అవయవ దానం
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
చనిపోయాక మనిషి తన శరీరంలోంచి 200 అవయవాలు, కణజాలాన్ని దానం చేయవచ్చు. కళ్ళు, గుండె, కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, క్లోమం, పెద్ద పేగు, చిన్నపేగులు, ఎముకలు, మూలుగను దానం చేయవచ్చు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత సగటున ఆరేడుగురికి జీవితం ఇవ్వొచ్చు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన 'జీవనదానం' కార్యక్రమం మార్గదర్శకాలు రూపొందించే దశలో ఉంది.

ఎప్పుడు సేకరిస్తారు?సవరించు
చనిపోయాక అవయవాల మార్పిడి గంటల్లో జరిగిపోవాలి. గుండె ఆగి చనిపోతే కళ్లు, గుండె కవాటాలు వంటి వాటిని 6 నుంచి 24 గంటల్లోపు సేకరించవచ్చు. రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన కేసుల్లో ఎక్కువగా బ్రెయిన్ డెత్‌గా ప్రకటిస్తారు. వీరిని వెంటిలేటర్ నుంచి బయటకు తీసుకొచ్చేలోపు అవయవాలు సేకరించవచ్చు. బయటకు తీసుకొచ్చాక గుండె అయితే నాలుగైదు గంటలు, కాలేయం 8-10 గంటలు, మూత్రపిండాలు 24 గంటల్లోపు సేకరించాల్సి ఉంటుంది.
ఎవరు ఇవ్వొచ్చు?సవరించు
బ్రతికుండగానే అవయవాలు రక్త సంబంధీకులకు దానం చేయవచ్చు. రక్త సంబంధీకులు అంటే అమ్మానాన్న, సోదరి, పాప, బాబు, భార్య. ఇందుకు ప్రభుత్వ అనుమతి అక్కర్లేదు. బతికుండగానే బంధు, మిత్రులకు అవయవదానం చేసేటప్పుడు మాత్రం ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరి. ఆరోగ్యవంతులైన అన్ని వయసులవారు అవయవదానానికి అర్హులే. తన మరణానంతరం శరీరంలోని భాగాలు ఉపయోగించుకునేలా అంగీకారం తెలపవచ్చు. బంధుమిత్రుల ఆమోదంతో వీరి శరీరంలోని అవయవాలను మార్పిడి కోసం సేకరిస్తారు.
రియల్ హీరోసవరించు
టాలీవుడ్ నటుడు జగపతిబాబు 2022 ఫిబ్రవరి 12న తన 60వ పుట్టినరోజు నేపథ్యంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో 2022 ఫిబ్రవరి 11న ఏర్పాటు చేసిన అవయవదాన అవగాహన సదస్సుకు చీఫ్ గెస్టుగా విచ్చేసిన జగపతిబాబు తన మరణాంతరం అవయవదానం చేస్తున్నట్టు ప్రకటించారు. వంద మంది అభిమానులు సైతం ప్రమాణపత్రంపై సంతకం చేసారు.[1]
మూలాలుసవరించు
- ↑ "అవయవదానానికి జగపతిబాబు సమ్మతి". EENADU. Retrieved 2022-02-12.