అశోక్ రామాజీ ఉయిక్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు రాలేగావ్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2019లో గిరిజనాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశాడు.[1]

అశోక్ ఉయిక్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2014
ముందు వసంత్ పుర్కే
నియోజకవర్గం రాలేగావ్

పదవీ కాలం
2019 జూన్ 16 – 2019 నవంబరు 12
ముందు విష్ణు సవర
తరువాత కాగ్డా చండియా పద్వి

మహారాష్ట్ర ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు
పదవీ కాలం
4 జూలై 2020 – 8 జూలై 2023
తరువాత ఉత్తమ్ రఘోజీ ఇంగ్లే

వ్యక్తిగత వివరాలు

జననం (1964-01-01) 1964 జనవరి 1 (వయసు 60)
ఘోన్సా, వాని, యవత్మాల్ జిల్లా
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ (2014–ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు శివసేన (2014కి ముందు)
జీవిత భాగస్వామి బినా యుకే
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

అశోక్ ఉయిక్ శివసేన పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో రాలేగావ్ శాసనసభ నియోజకవర్గం నుండి శివసేన టికెట్ ఆశించగా దక్కకపోవడంతో భారతీయ జనతా పార్టీలో చేరి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి వసంత్ పుర్కేపై 38,750 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి వసంత్ పుర్కేపై 9,875 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[3] 2019 జూన్ 16 నుండి 2019 నవంబరు 12 వరకు గిరిజనాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశాడు.[4]

అశోక్ ఉయిక్ 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో రాలేగావ్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి వసంత్ పుర్కేపై 2812 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[5][6]

మూలాలు

మార్చు
  1. Loksatta (27 November 2024). "महायुतीत यवतमाळला तीन मंत्रिपदांची लॉटरी? संजय राठोड, अशोक उईके, इंद्रनील नाईकांची नावे…" (in మరాఠీ). Archived from the original on 13 December 2024. Retrieved 13 December 2024.
  2. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  3. The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  4. India Today (16 June 2019). "Devendra Fadnavis gives Maharashtra cabinet rank to ex-Leader of Opposition Vikhe-Patil Vikhe Patil" (in ఇంగ్లీష్). Archived from the original on 13 December 2024. Retrieved 13 December 2024.
  5. Election Commission of India (23 November 2024). "Maharastra Assembly Election Results 2024 - Ralegaon". Archived from the original on 13 December 2024. Retrieved 13 December 2024.
  6. CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)