అశ్విని పొన్నప్ప

బ్యాడ్మింటన్ ప్లేయర్

అశ్విని పొన్నప్ప (జననం 1989 సెప్టెంబరు 18) ప్రముఖ భారత బాడ్మింటన్ క్రీడాకారిణి. మహిళా విభాగంలోనూ, మిక్స్డ్ డబుల్స్ లోనూ అశ్వినీ భారతదేశం తరఫున అంతర్జాతీయ టోర్నమెంట్లలో ఆడుతుంటారు. గుత్తా జ్వాలతో కలసి అశ్వినీ ఎన్నో విజయవంతమైన  టోర్నమెంట్లు ఆడారు. వీరిద్దరూ కలసి రాష్ట్రమండల క్రీడల్లో (కామన్  వెల్త్ క్రీడల్లో) బంగారు  పతకం, ప్రతిష్ఠాత్మకమైన ప్రపంచ  చాంపియన్ షిప్ లో కాంస్య పతకం సాధించారు. బిడబ్ల్యూఎఫ్ ప్రపంచ  చాంపియన్ షిప్ ర్యాంకింగ్ లో వీరిద్దరూ నిలకడగా టాప్ 20 స్థానాల్లో  నిలవడం విశేషం. వీరి కెరీర్ లో నెం.10 ర్యాంకును సాధించడం  మైలు రాయిగా చెప్పుకోవచ్చు. అశ్వినీ, జ్వాలా కలసి 2011లో  బిడబ్ల్యూఎఫ్ ప్రపంచ చాంపియన్ షిప్స్ లో కాంస్య పతకం  సాధించడంతో, ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారతీయ జంటగా రికార్డు సృష్టించారు.

అశ్విని పొన్నప్ప
జననం (1989-09-18) 1989 సెప్టెంబరు 18 (వయసు 35)
బెంగుళూరు
వృత్తిబ్యాడ్మింటన్ క్రీడాకారిణి
కౌన్ బనేగా కరోడ్ పతి సెట్స్ మీద సహ క్రీడాకారులతో అశ్విని (గళ్ళ చొక్కా వేసుకున్న వ్యక్తి)

తొలినాళ్ళ జీవితం

మార్చు

బెంగళూరులో 1989 సెప్టెంబరు 18న జన్మించారు అశ్వినీ. ఆమె తండ్రి జాతీయస్థాయి హాకీ క్రీడాకారుడు. కానీ అశ్వినీ హాకీకి బదులు బ్యాడ్మింటన్ నే ఎంచుకుని, అందులో సీరియస్ గా ట్రైనింగ్ తీసుకున్నారు. 

కెరీర్

మార్చు

బెంగుళూరులోని సెయింట్ ఫ్రాన్సిస్ గ్జేవియర్స్ గర్ల్స్ హైస్కూల్ లో ప్రాథమిక, మాధ్యమిక విద్య చదివారు ఆమె. ఆ తరువాత హైదరాబాద్లో డిగ్రీపూర్తి చేశారు. 2004లో సబ్ జూనియర్స్ గర్ల్స్ డబుల్స్ విభాగంలో  మొట్టమొదటి జాతీయ స్థాయి టైటిల్ గెలుచుకున్నారు అశ్వినీ. 2005లో కూడా సబ్ జూనియర్స్ గర్ల్స్ డబుల్స్ టైటిల్ ను సాధించారు. 2006, 2007ల్లో జూనియర్ గర్ల్స్ డబుల్స్ జాతీయ స్థాయి టైటిల్  గెలుచుకున్నారు. 2010లో జరిగిన దక్షిణ ఆసియా క్రీడల్లో  మిక్స్డ్ డబుల్స్  విభాగంలో బంగారు పతకం సంపాదించుకున్నారు  అశ్వినీ. 2010 కామన్ వెల్త్ క్రీడల్లో మహిళల డబుల్స్ విభాగంలో గుత్తా  జ్వాలాతో కలసి బంగారు పతకం గెలిచి, మొట్టమొదటిసారి బంగారు పతకం గెలుచుకున్న జంటగా చరిత్రలో నిలిచారు. ఈ విజయంతో భారతదేశంలో ప్రతీ ఇంట్లో అశ్వినీ, జ్వాలా పేర్లు మారిమోగిపోయాయి.[1]

మూలాలు

మార్చు
  1. Rao, Rakesh (14 October 2010). "Saina wins singles gold". The Hindu. Retrieved 15 October 2010.