అవధేష్ ప్రతాప్ సింగ్

భారతీయ రాజకీయవేత్త

కెప్టెన్ కున్వర్ అవధేష్ ప్రతాప్ సింగ్, (జ.1888 అక్టోబరు-మ.1967 జూన్ 16 కాన్పూర్) మధ్యప్రదేశ్ రాష్ట్రం, సత్నా జిల్లాలోని రాంపూర్ బాఘేలాన్ లో జన్మించాడు. అతను ఒక ప్రముఖ భారతీయ రాజకీయవేత్త, భారత స్వాతంత్ర్య ఉద్యమకారుడు.[1] [2]

అతను మధ్యప్రదేశ్‌లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు.అతను 1952,1960 మధ్య భారత రాజ్యాంగ సభ, తాత్కాలిక పార్లమెంట్, రాజ్యసభ సభ్యుడుగాపనిచేసాడు. అతను1948 లో రేవా (రాచరిక రాష్ట్రం) రాష్ట్రానికి ప్రధాన మంత్రిగా, 1948 నుండి 1949 ఏప్రిల్ 14 వరకు వింధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసాడు.

ప్రతాప్ సింగ్, మహారాజ్ కుమారిని వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. సింగ్ కుమారుడు గోవింద్ నారాయణ్ సింగ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసాడు

అతను 1967 జూన్ 16న కాన్పూర్‌లో మరణించాడు. అతని గౌరవార్థం రీవాలోని విశ్వవిద్యాలయానికి అవధేష్ ప్రతాప్ సింగ్ విశ్వవిద్యాలయంగా అతని పేరును పెట్టారు.[3]

మూలాలు

మార్చు
  1. States of India Since 1947 worldstatesmen.org.
  2. The Hindu Website news article Hindu.com.
  3. "Welcome to APS University". www.apsurewa.ac.in. Retrieved 2021-09-28.

వెలుపలి లంకెలు

మార్చు