జీలం నది (Jhelum River) సింధూ నదికి ఉపనది.ఇది పంజాబ్‌లో ప్రవహించే నదులలో పెద్దది. 774 కి.మీ. దూరం ప్రవహించే జీలం నది వేదకాలంలో వితస్థగా పిలువబడింది. కాశ్మీర్ లోయలోని పీర్‌పంజల్ దిగువ భాగాన వెరినాగ్ ప్రాంతంలో జన్మించిన జీలం నది శ్రీనగర్, ఊలర్ సరస్సు గుండా ప్రవహించి పాకిస్తాన్ లో ప్రవేశిస్తుంది. ఈ నది పెద్ద ఉపనది నీలం నది ముజఫరాబాదు వద్ద, తరువాతి పెద్ద ఉపనది కున్హర్ నది కాఘన్ లోయలో జీలం నదిలో కలుస్తున్నాయి. జీలంనది పంజాబ్ రాష్ట్రంలో కలుస్తుంది. తరువాత ఇది పాకిస్తాన్ పంజాబ్‌లోని తీరమైదానంలో ప్రవేశిస్తుంది. చివరికి ట్రిమ్ము వద్ద చీనాబ్ నదిలో సంగమిస్తుంది.[1]

శ్రీనగర్ వద్ద జీలం నది

మూలాలు

మార్చు
  1. "Jhelum River | river, Asia". Encyclopedia Britannica (in ఇంగ్లీష్). Retrieved 2020-12-19.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=జీలం_నది&oldid=3557590" నుండి వెలికితీశారు