIIMS Awantipora to be completed by Dec 2024". Govt Private Jobs in J&K,JKSSB,JKPSC,JKPolice – J&K Student Alerts. 2021-03-06. Retrieved 2023-07-25.