వరద

పొడిగా ఉన్న భూమి మునిగిపోయేలా నీటి ప్రవాహం రావడం లేదా ఎక్కువైన నీరు ఒక్కచోటకి చేరడం
(వరదలు నుండి దారిమార్పు చెందింది)

వరద (ప్రవహించే నీరు), అనగా పొడిగా ఉన్న భూమి మునిగిపోయేలా నీటి ప్రవాహం రావడం లేదా ఎక్కువైన నీరు ఒక్కచోటకి చేరడం.[1] వరదల కారణంగా వ్యవసాయం, సివిల్ ఇంజనీరింగ్, ప్రజారోగ్యం విషయంలో సమస్యలు వస్తాయి.

1908లో హైదరాబాదులోని మూసీనది వరదల్లో సగం మునిగిన బ్రిటీషు రెసిడెన్సీ గేటు

కుంటలు, చెరువు, నది, సరస్సు, సముద్రాల పరిధులను (కట్టలను) దాటి నీరు విస్తరించినపుడు ఈ వరదలు ఏర్పడతాయి.[2] వర్షాకాలంలో సంభవించే మార్పులు, మంచు కరగడం వంటి కారణాల వల్ల నీటి పరిమాణం పెరుగి, పొంగుతుంది. అలా పొంగిన నీరు నివాస, వ్యవసాయ ప్రాంతాలను ముంచకుండా ఉన్నంత వరకూ పెద్ద ప్రభావం ఉండదు.

నదుల కాలువల్లో నీటి పరిమాణం ఎక్కువగా ఉన్నప్పుడు, ముఖ్యంగా కాలువ వంపుల (మెలికలు) వద్ద చాలా వేగంగా ప్రవహించే నీటి ప్రవాహం వలన కూడా ఈ వరదలు వస్తాయి. నదులు, సముద్ర ప్రాంతాలకు దూరంగా వెళ్ళడం ద్వారా ఈ వరద నష్టాన్ని తగ్గించవచ్చు.

వరదల రకాలుసవరించు

వరదల్లో ఈ క్రింది రకాలు ఉన్నాయి.

నదుల ద్వారా సంభవించు వరదలుసవరించు

 • నెమ్మదిగా సంభవించేవి: ఎడతెగని వర్షాల వల్ల లేదా మంచు కరగడం వల్ల నదుల కాలువల పరిమాణాన్ని మించి పొంగిన నీటి ప్రవాహంతో నెమ్మదిగా వరదలు వస్తాయి. వర్షాకాలం, తుఫానుల వలన సంభవించే భారీ వర్షాలు, ఉష్ణోగ్రతలో మార్పుల వల్ల మంచు కరగడం వంటివి ఈ వరదలకు కారణం కావచ్చు.
 • వేగంగా సంభవించేవి: భారీ తుఫానుల కారణంగా అతివేగంగా ప్రవహిస్తున్న ప్రవాహం వల్లగానీ, ఒక ఆనకట్ట నుండి ఒకేసారి విడుదల అయి పొంగుతున్న ప్రవాహం వల్లగానీ వచ్చే ఆకస్మిక వరదల కారణంగా వేగంగా వరదలు వస్తాయి.[3]

బురదతో కూడిన వరదలుసవరించు

నీటి ప్రవాహం వల్ల పంట భూములలో బురదతో కూడిన వరదలు వస్తాయి. పంట భూములలో వేగంగా ప్రవహించే అదనపు నీరు ఒకేచోట చేరడం వల్ల ఈ వరదలు వచ్చే అవకాశం ఉంది.

సముద్ర తీరప్రాంతంలోని వరదలుసవరించు

సముద్రంలో అధిక ఆటుపోట్లు, తుఫాను రావడం వల్ల తీరప్రాంతాలు నీటితో నిండిపోతాయి. సునామిల వల్ల నీటిమట్టం పెరగడంతో తీరప్రాంతాలలో వరదలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో తుఫాను ద్వారా 20 అడుగులు లేదా అంతకంటే ఎక్కువ అడుగుల ఎత్తులో అలలు వచ్చే అవకాశం ఉంది.[4]

