వసంత్ పుర్కే

మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు.

వసంత్ చింధుజీ పుర్కే (జననం 3 మే 1956) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను మహారాష్ట్ర శాసనసభకు రాలేగావ్ శాసనసభ నియోజకవర్గం నుండి 1995 నుండి 2009 వరకు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మహారాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా,[1] పాఠశాల విద్యా, క్రీడలు & యువజన సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశాడు.[2]

వసంత్ పుర్కే

పదవీ కాలం
1995 – 2014
ముందు నేతాజీ రాజ్‌గడ్కర్
తరువాత అశోక్ ఉయిక్
నియోజకవర్గం రాలేగావ్

పదవీ కాలం
4 డిసెంబర్ 2010 – 8 నవంబర్ 2014
ముందు మధుకరరావు చవాన్
తరువాత విజయరావు భాస్కరరావు ఆటి

పాఠశాల విద్యా శాఖ మంత్రి
పదవీ కాలం
9 నవంబర్ 2004 – 1 డిసెంబర్ 2008
ముందు సురేష్ జైన్
తరువాత బాలాసాహెబ్ థోరాట్

క్రీడలు & యువజన సంక్షేమ శాఖ మంత్రి
పదవీ కాలం
1 నవంబర్ 2004 – 4 డిసెంబర్ 2008
ముందు రామకృష్ణ మోర్
తరువాత రవిశేత్ పాటిల్

హింగోలి జిల్లా ఇన్​ఛార్జ్ మంత్రి
పదవీ కాలం
1 నవంబర్ 2004 – 4 డిసెంబర్ 2008

వ్యక్తిగత వివరాలు

జననం (1956-05-03) 1956 మే 3 (వయసు 68)
రాలేగావ్ , యవత్మాల్ జిల్లా , మహారాష్ట్ర
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి ప్రేమలత పుర్కే
పూర్వ విద్యార్థి అమరావతి విశ్వవిద్యాలయం ( MA )

రాజకీయ జీవితం

మార్చు

వసంత్ పుర్కే భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1995 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో రాలేగావ్ శాసనసభ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అతను ఆ తరువాత వరుసగా 1999, 2004 & 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై,[3] 2004 నవంబర్ 9 నుండి 2008 డిసెంబర్ 1 వరకు పాఠశాల విద్యా, క్రీడలు & యువజన సంక్షేమ శాఖ మంత్రిగా, 2010 డిసెంబర్ 4 నుండి 2014 నవంబర్ 8 వరకు మహారాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా పని చేశాడు.

వసంత్ పుర్కే 2014, 2019 & 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో వరుసగా ఓడిపోయాడు.[4]

మూలాలు

మార్చు
  1. "After gap of 4 years, Maharashtra to get deputy speaker; election on Nov 30". 30 November 2018. Archived from the original on 13 December 2024. Retrieved 13 December 2024.
  2. "Nagpur Winter Sessions witnessed elections of four Deputy Speakers" (in ఇంగ్లీష్). 12 December 2019. Archived from the original on 13 December 2024. Retrieved 13 December 2024.
  3. "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
  4. Election Commission of India (23 November 2024). "Maharastra Assembly Election Results 2024 - Ralegaon". Archived from the original on 13 December 2024. Retrieved 13 December 2024.