అవసరాల రామకృష్ణారావు

రచయిత

అవసరాల రామకృష్ణారావు (డిసెంబర్ 21, 1931 - నవంబర్ 28, 2011) కథ, నవల రచయిత.

అవసరాల రామకృష్ణారావు
AVASARALA RAMAKRISHNARAO
Avasarala ramakrishnarao.jpg
అవసరాల రామకృష్ణారావు
జననంఅవసరాల రామకృష్ణారావు
డిసెంబర్ 21, 1931
తూర్పు గోదావరి జిల్లా లో తుని[1]
మరణం2011 నవంబరు 28(2011-11-28) (వయసు 79)
నివాస ప్రాంతంతూర్పు గోదావరి జిల్లా లో తుని
వృత్తిఈయన తుని ఎస్సార్ ఉన్నత పాఠశాల లో ఉపాధ్యాయుడు
ఒరిస్సాలో ఇంగ్లీషు రీడర్
విశాఖపట్టణంలో ఇంగ్లీషు లెక్చరర్
ప్రసిద్ధిప్రముఖ సాహితీవేత్త, నవలా రచయిత
మతంహిందూ
తండ్రిఅవసరాల జగన్నాధరావు పంతులు

1931, డిసెంబర్ 21న చెన్నైలో జన్మించిన రామకృష్ణారావు రచనా జీవితానికి షష్టిపూర్తి చేశారు. తన కథలు, నవలల ద్వారా ‘స్ర్తీ-విముక్తి’ ఆవశ్యకతను చాటారు. ‘సంపెంగలూ-సన్నజాజులూ’ నవల ఆయనకు మంచి పేరు తెచ్చింది. భారతీయ సాంస్కృతిక రాయబారిగా అభిమానులు ప్రేమగా పిలుచుకునే చందమామ పత్రిక తొలి సంచికకు 1947లో కేవలం పదహారేళ్ల వయస్సులో “పొట్టి పిచిక కథ” అనే కథను రాసి పంపారు.[2]

అవసరాల రామకృష్ణారావు డిప్యూటీ కలెక్టర్ అవసరాల జగన్నాధరావు పంతులు గారి ఆఖరి కుమారుడు. తుని లో, 1940 దశకంలో తాండవనది పొంగి వచ్చిన వరదలలో మరణించిన డా. అవసరాల రామదాసు గారి తమ్ముడు.

మరణంసవరించు

2011, నవంబర్ 28హైదరాబాదులో స్వర్గస్థులయారు.

జీవితంసవరించు

 • ఈయన తుని ఎస్సార్ ఉన్నత పాఠశాలలో లెక్కలు, సైన్సు బోధించేవారు.
 • తరువాత ఒరిస్సాలో ఇంగ్లీషు రీడర్ గా పనిచేసేరు.
 • విశాఖపట్నంలో ఇంగ్లీషు లెక్చరర్ గా పనిచేశారు.
 • తెలుగులో నవలలు, కథలు గణనీయంగా రాసి వన్నెకెక్కిన కథా రచయితగా పేరు తెచ్చుకున్నారు.

అందుకున్న కొన్ని పురస్కారాలుసవరించు

 • 1. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ (1969)
 • 2. తెలుగు విశ్వవిద్యాలయం హాశ్యరచయిత పురస్కారం (1994)[3]
 • 3. జ్యేష్ఠ లిటరరీ ఎవార్డ్ ( 1998)
 • 4. కొలసాని చక్రపాణి ఎవార్డ్ (1999)
 • 5. ఢిల్లీ తెలుగు ఎకాడమీ ఉగాది పురస్కారం (2000)
 • 6. ఆంధ్రప్రభుత్వం తెలుగు వైభవం పురస్కారం (2004)

ప్రచురించిన కొన్ని పుస్తకాలుసవరించు

 • 1. మనం మనుష్యులం
 • 2. సహజీవన సౌభాగ్యం
 • 3. ఇంకానా అంతరాలు?
 • 4. అడుగో మావయ్య, ఆ వెనకే మేరీ
 • 5. సంపెంగలూ, సన్ంజాజులూ
 • 6. మేం చేసిన తప్పు మీరూ చేస్తారా?
 • 7. అది ప్రశ్న, ఇది జవాబు
 • 8. హెడ్మిస్ట్రెస్ హేమలత
 • 9. పేకముక్కలు
 • 10. కథావాహిన - 6
 • 11. గణిత విశారద[4]
 • 12. కేటూ, డూప్లికేటూ
 • 13. అర్ధమున్న కథలు
 • 14. రామచిలుక
 • 15. మోహనరాగం
 • 16. మేథమేట్రిక్స్-1
 • 17. మేథమేట్రిక్స్-2
 • 18. మేథమేట్రిక్స్-3
 • 19. అంగ్రేజీ మేడీజీ
 • 20-25. కథల సంపుటాలు

సమకాలీన రచయితలుసవరించు

ఈయన సమకాలీయులు, తునిలో పెరిగిన తెలుగు రచయితలు మరి కొందరు

యితర లింకులుసవరించు

మూలాలుసవరించు

 1. "హెచ్.ఎం.టి.వి. లో కథనం". Archived from the original on 2013-04-30. Retrieved 2013-05-04.
 2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-06. Retrieved 2013-05-04.
 3. "Avasarala Ramakrishna Rao - Telugu Author and Writer - SuKatha".[permanent dead link]
 4. https://www.sukatha.com/seriesList/series?a=aramakrishna&e=1&n=ganithavisarada&t=1518664033000[permanent dead link]