 
ఒహియోలోని టోలెడోలోని వాటర్ స్ట్రీట్లో వరదలు, 1881

ప్రభావాలుసవరించు

ప్రాథమిక ప్రభావాలుసవరించు

దీర్ఘకాలిక ప్రభావాలుసవరించు

 • నీటి సరఫరా: పరిశుద్ధమైన త్రాగు నీరు కలుషితమై నీటి కాలుష్యం ఏర్పడుతుంది.
 • వ్యాధులు: నీటి వలన కలిగే రోగాలు వ్యాపిస్తాయి.
 • పంటలు, ఆహార సరఫరా: మొత్తం వ్యవసాయం నాశనం కావడం వల్ల ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుంది.[5] .
 • చెట్లు: శ్వాస అందకపోవడం వల్ల కొన్ని వృక్షజాతులు మరణిస్తాయి.[6]

లాభాలుసవరించు

వరదల వలన జనజీవన వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థలో పలు అంతరాయాలు సంభవిస్తాయి. అయినప్పటికీ, వరదలు వలన భూమి మరింత సారవంతంగా మారడం, తక్కువస్థాయిలో ఉన్న పోషకాలను పెంపొందించడం వంటి పలు ఉపయోగకర లాభాలు ఉన్నాయి. సకాలంలో సంభవించే వరదలు టైగరిస్-యుఫెరెట్స్ నదులు, నైలు నది, సింధూ నది, గంగా నది, ఎల్లో నదుల్లోని పురాతన జీవసముదాయాలు వృద్ధి చెందడానికి చాలా ఉపయోపడతాయి. వరదలు సంభవించే ప్రాంతాల్లో మూలకాల శక్తి ఎక్కువగా ఉంటుంది.

వరదల నియంత్రణసవరించు

ప్రపంచంలోని పలు దేశాలల్లో వరదలకు తరచుగా కారణమయ్యే నదులపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. నదులు పొంగకుండా నియంత్రించడానికి ఆనకట్టలు,[7] గట్టులు, జలాశయాలు వంటివి నిర్మించాలి. వీటిల్లో ఏవైనా విఫలమైనప్పుడు, అత్యవసర పరిస్థితులలో ఇసుక సంచులను లేదా సులభముగా విస్తరించగల ట్యూబ్‌లను ఉపయోగించాలి.

ప్రాణాంతకమైన వరదలుసవరించు

విశ్వవ్యాప్తంగా 100,000 మంది లేదా అంతకంటే ఎక్కువమంది ప్రాణాలను బలిగొన్న ప్రాణాంతక వరదలకు సంబంధించిన వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.

మృతుల సంఖ్య వరద విపత్తు స్థానం సంవత్సరం
2,500,000–3,700,000[8] 1931 చైనా వరదలు చైనా 1931
900,000–2,000,000 1887 ఎల్లో నది వరద చైనా 1887
500,000–700,000 1938 ఎల్లో నది వరద చైనా 1938
231,000 బాంకియావో ఆనకట్ట వైఫల్యం, టైఫూన్ నినా ఫలితం. సుమారు 86,000 మంది ప్రజలు వరదలతో మరణించారు. 145,000 మంది తరువాతి వ్యాధి సమయంలో మరణించారు. చైనా 1975
230,000 2004 హిందూ మహాసముద్రం సునామీ ఇండోనేషియా 2004
145,000 1935 యాంగ్జీ నది వరద చైనా 1935
100,000+ సెయింట్ ఫెలిక్స్ వరద, తుఫాను ఉప్పెన నెదర్లాండ్స్ 1530
100,000 హనోయి, రెడ్ రివర్ డెల్టా వరద ఉత్తర వియత్నాం 1971
100,000 1911 యాంగ్జీ నది వరద చైనా 1911

ఇవికూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

 1. MSN Encarta Dictionary, Flood, Retrieved on 2020-10-20, Archived on 2009-10-31
 2. Glossary of Meteorology (June 2000) Flood Archived 2007-08-24 at the Wayback Machine, Retrieved on 2020-10-20
 3. Jones, Myrtle (2000). "Ground-water flooding in glacial terrain of southern Puget Sound, Washington". Retrieved 2020-10-20.
 4. "Storm Surge Overview". noaa.gov. Retrieved 2020-10-20.
 5. Southasianfloods.org
 6. Stephen Bratkovich, Lisa Burban, et al., "Flooding and its Effects on Trees", USDA Forest Service, Northeastern Area State and Private Forestry, St. Paul, MN, September 1993
 7. Henry Petroski (2006). Levees and Other Raised Ground. 94. American Scientist. pp. 7–11.
 8. Worst Natural Disasters In History Archived 2008-04-21 at the Wayback Machine (2012-06-07), Retrieved on 2020-10-20

ఇతర లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=వరద&oldid=3283974" నుండి వెలికితీశారు